గాత్రం: బాలు, జానకి
సాహిత్యం: వేటూరి
పల్లవి:
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
మొగ్గ విచ్చుకున్న వేళ కలువభామా
ముద్దులన్ని లెక్కపెట్టె చందమామ
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
చరణం1:
గుట్టు లేని గుండెలో గుచ్చి గుచ్చి చూడకు
మల్లెపూల దండలో దారమింక దాచకు
గుట్టు లేని గుండెలో గుచ్చి గుచ్చి చూడకు
మల్లెపూల దండలో దారమింక దాచకు
కొంటెగా చూడకు కోక సిగ్గు మాత్రము
కంటితో తుంచనీ కన్నె జాజి పుష్పము
మోగుతున్న యవ్వనం వేగుచుక్క కోరునా
కాగుతున్న పాలలో మీగడింక దాగునా
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు పూజలా
మొగ్గ విచ్చుకున్న వేళ కలువభామా
ముద్దులన్ని లెక్కపెట్టె చందమామ
ప్రేమతో చిలకమడుపు సేవలా
సిగ్గుతో చిలిపి వలపు ఉహుహు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment