May 19, 2009

అమ్మ రాజీనామా

గాత్రం: జేసుదాసు



పల్లవి:

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ

చరణం1:

బొట్టుపెట్టి పూజచేసి
గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి
గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే ఏ ఏ
చెట్టు పెరిగి పళ్ళు పంచితే ఏ ఏ
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా ?
లోకమా ఇది న్యాయమా ?

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ

చరణం2:

ఆకుచాటు పిందె ముద్దు
తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకుచాటు పిందె ముద్దు
తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గుపోసి ఊసు నేర్పితే ఏ ఏ
చేయిబట్టి నడక నేర్పితే ఏ ఏ
పరుగు తీసి పారిపోతే
చేయిమార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా ?
లోకమా ఇది న్యాయమా ?

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ


||

No comments: