Jun 20, 2010

ఉయ్యాల జంపాల

గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం1:

కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు
కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు
శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న
శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న
రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు
రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు
చిలకచేత కబురుపంప చెలుడు రాకపోడమ్మ
బాలరుక్కమ్మా

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కోరుకున్న మగనికొరకు నోచాలమ్మ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం2:

గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి
గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి
ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ
ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ
రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు
రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు
తేరుమీద ప్రియునితోను తేలి సాగిపోవమ్మా
బాలరుక్కమ్మా ఆ ఆ ఆ

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
ఎంత మంచి నోము నువ్వు నోచావమ్మా
రుక్మిణమ్మ రుక్మిణమ్మ
కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ

చరణం3:

అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు
అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు
అంతా గుమిగూడి సై ఆట పాటలాడి
అంతా గుమిగూడి సై ఆట పాటలాడి
తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి
తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి
అట్లతద్దె నోమునోచ అందగాడె మొగుడమ్మా
బాలరుక్కమ్మా ఆ ఆ ఆ

రుక్మిణమ్మ రుక్మిణమ్మ
ఉయ్యాల జంపాల ఊగాలమ్మ
ఉయ్యాల జంపాల ఊగాలమ్మ
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల
ఉయ్యాల జంపాల, ఉయ్యల జంపాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: