Jan 30, 2010

మాయాబజార్

గాత్రం: మాధవపెద్ది సత్యం
సాహిత్యం: పింగళి నాగేంద్రరావు


నేడే విడుదల రంగుల మాయాబజార్


పల్లవి:

భళి భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయ
భళి భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయ
బహు బాగున్నదయా నీ మాయ

చరణం1:

ఒకరికి ఖేదం ఒకరికి మోదం
సకలము తెలిసిన నీకు వినోదం
నీవారెవరో పై వారెవరో
నీవారెవరో పై వారెవరో
ఆ విధికైనను తెలియదయా
బాగున్నదయా నీ మాయ

చరణం2:

సుఖదుఃఖాలతో గుంజాటనపడు
లోకము నీ చెలగాటమయ
లీలలు మాయలు నీ గుణకథలు
లీలలు మాయలు నీ గుణకథలు
తెలిసినవారే ధన్యులయా

భళి భళి భళి భళి దేవా
బాగున్నదయా నీ మాయా
బహు బాగున్నదయా నీ మాయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment