Feb 1, 2014

ప్రేమాభిషేకం

తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు,శ్రీదేవి,జయసుధ
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
దర్శకత్వం: దాసరినారాయణరావు
సంస్థ: అన్నపూర్ణ స్టూడియోస్
విడుదల:1981



నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

చరణం1:

మరులు పూచిన పూల పందిరిలో
మమతల్లల్లిన ప్రేమ సుందరికి పట్టాభిషేకం..పట్టాభిషేకం
మనసు విరిచినా మమత మరువని
మధుర జీవిత మానవ మూర్తికి మంత్రాభిషేకం మంత్రాభిషేకం
రాగాల సిగలో అనురాగాల గుడిలో
భావాల బడిలో అనుభవాల ఒడిలో
వెలసిన రాగ దేవత రాగాభిషేకం
గెలిచిన ప్రేమ విజేత ప్రేమాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

చరణం2:

కలల చాటున పెళ్ళి పల్లకిలో
కదలి వచ్చిన పెళ్ళి కూతురికి పుష్పాభిషేకం పుష్పాభిషేకం
పాట మారినా పల్లవి మార్చని
ప్రణయ లోకపు ప్రేమ మూర్తికి స్వర్ణాభిషేకం స్వర్ణాభిషేకం
స్వప్నాల నింగిలో స్వర్గాల బాటలో
బంగారు తోటలో రతనాల కొమ్మకు
విరిసిన స్వప్న సుందరి క్షీరాభిషేకం
కొలిచిన ప్రేమ పూజారి అమృతాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో
నిదురించే అనురాగం కురిపించే అభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం
ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jan 30, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు




నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని


చరణం1:

నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని
ఊరూవాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళని
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమని
ఊరూవాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళని
ప్రేమకే పెళ్ళని ఈ పెళ్ళే ప్రేమని
ప్రమా పెళ్ళని జంటని నూరేళ్ళ పంటని
నూరేళ్ళ పంటని

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని

చరణం2:

గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని
గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని
పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని
తోడంటే నేనని చెలిమంటే నువ్వని
నువ్వూ నేను జంటని నూరేళ్ళ పంటని
నూరేళ్ళ పంటని

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతుంది
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని
నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jan 28, 2014

ప్రేమాభిషేకం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: దాసరి నారాయణరావు



నాగేశ్వరరావుకి అశ్రునివాళి

పల్లవి:

దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైన
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా

చరణం1:

మౌనభంగము మౌనభంగము భరియించదు ఈ దేవి హృదయము
ప్రేమపాఠము ప్రేమపాఠము వినకూడదు ఇది పూజా సమయము
దేవి హృదయము విశాలము భక్తునికది కైలాసము
హే దేవి హృదయము విశాలము భక్తునికది కైలాసము
కోరిక కోరుట భక్తుని వంతు
అడగక తీర్చుట దేవత వంతు
ధూపం వేయుట భక్తుని వంతు
పాపము మోయుట దేవుని వొంతు
పాపానికి మోక్షం ధూప దర్శనం
ఈ ప్రాణికి మోక్షం నామస్మరణం నీ నామస్మరణం

దేవి దేవి దేవి కోపమా శ్రీదేవి కోపమా
దేవి కోపమా శ్రీదేవి కోపమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైన
దేవి కోపమా శ్రీదేవి కోపమా
దేవి కోపమా శ్రీదేవి కోపమా

చరణం2:

స్వామి విరహము అహొరాత్రము
చూడలేదు నీ దేవి హృదయము
దేవి స్తోత్రము నిత్య కృత్యము
సాగనివ్వదు మౌనవ్రతము
స్వామి హృదయం ఆకాశము దేవికి మాత్రమే అవకాశము
స్వామి హృదయం ఆకాశము దేవికి మాత్రమే అవకాశము
అర్చన చేయుట దాసుని వంతు
అనుగ్రహించుట దేవత వంతు
కోపం తాపం మా జన్మ హక్కు
పుష్పం పత్రం అర్పించు మొక్కు
నా హృదయం ఒక పూజా పుష్పం
నా అనురాగం ఒక ప్రేమ పత్రం నా ప్రేమ పత్రం

దేవి దేవి దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
నీకై జపించి జపించి తపించి తపించు భక్తుని పైన
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా
దేవి మౌనమా శ్రీదేవి మౌనమా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~