గాత్రం: వాణి జయరాం
విడుదల: 1978
పల్లవి:
పువ్వులే నవ్వెనే కోయిల గానం పాడెనే
మువ్వలా నా ఎద నాట్యం ఆడి పొంగెనే
పువ్వులే నవ్వెనే కోయిల గానం పాడెనే
మువ్వలా నా ఎద నాట్యం ఆడి పొంగెనే
చరణం1:
వలపులు తీరే తరుణమే
వయసే తీయని వసంతమే
వలపులు తీరే తరుణమే
వయసే తీయని వసంతమే
కన్నెకు పెళ్ళైతే కలలే ఫలించునే
మంగళ నాదము వినిపించగానే
మంగళ నాదము వినిపించగానే
మాలిని హృదయమే మురియునే ఈ క్షణాన
పువ్వులే నవ్వెనే కోయిల గానం పాడెనే
మువ్వలా నా ఎద నాట్యం ఆడి పొంగెనే
చరణం2:
తొలి కలయికలో భలే సుఖం
కౌగిట నలుగును కన్నెతనం
తొలి కలయికలో భలే సుఖం
కౌగిట నలుగును కన్నెతనం
రేగే విరహాన పొంగే పరువాన
ఆగని ఆవేశం అందించు హాయి
ఆగని ఆవేశం అందించు హాయి
తీయని ఆ సుఖం తెలియునే నేటి రేయి
పువ్వులే నవ్వెనే కోయిల గానం పాడెనే
మువ్వలా నా ఎద నాట్యం ఆడి పొంగెనే
పువ్వులే నవ్వెనే కోయిల గానం పాడెనే
మువ్వలా నా ఎద నాట్యం ఆడి పొంగెనే
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment