Jun 18, 2010

భద్రకాళి

తారాగణం: మురళీమోహన్,జయప్రద
గాత్రం: ఏసుదాస్, సుశీల
సాహిత్యం: దాశరథి
సంగీతం: ఇళయరాజా(తెలుగులో తొలి సినిమా)
విడుదల: 1976




పల్లవి:

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడి ఉయ్యాలలూపేను
జోలపాట పాడేను లాలిపాట పాడేను

చరణం1:

నీ ఒడిలో నిదురించి తీయనీ కలగాంచి
పొంగి పొంగి పోయాను పుణ్యమెంతో చేశాను
నీ ఒడిలో నిదురించి తీయనీ కలగాంచి
పొంగి పొంగి పోయాను పుణ్యమెంతో చేశాను
ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా
ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా
అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవు
నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌను
గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే
కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే

చరణం2:

స్నానమాడి శుభవేళ కురులలో పువ్వులతో
దేవివలె నీవొస్తే నా మనసు నిలువదులే
అందాల కన్నులకు కాటుకను దిద్దేను
చెడుచూపు పడకుండా అగరు చుక్క పెట్టేను

చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా
నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను
ఎత్తుకుని ముద్దాడి ఉయ్యాలలూపేను
జోలపాట పాడేను లాలిపాట పాడేను
జోలాలీ జోలాలీ
జోలాలీ జోలాలీ జో జో జో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: