Nov 6, 2009

పెళ్ళిసందడి

గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం1:

తారలెన్ని ఉన్నా ఈ తళుకే నిజం
చలనచిత్రమేమో నీ చక్కని చెక్కెర శిల్పం
మనసు తెలుసుకుంటె అది మంత్రాలయం
కనులు కలుపుకుంటె అది కౌగిలికందని ప్రణయం
ముందు నువ్వు పుట్టి తరువాత సొగసు పుట్టి
పరువానికి పరువైన యువతి
వయసు కన్ను కొట్టి నా మనసు వెన్ను తట్టి
మనసిచ్చిన మరుమల్లికి మరిది
దోరసిగ్గు తోరణాల తలుపు తీసి ఓ ఓ ఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా

చరణం2:

చిలిపి మనసు ఆడే ఒక శివతాండవం
పులకరింత కాదు అది పున్నమి వెన్నెల కెరటం
పెదవిచాటు కవిత మన ప్రేమాయణం
వలపు ముసురుపడితే పురివిప్పిన నెమలి పింఛం
అందమారబెట్టే అద్దాల చీరకట్టే
తడి ఆరిన బిడియాల తరుణి
మనసు బయటపెట్టే మౌనాలు మూటగట్టి
మగసిరిగల దొరతనమెవరిదనీ
బొడ్డుకాడ బొంగరాలు ఆడనేల ఓ ఓ ఓ

చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
ఎర్రబడ్డ కుర్రబుగ్గ ముద్దు పేరు సిగ్గా
లేత పెదవులే పగడ కాంతులు
బొట్టు ఎరుపులే పొద్దుపొడుపులు
రామచిలుక ముక్కుపుడక రమణిపాపకు ఓ ఓ ఓ ఓ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ
చెమ్మ చెక్క చెమ్మచెక్క చారడేసి మొగ్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: