Mar 30, 2009

మహామంత్రి తిమ్మరుసు

గాత్రం:ఎస్.వరలక్ష్మి



పల్లవి:

లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైన తెలియనుగా
తెలిసీ తెలియని బేలలకడ నీ జాలములేవీ చెల్లవూగా
లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైన తెలియనుగా

చరణం1:

వేణుగానమున చేరగ వీచే మౌనము పూనగ ఏలనో
వేణుగానమున చేరగ వీచే మౌనము పూనగ ఏలనో
అలక ఏమోయని దారిరాకుండిన జాలిగ చూచేదేలనొ
లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైన తెలియనుగా

చరణం2:

నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
నీ చిరునవ్వుల వెన్నెలలో మైమరువగ చేయగ ఏలనో
మైమరచిన చెలి మాటే లేకని ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మైమరచిన చెలి మాటే లేకని ఓరగ చూచేదేలనో

లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైన తెలియనుగా
తెలిసీ తెలియని బేలలకడ నీ జాలములేవీ చెల్లవూగా
లీలాకృష్ణ నీ లీలలు నే లీలగనైన తెలియనుగా


||

Mar 28, 2009

స్వాతి

తారాగణం :భానుచందర్,సుహాసిని,జగ్గయ్య,శారద,శరత్ బాబు
గాత్రం:బాలు,శైలజ
సంగీతం :చక్రవర్తి
దర్శకత్వం ‌:క్రాంతికుమార్
సంస్థ: శ్రీ క్రాంతి చిత్ర
విడుదల:1984



పల్లవి:

పండు పండు నా బుజ్జిపండు రేపటికిస్తాను రేగు పండు
సైటు కొట్టడం పైట లాగటం నేర్చుకుంటె మంచిదంట కవ్విస్తున్న కళ్ళవాడ ఆ ఆ ఆ ఆ
పండు పండు నా బుజ్జిపండు ముద్దు ముద్దుకి నా నోరు పండు
సిగ్నలివ్వటం సిగ్గు పెంచటం కోరి నాకు నేర్పుకోవె కోలకళ్ళ చిన్నదానా

చరణం1:

రారా నా సామిరంగ ఆసామి నువ్వే అందాలకి
నీదేరా ఈ పూలతోట ఆడుకో అందాల వేట
రాణి రవ్వంత కానీ రాగల బోణి ఈ పూటకి
గుట్టు దాటిపోతేను ఎట్టా గూడు దాటినా ఈడు పిట్ట
వళ్ళంతా ఎండెక్కి వయసంతా గుండెక్కె
అంతో ఇంతో ఆదుకోర చెంత చేరి చిన్నవాడా
పండు పండు నా బుజ్జిపండు రేపటికిస్తాను రేగు పండు

చరణం2:

నవ్వు నీగుమ్మ నవ్వు దానిమ్మపువ్వు దక్కించవా
పువ్వులే పండించుకుంటా పులుపంత నే నంజుకుంట
సిగ్గు ఆనాటి సిగ్గు వచ్చింది తగ్గు కవ్వించక
సిగ్గు వుంటె సింగారమంట వున్న సిగ్గు ఊదేయకంట
ఈ పూట నలుపెక్కె నీ బుగ్గ ఎరుపెక్కె
రేగిందంటె రేపుమాపు ఎట్టాగంట నీతో తంట

పండు పండు నా బుజ్జిపండు రేపటికిస్తాను రేగు పండు
సిగ్నలివ్వటం సిగ్గు పెంచటం కోరి నాకు నేర్పుకోవె కోలకళ్ళ చిన్నదానా
పండు పండు నా బుజ్జిపండు ముద్దు ముద్దుకి నా నోరు పండు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 26, 2009

భక్త ప్రహ్లాద

గాత్రం: సుశీల



పల్లవి:

జీవము నీవే కదా దేవా
జీవము నీవే కదా దేవా
బ్రోచే భారము నీదే కదా
నా భారము నీదే కదా

చరణం1:

జనకుడు నీపై కినుక వహించి
నను వధియింప మదినెంచే
జనకుడు నీపై కినుక వహించి
నను వధియింప మదినెంచే
చంపేదెవరు సమసేదెవరు
చంపేదెవరు సమసేదెవరు
సర్వము నీవే కదా స్వామీ
సర్వము నీవే కదా స్వామీ

నిన్నేగాని పరులనెరుంగ రావె వరదా
బ్రోవగ రావే వరదా వరదా
అని మొరలిడగా కరి విభుగాచిన
అని మొరలిడగా కరి విభుగాచిన
స్వామివి నీవుండ భయమేలనయ్యా
హే ప్రభో హే ప్రభో
లక్ష్మి వల్లభ దీన శరణ్య
లక్ష్మి వల్లభ దీన శరణ్య
కరుణా భరణ కమలలోచన
కరుణా భరణ కమలలోచన
కన్నుల విందును చేయగ రావె
కన్నుల విందును చేయగ రావె
ఆశ్రిత భవ బంధ నిర్మూలన
ఆశ్రిత భవ బంధ నిర్మూలన
లక్ష్మి వల్లభ లక్ష్మి వల్లభ

చరణం2:

నిన్నే నమ్మి నీ పద యుగళే సన్నుతి చేసే భక్తావళికి
మిన్నాగులగన భయమదియేల పన్నగశయన నారాయణ

జీవము నీవే కదా దేవా
జీవము నీవే కదా దేవా
బ్రోచే భారము నీదే కదా
నా భారము నీదే కదా

చరణం3:

మదిలో వెలిలో చీకటి మాపి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మదిలో వెలిలో చీకటి మాపి
పదము చూపే పరమ పావన
పదము చూపే పరమ పావన

జీవము నీవే కదా దేవా
జీవము నీవే కదా దేవా
బ్రోచే భారము నీదే కదా
నా భారము నీదే కదా

చరణం4:

భవ జలదినిబడి తేలగలేని
భవ జలదినిబడి తేలగలేని
జీవుల బ్రోచే పరమ పురుష
నను కాపాడి నీ బిరుదమును
నను కాపాడి నీ బిరుదమును
నిలుపుకొంటివా శ్రితమందార

జీవము నీవే కదా దేవా
జీవము నీవే కదా దేవా
బ్రోచే భారము నీదే కదా
నా భారము నీదే కదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 24, 2009

అమ్మ

గాత్రం:జానకి



పల్లవి:

లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టినరోజు
కంట్లోనే ఓ పాప పుట్టినరోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకీ
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే

చరణం1:

కోకిలపాటలతో ఆకలి తీరెనులే
లోకువచేసే లోకుల కాకుల కేకలు చెల్లవులే
వెన్నెల నవ్వులతో కన్నులు పండెనులే
నీటికి సోకిన ఎండల గుండెల రంగులు పొంగెనులే
శిలగానే పడివుంటే వినపడెను ఓ శిశువాణి సుఖపడగ గతప్రాణి
చిలిపిగ చిలకల కొలికి పలుక
ముంగిళ్ళే ముత్యాల ముగ్గులు వేసే
వాకిళ్ళే చిన్నారి వంతలు పాడే
ఇక నీతోడెమో నీడ ఈ అమ్మకి
లలలలా సంగీతమే సంతోషమే

చరణం2:

చుక్కల బుగ్గలకి చూపులు సోకవులే
అమ్మల అక్కల అందరి కళ్ళకు గంతలు పడ్డవిలే
కౌగిలి బిడ్డలకి కాకలు సోకవులే
గుప్పిట మూసిన గోళ్ళను కొంగల బారులు చూడవులే
పైటలేసి నిన్ను చూసి చిట్టి జడలే నీకు వేసి
చూసుకుంటా అమ్మరాశి కడుపారగ తల్లి నిన్నుగని
జాబిల్లే చుక్కల్లో ఎక్కము రాసే
మావిళ్ళే వేవిళ్ళ పిందెలు వేసే
ఇక నీ ఆటతో పాట నా నోటికి

లలలలా సంగీతమే సంతోషమే
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే
ఇంట్లోనే ఓ దీపమెట్టినరోజు
కంట్లోనే ఓ పాప పుట్టినరోజు
ఇక ఏకాంతమే లేదు ఏ జన్మకీ
లలలలా సంగీతమే కిలకిలలా సంతోషమే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 22, 2009

అన్నమయ్య

తారాగణం: నాగార్జున,మోహన్‌బాబు,సుమన్,రమ్యకృష్ణ,భానుప్రియ,రోజా,కస్తూరి,శ్రీకన్య
గాత్రం: బాలు,రేణుక,సుజాత
సంగీతం: కీరవాణి
నిర్మాత: దొరస్వామిరాజు
దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు
సంస్థ: వి.ఎం.సి ప్రొడక్షన్స్
విడుదల: 1997



పల్లవి:

ఓం ఓం
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానపదం
ఏడు స్వరాలే ఏడు కొండలై వెలసిన కలియుగ విష్ణు పదం
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

చరణం1:

అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మభారతి నాదాశిస్సులు పొందినదై
శివలోకమ్మున చిద్విలాసమున డమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల పూబంతుల చేబంతిగ ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి గానవు మహిమలు తెలిసి
సితహిమ కందర యతిరాట్సభలో తపహ ఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆనందకము నందనానంద కారకము
అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం

చరణం2:

పద్మావతియే పురుడు పోయగ పధ్మాసనుడే ఉసురు పోయగ
విష్ణు తేజమై నాద బీజమై అంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించేను అన్నమయ్య అసతోమా సద్గమయ

చరణం3:

పాపడుగా నట్టింట పాకుతు భాగవతము చేప్పట్టెనయా
హరినామమ్మును ఆలకించక అరముద్దలనే ముట్టడయా
తెలుగు భారతికి వెలుగు హారతై ఎదలయలో పద కవితలు కలయ
తాళ్ళపాకలో ఎదిగె అన్నమయ్య తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 20, 2009

సూత్రధారులు

గాత్రం:శైలజ



పల్లవి:

జోలాజోలమ్మజోల జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూల జోల
నిత్యమల్లె పూల జోల
జోలాజోలమ్మజోల జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూల జోల
నిత్యమల్లె పూల జోల
లులలలలలల హాయి హాయే
లులలల్లలల హాయి హాయే

చరణం1:

ఆ ఆ రేపల్లె గోపన్న రేపు మరచి నిదరోయే
రేపు మరచీ నిదరోయే
యాదగిరి నరసన్న ఆదమరిచి నిదరోయే
ఆదమరచీ నిదరోయే
ఏడుకొండలా ఎంకన్న ఎపుడనగా నిదరోయే
ఎపుడనగా నిదరోయే
కోడె పిల్లాడా నీకేమో కునుకైనా రాదాయే
కునుకైనా
లుల్ల్లలలల్ల హాయి హాయే
లుల్ల్లలలల్ల హాయి హాయే
జోలాజోలమ్మజోల జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూల జోల
నిత్యమల్లె పూల జోల

చరణం2:

మీనావతారమెత్తి మేని చుట్టూ రాబోకురా
అరెరరే యాహి యాహి యాహి యాహి యాహి యాహి
యాహి యాహి యాహి యాహి యాహి యాహి
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయో యాహి యాహి యాహి యాహి యాహి హ హ హ హ
వామనావతారమెత్తి, వామనావతారమెత్తి స్వామి లాగా అయిపోకు
బుద్దవతారమెత్తి బోదిచెట్టును అంటి ఉండకు
రఘు వంశ తిలకుడివై రాముడివై రమణుడివై...రాముడివై రమణుడివై
సీతతోనే ఉండి పోరా గీత నువ్వే దిద్ది పోరా
ఈ సీతతోనే ఉండి పోరా నా గీత నువ్వే దిద్ది పోరా

లుల్ల్లలలల్ల హాయి హాయే
లుల్ల్లలలల్ల హాయి హాయే
జోలాజోలమ్మజోల జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూల జోల
నిత్యమల్లె పూల జోల
లుల్ల్లలలల్ల హాయి హాయే
లుల్ల్లలలల్ల హాయి హాయే
హాయే హాయే


||

Mar 19, 2009

కల్పన

తారాగణం: మురళీమోహన్,జయచిత్ర
సంగీతం: చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
విడుదల:1977
సంస్థ: శ్రీ అన్నపూర్ణ ఎంటర్‌ప్రైజెస్



పల్లవి:

దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ సీతమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

చరణం1:

ఎదనే దాచికుంటావో నాఎయదనే దాగివుంటావో
ఎదనే దాచికుంటావో నా ఎదనే దాగివుంటావో
కదలికలన్నీ కధలుగ అల్లి కవితలే రాసుకుంటావో రామయ్య
పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెలై దోచి నాకివ్వు
పొన్నలు పూచిన నవ్వు సిరివెన్నెలై దోచి నాకివ్వు
ఆ వెన్నెలలో నీ కన్నులలో
ఆ వెన్నెలలో నీ కన్నులలో
సన్నగాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు
సన్నగాజులే రువ్వు కను సన్నజాజులే రువ్వు
సీతమ్మ సీతమ్మ

దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

చరణం2:

కలలో మెలుకుంటావో నా కళలై ఏలుకుంటావో
కలలో మెలుకుంటావో నా కళలై ఏలుకుంటావో
కలలిక మాని కలయికలో నా కన్నులలో చూసుకుంటావో రామయ్య
వెలువలైన సొగసు తొలివేకువ నీ మనసు
వెలువలైన సొగసు తొలివేకువ నీ మనసు
ఆ వెల్లువలో నా పల్లవిలో
ఆ వెల్లువలో నా పల్లవిలో
రాగమే పలికించు అనురాగమై పులకించు
రాగమే పలికించు అనురాగమై పులకించు
సీతమ్మ సీతమ్మ

దిక్కులు చూడకు రామయ్య పక్కనే ఉన్నది సీతమ్మ
సిరిమల్లె నవ్వుల సీతమ్మ ముందుకు రావే ముద్దులగుమ్మ ముద్దులగుమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 17, 2009

అందమైన అనుభవం

గాత్రం:బాలు,సుశీల



పల్లవి:

హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
Around the world friendship welcomes you
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
Around the world friendship welcomes you
హల్లో నేస్తం బాగున్నావా
హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం1:

ఊగే అలపై సాగే పడవ ఒడ్డు పొడ్డు చేర్చింది
ముచ్చటలన్ని మోసే గాలి దిక్కుదిక్కులను కలిపింది
కలకల పోయే చిలుకల గుంపు వరసా వావి నేర్పింది
నేల పీటగా నింగి పందిరిగా జగతికి పెళ్ళి జరిగింది
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం2:

ఏ కళ్ళైనా కలిసాయంటే కలిగేదొకటే అనురాగం
ఏ మనసైనా తెరిసాయంటే తెలిపేదొకటే ఆనందం
సరిగమలైనా డొరనిపలైనా స్వరములు ఏడే గానంలో
పడమటనైనా తూరుపునైనా స్పందన ఓకటే హృదయంలో
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా
హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా

చరణం3:

చైనా ఆట మలయా మాట హిందూ పాట ఒకటేను
నీ నా అన్నది మానాలన్నది నేటి నినాదం కావాలోయ్
సాయా అన్నా సింగపూరా
సాయారుక మలేషియా
సాయారేమో ఇండియా
సాయావాడ చైనా

హల్లో నేస్తం బాగున్నావా,హల్లో నేస్తం గుర్తున్నానా
నేనే నువ్వొయ్ నువ్వే నేనోయ్
నెనరు నెయ్యం మనమిద్దరమోయ్
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
Around the world friendship welcomes you
మినిజూగా ఫ్రండ్స్‌ ఇన్‌ మలేషియా
Around the world friendship welcomes you

||

Mar 15, 2009

కృష్ణప్రేమ

గాత్రం:ఎస్.వరలక్ష్మి,జిక్కి
సంగీతం:పెండ్యాల
సాహిత్యం:ఆరుద్ర
విడుదల:1961



పల్లవి:

నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు దేవుడే చెలి అవతారపురుషుడు దేవుడే
తెలియని మూఢులు కొలిచిననాడు ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే

చరణం1:

పసివయసునందే పరిపరివిధముల ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
ప్రజ్ఞలు చూపిన మహనీయుడే
హద్దుపద్దులేని ముద్దుల పాపడి అల్లరికూడా ఘనకార్యమేనా
అల్లరికూడా ఘనకార్యమేనా
ఆ ఆ ఆ నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు దేవుడే చెలి అవతారపురుషుడు దేవుడే


చరణం2:

కోనేట యువతులు స్నానాలుచేయ
కోనేట యువతులు స్నానాలుచేయ కోకలదొంగ మొనగాడటే
అహ కోకలదొంగ మొనగాడటే
పడతులకపుడు పరమార్ధపదము భక్తిని నేర్పిన పరమాత్ముడే
భక్తిని నేర్పిన పరమాత్ముడే
నవనీతచోరుడు నందకిశోరుడు అవతారపురుషుడు దేవుడే చెలి అవతారపురుషుడు దేవుడే

చరణం3:

పదునాలుగు జగములు పాలించువాడే ఏ ఏ ఏ ఏ ఏ
పదునాలుగు జగములు పాలించువాడే ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే
ఎదురేమిలేని పదవిని ఇస్తే ఎ
ప్రత్యక్ష దైవము శ్రీకృష్ణుడే ఎటువంటివాడు భగవానుడే
ఎటువంటివాడు భగవానుడే


||

Mar 13, 2009

చదువుకున్న అమ్మాయిలు

గాత్రం: ఘంటసాల,సుశీల



పల్లవి:

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి
నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం1:

నవ నాగరిక జీవితాన తేలుదాం
నైటు క్లబ్బులంటు నాట్యమాడి సోలుదాం
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం2:

నేను పేరుబడిన వారి ఇంట పుట్టిపెరిగాను
ఏదో హారుమొని వాయిస్తూ పాడుకుంటాను
దనిస నిదనిప మగదిరస దిగమప
నేను చదువులేని దాననని అలుసు నీకేల
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదిన గండం
నీ ఆస్తికోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం3:

సిరులు నగలు మాకులేవొయి
తలుకుబెలుకుల మోజులేదోయి
అహహ ఆ ఆ ఆ ఆ ఆ
చదువు సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశికన్నా నీ గుణమే మిన్న
నీలో సంసార కాంతులున్నాయి

నీకో ప్లూటు దొరికింది
మెడలో జొలి కడుతుంది
ఈమె కాలిగోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు
నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఒహొ పక్కనున్న చక్కనైన జవ్వని
నిన్నే నాదాన్ని చేసుకుంటాను


||

Mar 11, 2009

శుభాకాంక్షలు

గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

చరణం1:

నాలో కులుకుల కులుకులు రేపి
లోలో తెలియని తలపులు రేపి
పిలిచే వలపుల వెలుగును చూపి రాగే రాగమిది
నీలో మమతల మధువుని చూసి
నాలో తరగని తహతహ దూకి
నీకై తరగల పరుగులు తీసి చేరే వేగమిది
ఆరారు కాలాల వర్ణాలతో నీరాజనం నీకు అందించనా
ఏడేడు జన్మాల బంధాలతో ఈనాడు నీ ఈడు పండించనా
మరి తయ్యారయ్యి వున్న వయ్యారంగా సయ్యంటు ఒళ్ళోకి వాలంగా
దూసుకొచ్చానమ్మ చూడు ఉత్సాహంగ చిన్నారి వన్నెల్ని ఏలంగా
ప్రతి క్షణం పరవశం కలగగా ఓ ఓ ఓ ఓ ఓ
మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై

చరణం2:

ఆడే మెరుపుల మెలికల జాన
పాడే జిలిబిలి పలుకుల మైనా
రావే తొలకరి చినుకులలోన తుళ్ళే ధిల్లానా
రేగే తనువుల తపనలపైన
వాలే చినుకుల చమటల వాన
మీటే చిలిపిగ నరముల వీణ తియ్యని తాళాన
బంగారు శృంగార భావాలతో పొంగారు ప్రాయాన్ని కీర్తించనా
అందాల మందార హారాలతో నీవుండే రాజ్యాన్ని పాలించనా
ఇక వెయ్యేళ్ళైన నిన్ను విడిపోనంటూ ముమ్మారు ముద్దాడి ఒట్టేయనా
నువ్వు వెళ్ళాలన్న ఇంక వీల్లేదంటూ స్నేహాల సంకెళ్ళు కట్టేయనా
కాలమే కదలక నిలువగా

మనసా పలకవే మధుమాసపు కోయిలవై
చెలిమి తెలుపవే చిగురాశల గీతికవై
మంచు తెరలే తెరుచుకుని
మంచి తరుణం తెలుసుకుని
నవ్వులే పువ్వులై విరియగా ఓ ఓ ఓ ఓ ఓ


||

Mar 8, 2009

శ్రీమతి ఒక బహుమతి

తారాగణం :చంద్రమోహన్,నరేష్,విసు,జయసుధ,కల్పన
గాత్రం:బాలు
సంగీతం: శంకర్ గణేష్
దర్శకత్వం: విసు
సంస్థ: పవన్ ఎంటర్‌ప్రైజెస్
విడుదల:1987



మహిళా దినోత్సవం సందర్భంగా


పల్లవి:

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం1:

కోతిమంద చేత సేతువే నిర్మింపచేసింది ఆడదిరా
నాడు తాళికోసం యముడి కాలపాశంతోనే పోరింది ఆడదిరా
ఖడ్గ తిక్కన కత్తి తుప్పు పట్టకుండ ఆపింది ఆడదిరా
అన్న బాలచంద్రుడి చండ్రభాను తేజము వెనుక వెలిగింది ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
వేమన వేదానికి నాదం ఒక ఆడదిరా
ఇతగాన్ని నడుపుతుంది అటువంటి ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం2:

ధశరధున్ని నాడు దిక్కులేని దశకు తెచ్చింది ఆడదిరా
అయ్యో భీష్ముడంతటివాణ్ణి అంపశయ్యను పెట్టి చంపింది ఆడదిరా
అందాల అగ్గిలో విశ్వామిత్రుడి నిష్ట చెరిపింది ఆడదిరా
అహ పల్నాడు నేలంతా పచ్చినెత్తుట్లోన తడిపింది ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
కోడల్ని తగలపెట్టే అత్త కూడా ఆడదిరా
ఈ మగవాన్ని నేడు చెరిచింది ఆడదిరా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం

చరణం3:

పంచపాండవులకు కీర్తి కిరీటలు పెట్టింది ఆడదిరా
అయ్యో ఇంద్రుడు చంద్రుడు అపకీర్తి పాలైన కారణం ఆడదిరా
పోత పోసిన పున్నమంటి తాజ్‌మహలు పునాది ఆడదిరా
అయ్యో మేటి సామ్రాజ్యాల కోటలెన్నో కూలగొట్టింది ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
మంచికైనా చెడుకైనా మూలం ఒక ఆడదిరా
చరిత్రలో ప్రతి పుట ఆమె కథే పాడునురా

ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం
ఆడదే ఆధారం మన కథ ఆడనె ఆరంభం
ఆడదే సంతోషం మనిషికి ఆడదె సంతాపం


||

Mar 6, 2009

తెనాలి రామకృష్ణ


గాత్రం:భానుమతి

పల్లవి:

నీవెగా రార నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా

చరణం1:

విరిసి నెరితావి కొలతే విరితాన
విరిసి నెరితావి కొలతే విరితాన
పరువు మురిపాల వరుని వెతకాలి
పరువు మురిపాల వరుని వెతకాలి
కళల నెరజాణ సరసాల చెలికాన
కళల నెరజాణ సరసాల చెలికాన
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మేలు వాని కోరితే చాలు తిరుగాడి
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
మోహాలు మించగా మదిని గల ఆశ ఫలించగ
నేటికి ఇటు సరసజాణ నటనవేదినెరుగని శరణు చేరి మనసు తీర మురిసిన సురువు పలుకులకు వలపులకు నెర దొరవని విన్నారా కనుల నినుగన్నారా మనసుగొని వున్నారా ఏలుకోర


నీవెగా రార నీవెగా
నయ విజయశాలి కృష్ణరాయ నీకు సరి నీవెగా
నీవెగా రార నీవెగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Mar 4, 2009

మంచుపల్లకి

తారాగణం : చిరంజీవి,సుహాసిని,రాజేంద్రప్రసాద్,నారాయణరావు
గాత్రం: బాలు
సంగీతం: రాజన్-నాగేంద్ర
దర్శకత్వం: వంశీ
సంస్థ: గోదావరి చిత్ర
విడుదల: 1982



పల్లవి:

మనిషే మణిదీపం మనసే నవనీతం
మనిషే మణిదీపం మనసే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం
కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం
మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం
కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం
మనిషే మణిదీపం మనసే నవనీతం

చరణం1:

ఈమె పేరే మంచితనం,ప్రేమ పెంచే సాధుగుణం
ఈమె తీరే స్నేహధనం,వాడకంతా ఆభరణం
ఈమె పలుకే ముద్దుగొలిపే తేనెలొలికే తీయదనం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మనిషే మణిదీపం మనసే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం
కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం
మనిషే మణిదీపం మనసే నవనీతం

చరణం2:

పెళ్ళిపల్లకి హరివిల్లు,చుక్కలే అక్షింతల జల్లు హా
పెళ్ళిపల్లకి హరివిల్లు,చుక్కలే అక్షింతల జల్లు
సంధ్య కెంఛాయ పారాణి,లేత మబ్బులే సాంబ్రాణి
పిల్లగాలులే ప్రేక్షకులు,దేవదూతలే రక్షకులు

మనిషే మణిదీపం మనసే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం
కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం
మనిషే మణిదీపం మనసే నవనీతం

చరణం3:

ఎదురుచూచిన తొలిరేయి,నుదుట కురులే చెదిరాయి
నిదుర మరచిన నడిరేయి,ప్రియుని పెదవులు నవ్వాయి
అంతలోనే తెల్లవారి వింత కలలే కరిగాయి

మనిషే మణిదీపం మనసే నవనీతం
మనిషే మాణిక్యం మెరిసే వైడూర్యం
కన్నుల్లో అనురాగం గుండెల్లో అనుతాపం
మనిషే మణిదీపం మనసే నవనీతం

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

దొంగల్లో దొర

గాత్రం: ఘంటసాల,పి.లీల



పల్లవి:

ఈ తీయని యామినిలో
తారల జలతారల తెరలలో
నిండుగా రావోయి
పండుగేనోయి

విన్నావ చిన్నదాన
విన్నావ చిన్నదాన
అదో ఆ దూరతీరాల
అనురాగ రాగాల ఆలాపనేదో
విన్నావ చిన్నదాన

విన్నానోయ్ చిన్నవాడ
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావ.. విన్నావ చిన్నవాడ

చరణం1:

చుక్కల్లో జాబిలి ఎక్కడున్నావోయి
చక్కని చుక్క రాణి పక్కనున్నాయోయి
చుక్కల్లో జాబిలి ఎక్కడున్నావోయి
చక్కని చుక్క రాణి పక్కనున్నాయోయి
పక్కుమని నవ్వుతావా
పండు వెన్నెలిస్తావా
పక్కుమని నవ్వుతావా
పండు వెన్నెలిస్తావా
వెన్నెలంటి మనసుదాన
వెన్నవాంటి మనసిస్తా

విన్నావ చిన్నదాన
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావ.. విన్నావ చిన్నవాడ

చరణం2:

నీ నీడలో నేను మేడలే కడతాను
ఆ ఇంట నీజంట కాపురమే ఉంటాను ఆ ఆ ఆ ఆ
నీ నీడలో నేను మేడలే కడతాను
ఆ ఇంట నీజంట కాపురమే ఉంటాను
చెలిమే మన కలిమిగా
వలపే మన వరముగా
చెలిమే మన కలిమిగా
వలపే మన వరముగా
ఒకరికొకరు కనుపాపై
ఒద్దికగా ఉందాము

విన్నావ చిన్నదాన
అది చిన్నారి మనసులోని
చిన్ననాటి మమతలన్ని
పల్లవించు ప్రణయగీతి
విన్నావా.. విన్నానోయ్ చిన్నవాడ
విన్నావ చిన్నవాడ

||

Mar 2, 2009

భలే అమ్మాయిలు

గాత్రం:జిక్కి



పల్లవి:

చకచక జనత తకధిమి కిటత
పకపక నవ్వుతా పంతమాడతా
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే
చకచక జనత తకధిమి కిటత
పకపక నవ్వుతా పంతమాడతా
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే

చరణం1:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
పక్కనున్న పిల్ల పంచదారబిళ్ళ టక్కులెన్నో చేస్తున్నది
ఆ వెంటగాన్ని బుట్టలోన వేసుకున్నది
హే మనసులాగినాది వయసు దోచినాది మత్తుమందు చల్లినాది
హొరబ్బ ఉచ్చువేసి పట్టునాది

చకచక జనత తకధిమి కిటత
పకపక నవ్వుతా పంతమాడతా
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే


చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సూదంటురాయల్లె లాగుతున్నది వాలుచూపుల్తొ లోకుల్ని ఊపుతున్నది
వాలుచూపుల్తొ లోకుల్ని ఊపుతున్నది
ఒళ్ళు తెలియనీయక కళ్ళు కాననీయక
గేటు దాటకుండ కన్ను గీటుతున్నది
నీ నాటకాలు తెలిసెనని నవ్వుతున్నది
మంచి కులుకులాడి తళుకుబెళుకులాడి
మంచి కులుకులాడి తళుకుబెళుకులాడి
భలే వన్నెచిన్నెలెన్నోచూపు వగలాడి
అహ వలపుచూపి మోసపుచ్చు మాయలాడి
మురిసిపోయె రాజా ముచ్చటైన రోజా
అంతు తెలిసి అడుగువేయవొయ్
ఒహొహొ అందమంత అనుభవించవోయ్

చకచక జనత తకధిమి కిటత
పకపక నవ్వుతా పంతమాడతా
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే
వెంట వెంట తిరుగుతున్న జంట సోకు చూడరే


| |