Feb 16, 2011

రాజా

గాత్రం: మనో,చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి:

మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతినిమిషానా
మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చరణం1:

చిన్న చిన్న సంగతులే సన్నజాజి విరిజల్లు
తుళ్లుతున్న అల్లరులే ముళ్లులేని రోజాలు
అందమైన ఆశలే చిందులాడు ఊహలే నందనాల పొదరిళ్లు
గుప్పెడంత గుండెలో గుప్పుమన్న ఊసులే చందనాలు వెదజల్లు
ఓ వన్నెల పరవళ్లు పున్నాగ పరిమళాలు
వయసే తొలిచిత్రం చూసే సమయాన
మైమరచే ఆనందాలే ప్రతినిముషాన

మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా

చరణం2:

కొమ్మలేని కుసుమాలు కళ్లలోని స్వప్నాలు
మొగలిపూల గంధాలు మొదలయ్యేటి బంధాలు
కోరుకున్న వారిపై వాలుతున్న చూపులే పారిజాత హారాలు
ముద్దుగుమ్మ ఎదలో మెగ్గవిచ్చు కధలే ముద్దమందారాలు
హొయ్ నిత్య వసంతాలు ఈ పులకింతల పూలు
ఎపుడు వసివాడని వనమై హృదయాన
మైమరచే ఆనందాలే ప్రతి నిముషాన

మల్లెలవాన మల్లెలవాన నాలోన
మనసంతా మధుమాసంలా విరబూసేనా
మనసంతా మధుమాసంలా విరబూసేనా
కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా
తేనెల జలపాతంలా సరదాలే చెలరేగేనా
విరిసే అరవిందాలే అనిపించేనా
మైమరచే ఆనందాలే ప్రతినిమిషానా

||

No comments: