తారాగణం: అనిల్, మహేశ్వరి, ప్రకాష్‌రాజ్
గాత్రం: బాలు
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: జాన్
నిర్మాత: క్రాంతికుమార్
సంస్థ: శ్రీ క్రాంతి చిత్ర
విడుదల: 1999
పల్లవి:
చిన్నిపాదాల చినుకమ్మ
స్వాతిముత్యాలు చిలుకమ్మ
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మ
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందించేదెపుడమ్మ
మువ్వై నువ్వు నాలో నవ్వేదెపుడమ్మ
చిన్నిపాదాల చినుకమ్మ
స్వాతిముత్యాలు చిలుకమ్మ
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మ
చరణం1:
అదుపు లేని పరుగా ఇది
కదలలేని పదమా ఇది
ఏమో మరి ఈ సంగతీ
అలల లయల పిలుపా ఇదీ
చిలిపి తలపు స్వరమా ఇది
ఏమో మరి ఎద సవ్వడి
మాటైన రానంత మౌనాల
ఏ భాషకి రాని గానాలా
మన జంటె లోకంగ మారాల
మన వెంటె లోకాలు రావాలా
బదులియ్యవా ప్రణయమా
చరణం2:
శ్వాస వేణువై సాగినా
వేడి వేసవై వేగినా
భారం నీదే ప్రియభావమా
ఆశకి ఆయువై చేరినా
కలల వెనక నే దాగినా
తీరం నువ్వే అనురాగమా
దూరాన్ని దూరంగ తరిమేసి
ఏకాంతమే ఏలుకుందామా
ఊహల్లో కాలాన్ని ఉరివేసి
గాల్లుల్లో ఊరేగుతున్నామా
తెలిసేన ఓ ప్రియతమా
చిన్నిపాదాల చినుకమ్మ
స్వాతిముత్యాలు చిలుకమ్మ
పంచవర్ణాల చిలకమ్మా
మంచి ముచ్చట్లు పలుకమ్మ
నిన్ను నన్ను కలిపి కన్యాదానం జరిపి
మిన్ను మన్ను ఆనందించేదెపుడమ్మ
మువ్వై నువ్వు నాలో నవ్వేదెపుడమ్మ
చిన్నిపాదాల చినుకమ్మ
స్వాతిముత్యాలు చిలుకమ్మ
పంచవర్ణాల చిలకమ్మ
మంచి ముచ్చట్లు పలుకమ్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment