తారాగణం: రాజేంద్రప్రసాద్, ఆమని. రాజా
గాత్రం: బాలు
సాహిత్యం: చైతన్య ప్రసాద్
సంగీతం: ఆర్.పి.పట్నాయక్
నిర్మాత: శ్రీమతి సరితా పట్రా
దర్శకత్వం: చంద్ర సిద్దార్థ
సంస్థ: ప్రేమ్ మూవీస్
విడుదల: 2004
ఒక్కడై రావడం ఒక్కడై పోవటం
నడుమ ఈ నాటకం విధి లీల
వెంట ఏ బంధము రక్త సంబంధము
తోడుగా రాదుగా తుది వేళ
మరణమనేది ఖాయమని
మిగిలెను తీపి గాయమని
నీ బరువు నీ పరువు మోసేది
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు
రాజని పేదని మంచని చెడ్డని
భేధమే ఎరుగని యమపాశం
కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము
హద్దులే చెరిపెనే మరుభూమి
మూటలలోని మూల ధనం
చేయదు నేడు సహగమనం
మన వెంట కడ కంట నడిచేదీ
ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment