Jun 25, 2010

మగధీర

తారాగణం: రాంచరణ్‌తేజ,కాజల్,శ్రీహరి
గాత్రం: ఆనూజ్ గురువర,రీట
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి
నిర్మాత: అల్లు అరవింద్
సంస్థ: గీతా ఆర్ట్స్
విడుదల: 2009




పల్లవి:

పంచదార బొమ్మ బొమ్మా పట్టుకొవద్దనకమ్మ
మంచుపూల కొమ్మ కొమ్మా ముట్టుకొవద్దనకమ్మ
చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ

చరణం1:

పువ్వు పైన చెయ్యిస్తే కసిరి నన్ను తిట్టిందే
పసడి పువ్వు నువ్వని పంపిందే
నువ్వు రాకు నా వెంట
ఈ పువ్వు చుట్టు ముళ్ళంట
అంటుకుంటే మంటే ఒళ్ళంతా
తీగ పైన చెయ్యిస్తే తిట్టి నన్ను నెట్టిందే
మెరుపు తీగ నువ్వని పంపిందే
మెరుపు వెంట ఉరుమంట
ఉరుము వెంట వరదంట
నే వరద లాగ మారితే ముప్పంట
వరదైన వరమని వరిస్తానమ్మ
మునకైన సుఖమని ముడేస్తానమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

చరణం2:

గాలి నిన్ను తాకింది
నేల నిన్ను తాకింది
నేను నిన్ను తాకితే తప్పా
గాలి ఊపిరి అయ్యింది
నేల నన్ను నడిపింది
ఏవిటంట నీలోని గొప్ప
వెలుగు నిన్ను తాకింది
చినుకు కూడా తాకింది
పక్షపాతమెందుకు నాపైన
వెలుగు దారి చూపింది
చినుకు లాల పోసింది
వాటితోటి పొలిక నీకేల
అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ
నీ చితిలో తోడై నేనొస్తానమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ
నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: