Mar 7, 2011

మామాశ్రీ

గాత్రం: సుశీల,శైలజ



పల్లవి:

ఆడపిల్లలం ఆదిశక్తులం
కోడెగాళ్ళకే వాడికత్తులం
ఆడపిల్లలం ఆదిశక్తులం
కోడెగాళ్ళకే వాడికత్తులం
సహజంగా సీతలం సమర సత్యభామలం
సహజంగా సీతలం సమర సత్యభామలం
పుట్టినింటి పువ్వులం మెట్టినింటి దివ్వెలం
లాలా లాలా లాలలాల
లాలా లాలా లాలలాల
ఆడపిల్లలం ఆదిశక్తులం
కోడెగాళ్ళకే వాడికత్తులం

చరణం1:

వెట్టిచాకిరి చేత ఊపిరి ఇగిరే ఇంతుల గోడు
అర్దరాత్రిలో అడ్డరోడ్డులో ఎవ్వరు ఆమెకి తోడు
భర్త పాన్పుకి బిడ్డ కాన్పుకి పనికొచ్చే స్త్రీ పరువాలు
వంట ఇంటిని దాటకూడని వనితల దీనముఖాలు
శతాబ్దాల పురుషిడి పాపం సంస్కృతికే పెట్టిన శాపం
శతాబ్దాల పురుషిడి పాపం సంస్కృతికే పెట్టిన శాపం
కారాదోయి నేటి భారతం మారాలోయి స్త్రీల జీవితం
లాలా లాలా లాలలాల
లాలా లాలా లాలలాల

ఆడపిల్లలం ఆదిశక్తులం
కోడెగాళ్ళకే వాడికత్తులం

చరణం2:

ఆ మహాత్ముడు ఎంత చెప్పినా మనసు మారని లోకంలో
మర్చిపోయినా బుగ్గి కాదులే మహిళ జీవితం శోకంలో
జన్మనిచ్చిన ఆడదానికి జాతి వందనం చేయిస్తాం
కుళ్ళిపోయిన కుతంత్రాలలో స్వతంత్రాగ్నులే రగిలిస్తాం
విలయకాల విప్లవశంఖం వినని నాడు తప్పదు దుఖం
విలయకాల విప్లవశంఖం వినని నాడు తప్పదు దుఖం
ఆపాలోయి మగ చదరంగం మారాలోయి మన రాజ్యాంగం

లాలా లాలా లాలలాల
లాలా లాలా లాలలాల
ఆడపిల్లలం ఆదిశక్తులం
కోడెగాళ్ళకే వాడికత్తులం
సహజంగా సీతలం సమర సత్యభామలం
సహజంగా సీతలం సమర సత్యభామలం
పుట్టినింటి పువ్వులం మెట్టినింటి దివ్వెలం
లాలా లాలా లాలలాల
లాలా లాలా లాలలాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment