గాత్రం: మల్లికార్జున్
సాహిత్యం: సీతారామశాస్త్రి
పల్లవి:
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
చరణం1:
ఏ కోవెలో చేరాలని కలగన్న పూ బాలకి
సుడిగాలిలో సావాసమై దొరికింది ఈ పల్లకి
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
చరణం2:
కాలానికే తెలియాలిగా ముందున్న మలుపేమిటో
పోరాటమే తేల్చాలిగా రానున్న గెలుపేమిటో
ఈ ఒక్కడు నీ సైన్యమై తోడుంటే చాలు
సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment