Oct 8, 2010

ఏమొకో చిగురుటధరమున

గాత్రం: బాలు
సాహిత్యం: అన్నమయ్య

పల్లవి:

ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

చరణం1:

కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువము
కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపై తోచిన చెలువము
ఇప్పుడిదేమో చింతింపరే చెలులు
నలువున ప్రాణేశ్వరునిపై నాటిన ఆ కొనచూపులు
నిలువున పెరుకగ అంటిన నెత్తురు కాదు కదా

ఏమొకో ఏమొకో
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

చరణం2:

ముద్దియ చెక్కుల కెలకుల ముత్యపు జల్లుల చేర్పుల ఒద్దికలాగులివేమో
ఊహింపరే చెలులు
గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున
అద్దిన సురతపు చెమటల అందము కాదు కదా

ఏమొకో ఏమొకో
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
భామిని విభునకు వ్రాసిన
భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా
ఏమొకో చిగురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను
ఏమొకో ఓ ఓ ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

2 comments:

కొత్త పాళీ said...

గద్దరి తిరువేంకటపతి కామిని వదనాంబుజమున

విహారి(KBL) said...

ధన్యవాదాలు కొత్తపాళి గారు తప్పు సరిజేసినందుకు