Mar 11, 2011

రాజా

గాత్రం: రాజేష్,సుజాత
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి:

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్లకే రావమ్మ
చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా
తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా
ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమ
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్తవరదలా రామ్మా ప్రేమ
కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్లకే రావమ్మ

చరణం1:

అందమైన బంధనాల వరమా
వందనాల చందనాలు గొనుమా
కలే తీరగా ఒడే చేరుమా
సున్నితాల కన్నె లేత నడుమా
కన్నుతోనే నిన్ను కాస్త తడిమా
ఇదే తీరుగా ఎదే మీటుమా
సాయం కావాలన్నది కాయం ఓ ప్రేమా
చేయందిస్తా రామరి సరదా పడదామా
నీవెంటే నీడై వుంటా నిత్యం ఓ ప్రేమా

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్లకే రావమ్మ

చరణం2:

వేడుకైన ఆడ ఈడు వనమా
వేడివేడి వేడుకోలు వినుమా
వయ్యారాలలో విడిది చూపుమా
ఆగలేని ఆకతాయి తనమా
వేగుతున్న వేగమాప తరమా
సుతారాలతో జతై చేరుమా
తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మా
భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మ
నాప్రాణం నీవే అంటే నమ్మాలే ప్రేమ

కవ్వించకే ఓ ప్రేమా కౌగిళ్లకే రావమ్మ
చల్లనైన ఓ ప్రేమా చందమామలా రామ్మా
తీయనైన ఓ ప్రేమా తేనెవానలా రామ్మా
ఎదలో ఊయలూగుమా హాయిరాగమా
వేయి కలల చిరునామా ప్రేమ
స్వాతి చినుకులా సందెవెలుగులా
కొత్తవరదలా రామ్మా ప్రేమ

||

No comments:

Post a Comment