Mar 8, 2009

శ్రీమతి ఒక బహుమతి

తారాగణం :చంద్రమోహన్,నరేష్,విసు,జయసుధ,కల్పన
గాత్రం:బాలు
సంగీతం: శంకర్ గణేష్
దర్శకత్వం: విసు
సంస్థ: పవన్ ఎంటర్‌ప్రైజెస్
విడుదల:1987



మహిళా దినోత్సవం సందర్భంగా


పల్లవి:

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం1:

కోతిమంద చేత సేతువే నిర్మింపచేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా
ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండ ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి చండ్రభాను తేజము వెనుక వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాన్ని నడుపుతుంది అటువంటి ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం2:

ధశరధున్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా
అయ్యో భీష్ముడంతటివాణ్ణి అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెరిపింది ఆడదిరా
అహ పల్నాడు నేలంతా పచ్చినెత్తుట్లోన తడిపింది ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
ఈ మగవాన్ని నేడు చెరిచింది ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం3:

పంచపాండవులకు కీర్తి కిరీటలు పెట్టింది ఆడదిరా
అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పోత పోసిన పున్నమంటి తాజ్‌మహలు పునాది ఆడదిరా
అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట ఆమె కథే పాడునురా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం


||

No comments: