Feb 1, 2010

మా దైవం పెద్దాయన

తారాగణం: శరత్‌కుమార్,నయనతార,సుజాత
గాత్రం: శ్రీనివాస్,సుజాత
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: రమణీ భరద్వాజ్
దర్శకత్వం: హరి
విడుదల: 2006




పల్లవి:

ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
సిరిమల్లె పూల పరిమళమై ఒదగాలి
ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
సిరిమల్లె పూల పరిమళమై ఒదగాలి
మనువాడువేళ వలపు జడే కురియాలి

చిరుచిరు చినుకుల సవ్వడిలో
నీ తలపుల నడుమున చిక్కుబడ్డా
సన్నజాజి పువ్వులాగ ఒడి చేరి
నీ కళ్ళలోనే కాపురం మొదలుపెట్టా
కొంటెచంద్రుడా నన్ను అదుముకొని
నిండు కౌగిట్లోన సేదతీర్చవా
ఒక మాట నీకు పసితనమా తెలియాలి
సిరిమల్లె పూల పరిమళమై నే ఒదగాలి

చరణం1:

ఊరిలోని పలువీధుల్లో పాదముద్రలెన్నో ఉంటయ్
నీదు అడుగు జాడల కొరకే నా కన్నులు వెదుకుతు ఉంటయ్
చిన్నదాన్ని వెతుకుతు పరుగుపెట్టా
చెలి దొరికిన క్షణమే బయటపెట్టా
నువ్వు నాకు దక్కాలంటూ దేవతలకు ముడుపే కట్టా
వెండికొండనుండే స్వామిని గుండెలోన దాచేదెట్టా
కళ్ళలోని కలలను చెలియా తడితే కంటిముందె నేనుండిపోనా
మనసున దాగున్న మమతై విరిసి ఒడిలో నే పొంగిపోనా
హొ నీవుంటే శిల అయినా శివలింగంలా మారునయా

ఒక మాట నీకు పసితనమా తెలియాలి
తమకాల జ్వాల అణువణువూ రగలాలీ

చరణం2:

ఎవరి పెళ్ళి అవుతూ ఉన్నా
పందిరిలో నిలబడి నేను
మననే వధూవరులుగ తలచి
మురిసి మురిసి పోయేదాన్ని
నిన్నమొన్నదాక ప్రేమ తెలియదన్నా
నిన్ను కలిసిన క్షణమే తెలుసుకున్నా
చందమామ జాడనుపట్టి చెంగులోన ముడివేస్కున్నా
నీలి మంచుబిందువులాగ నిన్ను నేను పెనవేస్కున్నా
ఆనకట్టలాగ ఉందే మనసు నేడు పొంగిపోయినదేల
ఉక్కుమల్లే బిగిసిన హృదయం నేడు పువ్వులాగ మారినదేల
ప్రేమ బలం జతపడితే ఆడతనం విరియునయో

ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
ఒక మాట నీకు పసితనమా తెలియాలి
మనువాడువేళ వలపు జడే కురియాలి
తమకాల జ్వాల అణువణువూ రగలాలీ
చిరుచిరు చినుకుల సవ్వడిలో
నీ తలపుల నడుమున చిక్కుబడ్డా
సన్నజాజి పువ్వులాగ ఒడి చేరి
నీ కళ్ళలోనే కాపురం మొదలుపెట్టా
కొంటెచంద్రుడా నన్ను అదుముకొని
నిండు కౌగిట్లోన సేదతీర్చవా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: