Jun 29, 2009

అల్లరి పిల్లలు

తారాగణం : రమ్యకృష్ణ,జయచిత్ర
గాత్రం: బాలు, సుశీల
సంగీతం : సత్యం
దర్శకత్వం : సి.యస్.రావు
విడుదల: 1978
నిర్మాణ సంస్థ: అండాళ్ చిత్ర మూవీస్





పల్లవి:

శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస
శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస

చరణం1:

ఆత్మను నేనంటిని
దేవా పరమాత్మ నీవేనంటివి
ఆత్మను నేనంటిని
దేవా పరమాత్మ నీవేనంటివి
నీలోన నిలచిపోనా
నిన్ను నాలోన కలుపుకోనా
నా స్వామి శృంగార శ్రీనివాస

శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస

చరణం2:

కలవాడినని హరి ఓం
సిరి కలవాడినని హరి ఓం
మగసిరి కలవాడినని హరి ఓం
మనసు పద్మావతికిచ్చి
మనువు మహలక్ష్మికిచ్చిన
స్వామి శృంగార శ్రీనివాస

శ్రీచక్ర శుభ నివాస
స్వామి జగమేలు చిద్విలాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస
నా స్వామి శృంగార శ్రీనివాస


~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 27, 2009

ఇద్దరు

గాత్రం: సంధ్య
సాహిత్యం: వేటూరి



పల్లవి:

పూనగవే పూలది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి పూజకి
పూనగవే పూలది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలొ పూల వేళ నా బ్రతుకే పండగ
నా బ్రతుకే పండగా
పూనగవే పూలది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి పూజకి

చరణం1:

విరబూసెను విరజాజి ఏ మంత్రం వేసావో ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
విరబూసెను విరజాజి ఏ మంత్రం వేసావో
చేబంతుల నీడలలో తెలుసుకుంటి నీ వలపే
ఒక నాడైన శోధించవా అణువణువు ఉసురౌతాలే
అణువణువు ఉసురౌతాలే

పూనగవే పూలది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి పూజకి

చరణం2:

నీలవర్ణం సెలవంటే ఆకశమే గాలి కదా
నీలవర్ణం సెలవంటే ఆకశమే గాలి కదా
సూర్యుడునే వేకువ విడితే తొలి దిసకు తిలకమెలా
నన్నికపై విడిచావా నా ఉసురుఇక నిలవదులే
నా ఉసురుఇక నిలవదులే

పూనగవే పూలది లేనగవే వాగుది
మౌనముగా నవ్వనీ నీ కౌగిలి పూజకి
అల పౌర్ణమి నవ్వులో ఒక మాసపు పువ్వులే
నీ ఒడిలొ పూల వేళ నా బ్రతుకే పండగ

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

Jun 25, 2009

మగమహరాజు

తారాగణం:చిరంజీవి,సుహాసిని
గాత్రం:వాణీ జయరాం
సాహిత్యం:వేటూరి
సంగీతం:కృష్ణ-చక్ర
నిర్మాత:మాగంటి రవీంద్రనాథ్ చౌదరి
దర్శకత్వం:విజయ బాపినీడు
సంస్థ:శ్యాంప్రాసద్ ఆర్ట్స్
విడుదల:1983



పల్లవి:

సీతే రాముడి కట్నం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
రామయ్యే సీతమ్మకు పేరంటం
సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

చరణం1:

సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
సీత అడిగిన వరమొకటే చిటెకెడు పసుపు కుంకుమలే
రాముడు అడిగిన నిధి ఒకటే అది సీతమ్మ సన్నిధే
ఏడు అడుగులు నడిచేది ఏడు జన్మల కలయికకే
పడతులకైనా పురుషులకైనా ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం
ఆ బంధం నూరేళ్ళ సౌభాగ్యం

సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం

చరణం2:

ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
ఆడజన్మకు వరమొకటే మనిషికి తల్లిగ జన్మనివ్వటం
పురుష జన్మకు విలువొకటే కాసుకు అమ్ముడు పోకపోవడం
రామకథలుగా వెలసేది స్త్రీల ఋజువుగా నిలిచేది
ఆనాడైనా ఏనాడీనా సీతమ్మ రామయ్యల కళ్యాణం
సీతమ్మ రామయ్యల కళ్యాణం


సీతే రాముడి కట్నం
ఆ సీతకు రాముడు దైవం
అడవులనైనా అయోధ్యనైనా రామయ్యే సీతమ్మకు పేరంటం
ఆ ఆ ఆ ఆ ఉం ఉం ఉం ఉం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 24, 2009

దొంగల్లో దొర

గాత్రం: పి.లీల



పల్లవి:

నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ
నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ

చరణం1:

ఒక ఆట ఆడి ఒక పాట పాడి
ఒక మాటగానే ఉన్నామమ్మ ఓ ఓ ఓ
ఒక ఆట ఆడి ఒక పాట పాడి
ఒక మాటగానే ఉన్నామమ్మ
చిననాటి చెలిమి ఆనాటి చెలిమి
మరువనివాడు మంచివాడమ్మ ఓ ఓ ఓ

నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ

చరణం2:

తనవెంట నేనుంటె నా కంట తానుంటె
మనకేమి లోటని అనుకుంటినమ్మ
తనవెంట నేనుంటె నా కంట తానుంటె
మనకేమి లోటని అనుకుంటినమ్మ
కలిసాకు కాని ఎడబాటు కాని
చివరకు మేము ఒకటేనమ్మ

నన్నేలు మోహనుడేడమ్మ
నందగోపబాలుడెందు దాగినాడు
ఆ నందగోపబాలుడెందు దాగినాడమ్మ

||

Jun 23, 2009

స్వాతికిరణం

గాత్రం: వాణీ జయరాం
సాహిత్యం: సీతారామశాస్త్రి



పల్లవి:

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

చరణం1:

ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
ఆపాతమధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము
శ్రీభారతీ క్షీర సంప్రాప్తము అమృతసంపాతము సుకృత సంపాకము
సరిగమ స్వరధుని సారవరూధుని సామ సునాదవినోదిని
సకలకళాకళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని
మాంపాహి మకరంద మందాకినీ
మాంపాహి సుజ్ఞాన సంవర్ధినీ

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే

చరణం2:

ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము
ఆలోచనామృతము సాహిత్యము సహితహితసత్యము శారదాస్తన్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సారస్వతాక్షర సారధ్యము జ్ఞానసామ్రాజ్యము జన్మసాఫల్యము
సరస వచోబ్ధిని సారసలోచని వాణీ పుస్తకధారిణీ
వర్ణాలంకృత వైభవశాలిని వరకవితా చింతామణీ
మాంపాహి సాలోక్యసంధాయినీ
మాంపాహి శ్రీచక్ర సింహాసినీ

వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే
వింధ్యవిలాసిని వారాహి త్రిపురాంబికే
భవతి విద్యాందేహి భగవతి సర్వార్ధ సాధికే సత్యార్ధ చంద్రికే
మాంపాహి మహనీయ మంత్రాత్మికే
మాంపాహి మాతంగి మాయాత్మికే

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

Jun 22, 2009

గృహలక్ష్మి

గాత్రం: ఘంటసాల,భానుమతి



పల్లవి:

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
ఒంటరిగా నిన్నే నిదురించమన్నవి
కొంటెతనం ఈ రేయి కూడదన్నవి...కూడదన్నవి
కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా

చరణం1:

అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
అందమైన ఆవేశం ఆగనన్నది
హద్దులోన ఉంటేనే అందమున్నది
తుళ్ళిపడే నా మనసే చల్లపడాలి
చందురుడే నిన్నుగని జాలిపడాలి...జాలిపడాలి

కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

చరణం2:

విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
విరహంలో నా తనువే వేగుతున్నది
తీయని ఆ విరహంలో హాయివున్నది
ఎందుకిలా నన్ను సతాయింతువు నేడు
మాటలింక చాలునులే మామవున్నాడు...చందమామవున్నాడు

కన్నులే నాకోసం కాచుకున్నవా
వెన్నెలలే అందుకని వేచియున్నవా
కన్నులే నీకోసం కాచుకున్నవి
వెన్నెలలే అందుకని వేచియున్నవి

||

Jun 20, 2009

కాలాపాని

గాత్రం: బాలు, చిత్ర



పల్లవి:

చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది
లయలుగ హొయలు సిరులుగ శృతులు హొ
మదనుని తలపు మగసిరి మెరుపు హొ
కిలకిల పలుకుల మధురిమ హొ హొ
సరిగమపదనిస స్వరముల సాగేనా
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది

చరణం1:

నింగి తారలేమో హారమాయె
వెన్నెలేమో వన్నెలాయె
నింగినేల హంగులాయె కన్నెకన్నుల్లో
అహ చుక్కలాంటి చక్కనోడు
చందమామ అందగాడు
చిక్కినాడు చిన్నవాడు పంటి కౌగిట్లో
ఎదనల్లుకోవాలి లతవోలె రావాలి
తీయని ఆ హాయి మైమరచిపోవాలి
ధ్యానం ధ్యాస ఆన రాగం భావం కానా
సాయం సంధ్యల్లోన ప్రాయం పరువం కానా
ఆనందం హరివిల్లేగా ఆమని స్వాగతమిచ్చెనుగా

చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది

చరణం2:

గండు తుమ్మెదొచ్చి గుండె గిల్లి మంతరించి మత్తుజల్లి
తోడిరాగం పాటలేవో పాడుకో అంది
వన్నెచిన్నెలన్ని తుళ్ళితుళ్ళి వంతులాడి మళ్ళిమళ్ళి
విందులీయ డీడిక్కంటూ ఈడుజోడంది
మాఘమును చూడుమా యాగమును చేయగా
మోహమును చేరుమా దాహమును తీర్చగా
కోరిక తీరే పూట తోడొచ్చింది పాట
ఆశల వేసవిలోన వేడెక్కింది వేట
మోగింది ఇక సన్నాయి పచ్చల పల్లకి ఎక్కెనహొ

సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
లయలుగ హొయలు సిరులుగ శృతులు హొ
మదనుని తలపు మగసిరి మెరుపు హొ
కిలకిల పలుకుల మధురిమ ఆ ఆ ఆ
సరిగమపదనిస స్వరముల సాగేనా
చామంతీ పువ్వే విరబూసాను అంది సిరివిందంది
సింగారం గాంచి తొలిపొద్దుల్లో ముంచి ఎల ముద్దంది


||

Jun 18, 2009

భలే అమ్మాయిలు

గాత్రం:పి.సుశీల



పల్లవి:

అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము

చరణం1:

ప్రేమతరంగము నా అంతరంగము
చెంగుచెంగున దూకే పసిడి పూరంగము
వినువీధులలో విహరించేటి
వినువీధులలో విహరించేటి
ఆ చందమామ మీద అట్టే నిలిచిపోయెను

అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము

చరణం2:

నీ కనుసన్నల్లు నీ చిరునవ్వులు
అరవిరిసిన విరజాజి మల్లెపువ్వులు
నీ మురిపాలు నీ సరసాలు
ఏమారు మరువలేక వెర్రిదాననైతిని

అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము ఆనంద దీపము
కనుదోయి విందుచేయు మందమంద హాసము
అందుకే ఆ మోహము ఇందుకే ఈ స్నేహము
అందాల రూపము

||

Jun 16, 2009

సూర్యవంశం

గాత్రం:చిత్ర
సాహిత్యం:సామవేదం షణ్ముఖశర్మ



పల్లవి:

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే

చరణం1:

ఆకాశం అందాలంటు దూకే కెరటంలా ప్రేమే నాలో
ఆ హోరు నీ పేరునే పలికే మంత్రంలా నా గుండెలో
దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్నా
నాలో నేనే లేనే లేను నేను నిన్నే నాలో కోలువుంచాను
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే

చరణం2:

మెరుపంటి నీ రాకకే మనసే మేఘంలా మారిందిలే
చిరుగాలై తలపే తాకి కదిలి నిలువెల్లా కరిగిందిలే
తొలి చినుకే తాకే నేలల్లే నేనే పులకించా నీ ఊహతో
దైవం ముందు దీపం లాగ నిన్నే చూస్తూ కాలం గడిపేస్తగ

రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే
రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే
నాలో కదిలే ప్రాణాలే ఒక పాటై నిన్నే చేరాలే

||

Jun 14, 2009

శకుంతల

గాత్రం: సుశీల



పల్లవి:

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

చరణం1:

తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
తేటికి పాట నెమలికి ఆట
తెలిపే అందాలు,ఉసిగొలిపే చందాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
హాయ్ హాయ్ నీ నిగనిగ చెలువాలు
హంసకు నడకు లేడికి పరుగు నేర్పే పరువాలు
నీ నిగనిగ చెలువాలు
కన్నియ చిరునవ్వు, కమ్మని నునుసిగ్గు
ఎన్నటికైనా వాడని సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ

చరణం2:

చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
చల్లని మాసం పెళ్ళిముహూర్తం
మల్లిక వధువు సుమా
ఎలమావే వరుడు సుమా
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
హాయ్ హాయ్ తొలివలపుల మంత్రాలు
మంజులగానం మంగళగీతం మన్మధ వేదాలు
తొలివలపుల మంత్రాలు
పువ్వుల కళ్యాణం నవ్వుల వైభోగం
ముచ్చటలన్ని తీరే సీమ ఆ ఆ
హొయ్ హొయ్ హొయ్

మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
ఏవేవో భావాలు పూవులవోలె పూచే సీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ
మధుర మధుర సుమసీమ
సుధలు కురియు వనసీమ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 12, 2009

రంగూన్ రౌడి

తారాగణం: కృష్ణంరాజు,జయప్రద
గాయకులు: బాలు, సుశీల
సంగీతం: జె.వి.రాఘవులు
దర్శకత్వం : దాసరి నారాయణరావు
నిర్మాత: వడ్డే రమేష్
నిర్మాణ సంస్థ : విజయ మాధవి కంబైన్స్
విడుదల: 1979



పల్లవి:

ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
ఎదురు చూసింది నిదుర కాచింది తనువు నీకోసమే
వెలుగువై రావోయి వెలుతురే నీవోయి
ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం

చరణం1:

కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను నిలిచి చూసే
కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే
భ్రమర నాదాలు ఉ ఉ ఉ
భ్రమర నాదాలు ప్రేమ గీతాలై పరిమళించేనోయి
పున్నమై రావొయి నా పున్నెమే నీవోయి
ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం
జుంజుంజుం జుంజుంజుం
జుంజుంజుం జుంజుంజుం

చరణం2:

నవ్వులన్ని పువ్వులైన నా వసంతం నీకు సొంతం
పెదవి దాటి ఎదను మీటే ప్రేమ బంధం నాకు సొంతం
ఇన్ని రాగాలు ఉ ఉ ఉ
ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి
అనురాగమే నీవోయి
అనురాగమే నీవోయి
ఓ జాబిలి వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 10, 2009

దాగుడుమూతలు

గాత్రం: ఘంటసాల ,సుశీల



పల్లవి:

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం1:

నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
నడకలలో నాట్యం చేసే
నడుము చూస్తే పిడికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
పొగడి పొగడి బులిపించే
నీ చిలిపి పలుకులు చిటికెడు ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం2:

చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
చకచకలాడే పిరుదులు దాటే
జడను చూస్తే చలాకి ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
కలకాలం తల దాచొకొమ్మనే
ఎడదను చూస్తే ఎంతో ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు

చరణం3:

పచ్చని చేలే కంటికి ముద్దు
నెచ్చెలి నవ్వు జంటకి ముద్దు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను ఉహుహుహు
చెట్టు చేమా జగతికి ముద్దు
నువ్వు నేను

అడగక ఇచ్చిన మనసే ముద్దు
అందీ అందని అందమె ముద్దు
విరిసి విరియని పువ్వే ముద్దు
తెలిసి తెలియని మమతే ముద్దు
అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 8, 2009

మల్లె మొగ్గలు

తారాగణం: రాజేష్,సాగరిక
గాత్రం: బాలు
సాహిత్యం: వేటూరి
సంగీతం: రమేష్ నాయుడు
దర్శకత్వం: వి.మధుసూధనరావు
నిర్మాత: రామోజీ రావు
సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 1986



పల్లవి:

ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు రేపల్లె
ఏరు కాళింది ఊరు రేపల్లె
వేణువందుకే మోగిందమ్మ
వెన్నదాచకే కన్నె గోపెమ్మ
వెన్న దాచకే కన్నె గోపెమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ

చరణం1:

మువ్వ గోపాలా రారా అంటూ
మువ్వ గోపాలా రారా అంటు
మువ్వ మువ్వకి పిలుపేనమ్మా
ముద్దు గోవిందా రారమ్మంటు
ముద్దు గోవిందా రారమ్మంటు
ముగ్గు ముగ్గున కవితేనమ్మా
జారు పైటలా జావళి వింటే
జాను తెనుగులే పండేనమ్మా
జాను తెనుగులే పండేనమ్మా
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ

చరణం2:

ఆఆఆఆఆఆ
సువ్వి గోపాలా సువ్వి అంటూ
సువ్వి గోపాలా సువ్వి అంటూ
పాలపొంగులే పలికేనమ్మ
గుమ్మడెక్కడే గుమ్మా అంటూ
చల్ల చిందులే సణిగేనమ్మ
కొమ్మ కొమ్మకీ కొత్త పల్లవి
కోకిలమ్మలే పాడేనమ్మ
కోకిలమ్మలే పాడేనమ్మ

ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు కాళింది ఊరు రేపల్లె
ఏరు కాళింది ఊరు రేపల్లె
వేణువందుకే మోగిందమ్మ
వెన్నదాచకే కన్నె గోపెమ్మ
వెన్న దాచకే కన్నె గోపెమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ
ఏరు పక్క మా ఊరమ్మ,ఊరు పక్క మాగాణమ్మ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 5, 2009

శుభాకాంక్షలు

గాత్రం: చిత్ర



పల్లవి:

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

చరణం1:

నువ్వు నడచు దారుల్లో పూలు పరచి నిలుచున్నా
అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా
నీలి కళ్ళ ముంగిట్లో నన్ను నేను కనుగొన్నా
నిండు గుండె గుమ్మంలో తోరణంగ నేనున్నా
నీవైపే సాగే అడుగే నీతో నడవాలని అడిగే
నీ మాటే పలికే స్వరమే నీతోనే కలిసే వరమే
వేణువంటి నా హృదయంలో ఊపిరి పాటై పాడగా

ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె

చరణం2:

రాగమాల రమ్మంటూ స్వాగతాలు పలికింది
ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది
జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది
మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి
రాగాలే రాశులు పోసి ఈ గీతం కానుక చేసి
శుభాకాంక్షలే పలకాలి నవ్వుల పువ్వుల మాలతో

మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె
కాలమే పూలదారి సాగనీ
గానమే గాలిలాగ తాకనీ
ఈ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని
ఆనందమానందమాయె మది ఆశల నందనమాయె
మాటలు చాలని హాయే ఒక పాటగ మారినమాయె


||

Jun 3, 2009

లాయర్ సుహాసిని

తారాగణం : భానుచందర్,సుహాసిని,ఎస్.వరలక్ష్మి
గాత్రం: బాలు, శైలజ
సంగీతం : ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం
దర్శకత్వం : వంశీ
నిర్మాణ సంస్థ: జయకృష్ణ కంబైన్స్
విడుదల: 1987



పల్లవి:

సామజ వరగమన...
దివిని తిరుగు మెరుపు లలన ... సామజవరగమన
కరుణ కలిగి భువికి దిగిన ... సామజవరగమన
బ్రతుకు వెలిగె తరుణి వలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన

దివిని తిరుగు మెరుపు లలన ... సామజవరగమన
కరుణ కలిగి భువికి దిగిన ... సామజవరగమన
బ్రతుకు వెలిగె తరుణి వలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన

చరణం1:

అరవిరిసిన చిరునగవుల ... సామజవరగమన
ఇల కురిసెను సిరి వెలుగులు ... సామజవరగమన
అరవిరిసిన చిరునగవుల ... సామజవరగమన
ఇల కురిసెను సిరి వెలుగులు ... సామజవరగమన
సొగసుల మణి నిగనిగమని ... సామజవరగమన
మెరిసిన గని మురిసెను మది ... సామజవరగమన
వెలసెను వలపుల మధువని
సామజ వరగమన

దివిని తిరుగు మెరుపు లలన ... సామజవరగమన
కరుణ కలిగి భువికి దిగిన ... సామజవరగమన
బ్రతుకు వెలిగె తరుణి వలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన

చరణం2:

మమతల ఉలి మలచిన కళ ... సామజవరగమన
తళుకుమనెను చెలి కులుకుల ... సామజవరగమన
మమతల ఉలి మలచిన కళ ... సామజవరగమన
తళుకుమనెను చెలి కులుకుల ... సామజవరగమన
సుగుణములను తరగని గని ... సామజవరగమన
దొరికినదని ఎగసెను మది ... సామజవరగమన
అరుదగు వరమిది తనదని
సామజ వరగమన హహహ

దివిని తిరుగు మెరుపు లలన ... సామజవరగమన
కరుణ కలిగి భువికి దిగిన ... సామజవరగమన
బ్రతుకు వెలిగె తరుణి వలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... ఉం ఉం ఉం
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన
చెలిమి కలిమి మరువగలన ... సామజవరగమన


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Jun 1, 2009

శకుంతల

గాత్రం: ఘంటసాల,సుశీల



పల్లవి:

సరసన నీవుంటే జాబిలి నాకేల అహ
సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

చరణం1:

నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు ఆ ఉం
నీకన్నులలో నిగనిగ చూసి
నివ్వెరపోయెను తారకలు
తారలలోని తరుణిమ నీవై
తారలలోని తరుణిమ నీవై
నన్నే మురిపింతువే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

చరణం2:

చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
చక్కని నీ ముఖ చంద్రుని చూడగ
జాబిలి అదిగో ఆగెనులే
కౌగిలిలోన ఊగిన వేళ
కౌగిలిలోన ఊగిన వేళ
కాలమే ఆగిందిలే అదే హాయ్

సరసన నీవుంటే జాబిలి నాకేల
మనసున నీవుంటే స్వర్గము నాకేల
సరసన నీవుంటే జాబిలి నాకేల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~