Sep 3, 2010

శివపుత్రుడు

తారాగణం: విక్రం, సూర్య, సంగీత, లయ, సిమ్రన్
గాత్రం: ఆర్.పి. పట్నాయక్
సాహిత్యం: వనమాలి
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: బాల
సంస్థ: లక్ష్మిగణపతి పిక్చర్స్
విడుదల: 2004




పల్లవి:

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే
కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే

చరణం1:

తుళ్ళుతున్న చిన్ని సెలయేరు
గుండెలోన పొంగి పొలమారు
అల్లుకున్న ఈ బంధమంతా
వెల్లువైనది లోగిలంతా
పట్టెడన్నమిచ్చి పులకించే
నేలతల్లివంటి మనసల్లే
కొందరికే హృదయముంది
నీకొరకే లోకముంది
నీకు తోడు ఎవరంటు లేరు గతములో
నేడు చెలిమి చెయి చాపే వారే బ్రతుకులో
కలిసిన బంధం కరిగిపోదులే
మురళి మోవి విరిని తావి కలిసిన వేళ

చిరుగాలి వీచెనే చిగురాశ రేపెనే
వెదురంటి మనసులో రాగం వేణువూదెనే
మేఘం మురిసి పాడెనే

చరణం2:

మనసున వింత ఆకాశం
మెరుపులు చిందె మనకోసం
తారలకే తళుకు బెళుకా
ప్రతి మలుపూ ఎవరికెరుక
విరిసిన ప్రతి పూదోట
కోవెల ఒడి చేరేనా
ఋణమేదో మిగిలి ఉంది
ఆ తపనే తరుముతోంది
రోజూ ఊయలే ఊగే రాగం గొంతులో
ఏవో పదములే పాడే మోహం గుండెలో
ఏనాడూ తోడు లేకనే
కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే

కరుకైన గుండెలో చిరుజల్లు కురిసెనే
తనవారి పిలుపుతో ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
ఆశలు వెల్లువాయెనే ఊహలు ఊయలూపెనే
చినుకు రాక చూసి మది చిందులేసెనే
చిలిపి తాళమేసి చెలరేగి పోయెనే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: