Jun 25, 2009

మగమహరాజు

తారాగణం:చిరంజీవి,సుహాసిని
గాత్రం:వాణీ జయరాం
సాహిత్యం:వేటూరి
సంగీతం:కృష్ణ-చక్ర
నిర్మాత:మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
దర్శకత్వం:విజయ బాపినీడు
సంస్థ:శ్యాంప్రాసద్ ఆర్ట్స్
విడుదల:1983

పల్లవి:

సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

చరణం1:

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

చరణం2:

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: