Jul 12, 2010

బుల్లెమ్మ బుల్లోడు

గాత్రం: బాలు,రమోలా
సాహిత్యం: రాజశ్రీ

పల్లవి:

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మ
నవ్వులలోన పువ్వులు రువ్వే కొంటె చిట్టెమ్మ
నువ్వేలే నా రాణి నీమీద ఒట్టమ్మ
బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

చరణం1:

ఏయ్ అలా చూస్తావే
ఎలా ఉంది ఒళ్ళు
కావాలా నోర్ముయ్ ఛీపో
నోటితో నువు పొమ్మంటున్నా చూపు నన్నే రమ్మంటుంది
కన్నెపొగరు వద్దంటున్నా మనసు నన్నే కావాలంటుంది
ఈ కోపం ఈ పంతం అంతా నాటకం

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

చరణం2:

ఏయ్ మీద పడతావే
ఒంటరిదాన్ననా వెంటపడుతున్నావ్
హా నన్నే పట్టుకుంటావా నీకెన్ని గుండెలు ఛీపో
గుండెలోన గాలమేసి ఒడుపుగా నువు దోచావు నన్ను
అడుగు దాటి కదలనీను నీడలాగ ఉంటాను నేను
నీ అలక నా పులక పెనవేసుకోవాలి

బుడిగి బుడిగి నిన్నే నిన్నే చూడు బుల్లెమ్మ మాటాడు చిలకమ్మ
నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ
హోయ్ నీకు నాకు జోడి రాశాడు ఆ బ్రహ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: