Aug 8, 2011

దశావతారం

గాత్రం: హరిహరన్
సాహిత్యం: వెన్నెలకంటి



పల్లవి:


ఓం నమో నారాయణాయ

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు
హరిని తలచు నా హృదయం నేడు హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవుల్నేం చేస్తారు ఆ యమ కింకరులు

చరణం1:

నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను మీకు వంచనులే
నిలువునా నువు చీల్చుతున్నా మాట మార్చనులే
వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం మోగదులే
ప్రభువు ఆనతికి జడిసే నాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాధుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడు ఈ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజలకు రాజు ఈ రంగరాజనే

చరణం2:

నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలి వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంటా
దైవం కొసం పోరే సమయం లేదంటా

రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment