May 18, 2011

ఘర్షణ

గాత్రం: సునీత సారథి,ఫెబి మణి
సాహిత్యం: కులశేఖర్




పల్లవి:

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా
నా కోడె ఎదలో వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా

సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా
వయ్యారం దాచిపెట్టకే దేహమా
ఎదలోనె కొత్త అల్లరి మౌన మోహమా
పరువాలే పల్లవించే రాగమా
ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

చరణం1:

ఇంటిలోన వాస్తు మొత్తం
కొత్తగా ఉంది నేస్తం
మార్చేశా మరి నీకోసం
ఎదురుగా ఉంది అందం
తపనలే తీర్చు మంత్రం
చేస్తావా ఒడిలో ఓ యాగం
సలసల మంది కన్నె రక్తం
కలబడమంది కాలచక్రం
కలవమంటేను నీకు కలవరమా

ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా
ఆడతనమా చూడతరమా ఆపతరమా పూలశరమా

చరణం2:

పరువమా పరువమా
పరువమా పరువమా
మనసులో మదనరూపం
తనువులో విరహతాపం
నాలో రేపి ఏదో దాహం
సరసమే మనకు సర్వం
సుఖములో చిలిపి స్వర్గం
పరువాలే పరిచింది దేహం
తలపడమంది పూల తల్పం
తొరపడమంది పాలశిల్పం
చిన్ని కలలోనె ఇంత పరవశమా

నా కోడె ఎదలో వేడితనమా
కుర్రాళ్ళ గుండెల్లో కొంటె స్వరమా
కంటిపాపకి అందాల వరమా
సింగారం చిందులేసిన కన్నె ప్రాయమా
వయ్యారం దాచిపెట్టకే దేహమా
ఎదలోనె కొత్త అల్లరి మౌన మోహమా
పరువాలే పల్లవించే రాగమా
మోహమా మోహమా మోహమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment