గాత్రం: సుశీల
సాహిత్యం: రాజశ్రీ
పల్లవి:
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
చరణం1:
వానాగిపోయిననూ ఆకుపై చుక్కందం
అల చెదిరిపోయిననూ దరినున్న నురుగందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
చరణం2:
అందాల వన్నెలకే అపురూప కురులందం
అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం
మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
నా తోడు నీవుంటే చీకటే ఓ అందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
కన్నులకు చూపందం, కవితలకు ఊహందం
తీగకే పూలందం, వారికే నేనందం
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment