Mar 2, 2011

మనీ

గాత్రం: శ్రీ, సిరివెన్నెల, రాంగోపాల్‌వర్మ
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు
ఇంక వేసేయ్ మరో హాహా డోసు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు
ఇంక వేసేయ్ మరో డోసు
పిచ్చెక్కి ఆడియెన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు
చెప్పింది చెయ్యరా నీవేరా ముందు డేసు
వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు

చరణం1:

అమితాబచ్చన్ కన్నా ఏం తక్కువ నువ్వైనా
హాలీవుడ్‌లో ఐనా ఎవరెక్కువ నీకన్నా
ఫైటు ఫీటు ఆట పాట రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టారు అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే సడన్‌గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషు నాగార్జున నరేషు
రాజేంద్రుడు సురేషు రాజశేఖరు అదర్సు
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు

చరణం2:

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే
ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే
ఒహో అంటూ జైకొడతారు తేడా మేకప్పే
నువ్వుంటే చాల్లే అంటారు
కథెందుకు పోన్లే అంటారు
కటౌట్లు గట్రా కడతారు
టికెట్లకు కొట్టుకు చస్తారు
బాగుంది గాని ప్లాను పల్టి కొట్టిందో ఏమిగాను
బేకారి బాత్ మాను జర జారు తగ్గించు ఖాను
అరె చీ ఫో శకున పక్షిలా తగులుకోకు ముందు

వారేవా ఏమి ఫేసు
అచ్చు హీరోలా ఉంది బాసు
వచ్చింది సినిమా చాన్సు
ఇంక వేసేయ్ మరో డోసు


||

No comments: