31-Jan-2009

లవకుశ

గాత్రం: ఘంటసాల



పల్లవి:

సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా

చరణం1:

ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
ఒకే బాణము ఒకటే మాట ఒక్క భామకే రాముని ప్రేమ
మిన్నే విరిగిపడినా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ
సందేహించకుమమ్మా

చరణం2:

రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా
నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

30-Jan-2009

చదువుకున్న అమ్మాయిలు

గాత్రం: ఆశాలత కులకర్ణి



పల్లవి:

ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగ ఏల ఈ మగత
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం1:

ప్రేయసి నిద్దుర లేపుట,మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట
ముందు జరుగుట చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం2:

యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం3:

నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

||

29-Jan-2009

అందమైన అనుభవం

గాత్రం:బాలు,వాణీ జయరాం



పల్లవి:

నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ నీసరి ఎవరమ్మ
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

చరణం1:

ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒకే రోజు దినము దినము ఒక గమకం ఒక మధురం
ఒక మేఘం క్షణ క్షణము ఒక రూపం ఒక శిల్పం
ఆ సరిగమలు ఆ మధురిమలు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒకే వెన్నెల జత జతకు ఒక సౌరు ఒక పోరు
ఒక కౌగిలి ప్రతి రేయి ఒక స్వర్గం ఒక దుర్గం
ఆ జివజివలు ఆ మెలుకువలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

చరణం2:

ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
ప్రతి ఋతువు ఈ ప్రకృతికి ఒక వింత పులకింత
మనసుంటే మనకోసం ప్రతి మాసం మధుమాసం
ఋతువుల సొగసు చిగురుల వయసు
నీకై కలవయ్య నా కళ నీవయ్య
నీకై కలవయ్య నా కళ నీవయ్య

నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
నీ కళ్ళు నా కళ్ళు కలిసుంటే విరిజల్లు
మమతలతో మనసల్లిన హరివిల్లే మన ఇళ్ళు
వలపుల జల్లులు పలుపలు వన్నెలు
నీలో కలవమ్మ నీవొక కళవమ్మ
నువ్వే నువ్వమ్మ నవ్వుల పువ్వమ్మ

నువ్వే నువ్వయ్య నవ్వులరవ్వయ్య నీసరి ఎవరయ్య
దినమొక రకము గడసరితనము
దినమొక రకము గడసరితనము

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Jan-2009

తెనాలి రామకృష్ణ

గాత్రం:భానుమతి

పల్లవి:

ఈ వాలు కన్నులు ఈ వన్నె చిన్నెలు
మారాజ రాజుకు నీరాజనములు
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా
కన్నులు నిండె కన్నెలమిన్న మన్ననలీరా రాజా

చరణం1:

కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా

చరణం2:

కోయిల కూన కులికే జాణ
పలికించేరా పాటలలో
కోయిల కూన కులికే జాణ
పలికించేరా పాటలలో
సరసాల వేళ విరజాజి పానుపున కొలువుచేయించి లాలించుదాన
సరిచెయ్యాలా నేనే నాకు సాటిరా
కుషీమీర కొనరా కోరి చేరినారా
ఈ సొగసొంతా నీసొమ్మేరా ఫాదుషా
కుషీమీర కొనరా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Jan-2009

ఎర్ర మల్లెలు

తారాగణం: మురళీమోహన్,రాజేష్,మాదాల రంగారావు
గాత్రం: ఎస్.పి.శైలజ
సాహిత్యం: ప్రభు
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం : ధవళ సత్యం
సంస్థ: నవతరం పిక్చర్స్
విడుదల:1981




పల్లవి:

నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

చరణం1:

తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
తిందామంటే తిండీ లేదు,ఉందామంటే ఇళ్ళే లేదు
చేదామంటే కొలువూ లేదు,పోదామంటే నెలవు లేదు
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓ లింగా రామారాజ్యం తీరును చూడు శంభులింగ

చరణం2:

గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
గుక్కెడు గంజి కరువైపోయె,బక్కడి ప్రాణం బరువైపోయె
బీదాబిక్కి పొట్టలుకొట్టి మేడలుకట్టేసి కనిపెట్టి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

చరణం3:

లేని అమ్మది అతుకుల బతుకు
ఉన్న బొమ్మకి అందం ఎరువు
కారల్లోన తిరిగే తల్లికి కట్టే బట్ట బరువైపాయె
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ
ఓయ్ లింగా రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ

చరణం4:

ముందు ఒప్పులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ముందు ఒప్పులు,వెనక తప్పులు వున్నవాడికే అన్ని చెల్లును
ఉలకావేమి పలకావేమి బండారాయిగ మారిన బావి
నాంపల్లి స్టేషనుకాడి రాజాలింగో ఓ ఓ ఓ రాజాలింగ
రామారాజ్యం తీరును చూడు శివా శంభులింగ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Jan-2009

అన్నమయ్య

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ

చరణం1:

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైని సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ


నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిదస నీసాద సగమ గమగ మదని దనిసమగసనిదమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడలద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా
దివిజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశ హరే హరే హరే
దివిజేంధ్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రిశనవనీతచోర శ్రీ నారాయణ
నిగమ సగమగసనిదమగని
నిగమ గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ
నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వేద నారాయణ వేంకట నారాయణ తిరుమల నారాయణ లక్ష్మి నారాయణ హరి హరి నారాయణ ఆది నారాయణ హరే హరే హరే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Jan-2009

ఆరాధన

తారాగణం:నాగేశ్వరరావు,సావిత్రి
గాత్రం:ఘంటసాల
సంగీతం: ఎస్.రాజేశ్వరరావు
దర్శకత్వం:వి.మధుసూధనరావు
నిర్మాత:వి.బి.రాజేంద్రప్రసాద్
సంస్థ: జగపతి పిక్చర్స్




పల్లవి:

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ

చరణం1:

నీ కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
కన్నులలోన దాగెనులే వెన్నెలసోన
చకోరమై నిను వరించి అనుసరించినానే
కలవరించినానే

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ

చరణం2:

నా గానములో నీవే ప్రాణముగా పులకరించినావే
ప్రాణముగా పులకరించినావే
పల్లవిగా పలుకరించరావే
పల్లవిగా పలుకరించరావే
నీ వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వెలసెను నా వలపుల మేడ
నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
నిదుర కాచినానే

నా హృదయంలో నిదురించే చెలీ
కలలలోనే కవ్వించే సఖీ
మయూరివై వయారివై నేడే నటనమాడి నీవే
నన్ను దోచినావే
నా హృదయంలో నిదురించే చెలీ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Jan-2009

సూర్యవంశం

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలగ లాలించగ నీ నీడ దొరికింది
కమ్మగ కలలీయగ నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచినవాడే నీరాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీవే ఆ చెలి ,నిజమేనా జాబిలి
కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం

చరణం1:

ఎదురుచూపులో ఇంత తీపని తెలయలేదు మునుపు
ఎదురుచూడని ఇంత హాయిని మరిచిపోదు మనసు
ఒదిగివుండి నీ వాకిటిలో బదులుకోరి నే నిలుచున్నా
దారి తెలియని చీకటిలో వెలుగుచూసి కాదంటానా
ఊరించే ఇది ఏ మాసం
ప్రేమించే ప్రతి గుండెను అందెల సందడి చేసే హేమంతం ఇది
మన సొంతం అయినది

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం

చరణం2:

మావితోట మగ పెళ్ళివారికి విడిది అంది చిలక
మనువు ముందరె మంతనాలకి కదిలె గోరువంక
జాబిలమ్మని జాజులతో తరలిరమ్మని అందామా
పేద మనసుకి పెళ్ళంటే అతిధులెవ్వరు రారమ్మ
నీకన్నా సిరులా మిన్న
ఓ మైనా మన మనువులు మెచ్చిన మనసులు పెట్టిన సుముహూర్తం ఇది
వధువై రానా మరి

కిలకిల నవ్వే కోయిల కోసం వచ్చింది మధుమాసం
మిలమిల మెరిసే చంద్రుడి కోసం తెర తీసెను సాయంత్రం
జోలగ లాలించగ నీ నీడ దొరికింది
కమ్మగ కలలీయగ నీ తోడు నాకుంది
ఎద విల్లును వంచినవాడే నీరాముడు అన్నది మనసే
గుడి తలుపులు తీయక ముందే వరమిచ్చెను దేవత ఎదురై
నీవే ఆ చెలి ,నిజమేనా జాబిలి

||

21-Jan-2009

కృష్ణవేణి

గాత్రం:రామకృష్ణ,సుశీల



పల్లవి:

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి

చరణం1:

మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై
మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై
వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై
ఎన్ని జన్మాలకైనా నీవు నాదానివేలే
ఇందుకు సాక్షులు గిరులు తరులు...గిరులు తరులు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి

చరణం2:

నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన
నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోన
ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా
గౌరిశంకరులకందం మనది విడిపోని బంధం
ఇందుకు సాక్షులు సూర్యుడు చంద్రుడు...సూర్యుడు చంద్రుడు

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి
ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి
ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Jan-2009

ప్రజారాజ్యం పార్టి థీం సాంగ్

ప్రజారాజ్యం పార్టి థీం సాంగ్ అభిమానులకోసం

సాహిత్యం:అనంత శ్రీరాం




జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
ప్రభాత సూర్య ప్రేరితం
అనంత శక్తి పూరితం

దిగత్ దిగత్ దిగత్ దిగత్ దిగత్ దిగంత వ్యాపితం
అనుక్షణం ప్రకాశితం ప్రగాడ తిమిర నాశకం

ప్రవర్ణ అరుణ వాసితం నవీన విప్లవాత్మకం
సువర్ణ హరిత వందితం సుభిక్ష సస్యశ్యామలం

సుసప్త వర్ణ విలితం పవిత్ర శ్వేత శోభితం
ప్రపంచ శాంతి కాంక్షితం ప్రశాంత నయనరంజితం

చతుర్ వింసతి కిరణ సహిత భానుబింబ క్రేంద్రితం
శతసహస్ర మృదుల హృదయ వందితం చవందితం
వినీల గగన వద్యమం అమంద వాయు స్నేహితం
అలాంటి ఓ పతాకమా సలాం సలాం తుజే సలాం

జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
అహింస తనకి ఆయుధం
స్వరాజయమే మహాశయం

చిరాయువైన నవ్వుతో చివాలు పల్లె పల్లెలో
స్వతంత్రకాంతి నింపిన మహాత్మ గాంధి దీవెన

బడుగు జనుల నుదిటిరాత మార్చినట్టి నేతరా
అంబేద్కరు కలాన ఉన్న రాజనీతి వీవన

కులాలులేని సంఘమే సరైన తన గుండెరా
సమాజ న్యాయ జ్యోతిలోన పూలే సత్య శోధన

విశాల విశ్వమాతగా శృతింపతగిన తల్లిరా
మదర్ థెరిసా చేతిలోన లభించు ప్రేమ లాలన

గ్రహించుకున్న ధవళకాంతి చిందుతున్న అరుణకాంతి
అలాంటి ఓ పతాకమా bless me bless me kindly bless me

జయ జయ జయప్రదం
శుభ శుభ శుభప్రదం
జగాన మానవత్వమే జ్వలింప చేయు అద్భుతం

ప్రజా ప్రయోజనార్ధమై ప్రచండ సింహగర్జనై
డమ డమ నినాదమై ధ్వనించు సమరదుంధుబి

అనాధ జీవ రక్షకై అభాగ్య జనుల నీడకై
అహర్నిశల్ అహర్నిశల్ తపించు వస్త్ర వృక్షమా

సమస్త రైతు శోకమే నశింపజేయు మేఘమా
గంగ పుత్ర హాసమే ఉప్పొంగ చేయు మత్స్యమా

సమాశ్రయించు శ్రామికుల్ పరిశ్రమించు సేవకుల్
అనేక వృత్తి కార్మికుల్ అంగాంగ వికల్ సోదరుల్

మనస్సునందు సంతసం ఫలింపచేయు దైవమా
అలాంటి ఓ పతాకమా ఆదాబ్ ఆదాబ్ ఆదాబ్ బర్సే

మహిళా శక్తితో నవయువ శక్తితో తరగని శక్తితో
ప్రజాభీష్టమగు ప్రజారాజ్యకర ప్రతీక నీవే పతాకమా పతాకమా

నమోనమో నమోనమ నమోనమో నమోనమ
నమోనమో నమోనమ నమోనమో నమోనమ
నమోనమో నమోనమ నమోనమో నమోనమ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Jan-2009

వారసుడొచ్చాడు

గాత్రం:బాలు



పల్లవి:

ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో
ఓరబ్బడి సుబ్బాయమ్మ నీ మొగుడు సిపాయమ్మ
ఆడెక్కడికెళ్ళాడమ్మ ఏ చుక్కని పట్టాడమ్మ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో
సంకురాతిరొస్తానని సంకబిడ్డనిస్తానని టపాలో ఉత్తరమేసాడా ఆ ఆ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్


చరణం1:

మందారపువ్వెడితే మంచి మొగుడొస్తాడని మంచమెక్కి వుంటాడని మంచానె పడివుంటాడని
చామంతి పువ్వు పెడితే చిట్టిమొగుడొస్తాడని చుట్టుగాజులిస్తాడని గట్టిగ చుట్టుకువుంటాడని
కోలాటమాడిందె బుల్‌బుల్‌పిట్ట గోరంచు పైటచెంగు జారేనెట్ట
కోలాటమాడిందె బుల్‌బుల్‌పిట్ట గోరంచు పైటచెంగు జారేనెట్ట
జారుడుచెంగుల జింతానో జాతరతొక్కుడు ఉయ్యాలో
ముడుపుకట్టి ముద్దులాడె పండగ
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్

చరణం2:

ఓలమ్మ చక్కని చుక్క నీసోకు మంచమెక్క ఇస్తాను చెరుకుముక్క.. ఇస్తాడమ్మ చెరుకుముక్క
ఆకువక్క చెరుకుముక్క నింగినిప్పి వలపుచుక్క కలిపేసి చూడు లెక్క..వడ్డీమీద వడ్డీ లెక్క
వడ్డీలు గుంజేది నీకొసమే వడ్డణమేట్టాలని
వడ్డీలు గుంజేది నీకొసమే వడ్డణమేట్టాలని
అల్లరిచిల్లరి ఆలుచిప్ప చక్కని చుక్కల కొబ్బరిముక్క లగ్గాలెట్టి పగ్గంపట్టి ఆడిస్తా
ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్

చరణం3:

అల్లుళ్ళ పండగని అత్తింటి ఆశలని గుత్తంగా పెడుతుంటే గుచ్చిగుచ్చి పెడుతుంటే
ఒళ్ళంత పొగరుపడె ఇళ్ళంత గుల్లబడె అత్తేమో దిగులుపడె..అత్తామావా దిగులుపడె
శనిగ్రహం పడితే ఏడేళ్ళంట అల్లుళ్ళ గ్రహ పడితే అంతేనంట
శనిగ్రహం పడితే ఏడేళ్ళంట అల్లుళ్ళ గ్రహ పడితే అంతేనంట
బావలు బావలు పన్నీరు బావను పట్టుకు తన్నేరు
వీసెడు గంధం వీపుకురాసి గుడ్డేరు

ఏలాద్రి ఎంకన్న ఏడ దాగినావన్న సంక్రాంతి వేడుకొచ్చిందో
మా పల్లె ఈడుకొచ్చిందో హొయ్ హొయ్ హొయ్
ఓరబ్బడి సుబ్బాయమ్మ నీ మొగుడు సిపాయమ్మ
ఆడెక్కడికెళ్ళాడమ్మ ఏ చుక్కని పట్టాడమ్మ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Jan-2009

ఊరంతా సంక్రాంతి

తారాగణం:కృష్ణ,శ్రీదేవి
గాత్రం:బాలు,సుశీల,జానకి
సంగీతం:ఎస్పి.బాలసుబ్రహ్మణ్యం
దర్శకత్వం:దాసరి నారాయణరావు
విడుదల:1983



పల్లవి:

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ బ్రతుకంత తొలిపండగ

చరణం1:

అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
అరెరెరెరె లోగిల్లలోన సిగ్గులన్ని వెల్లలేసె ప్రేమ రంగులేసె
కన్నెపిల్లలో సోకు పండిందని సాకు కావాలని తోడు రావాలని
అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను
గారాలే ముడులు వేసి గంధాలు పూసేను
ఆ ఆ ఆ అల్లీ అల్లని పందిట్లో అల్లరి జంటల ముచ్చట్లు
చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్లు
దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

చరణం2:

వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
కల్లల్లోని ఆశలన్ని కొండాకొచ్చి వెయ్యి ముడుపులిచ్చి
గుండె చాటు కలలన్ని తీరాలని వలపు సాగాలని రేవు చేరాలని
వయ్యరం వలపు వాకిట చిరుచిందులేసేను
సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను
నవ్వీ నవ్వని నవ్వుల్లో తెలిసి తెలియని ఒరవళ్ళు
కలిసీ కలవని కళ్ళల్లో తీరి తీరని ఆకళ్ళు
తీరే రోజు రేపోమాపో రావాలని

సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ ఆ బ్రతుకంత తొలిపండగ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Jan-2009

పెళ్ళి సందడి

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

కాబోయే శ్రీవారికి ప్రేమతో రాసి పంపుతున్న ప్రియరాగాల ఈ లేఖ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
నిన్ను చూసినాక నిదురైన రాక మనసే పెళ్ళి మంత్రాలు కోరిందని
బిగి కౌగిట హాయిగ కరిగేది ఏనాడని అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే

చరణం1:

Yes you are my dream girl
నా కలల రాణి నా కళ్ళ ముందుంది
అద్భుతం అవును అద్భుతం మన కలయిక అద్భుతం
ఈ కలయిక ఇలాగే వుండాలి
ప్రామిస్..ప్రామిస్

నిన్ను చూడందే పదే పదే పడే యాతన
తోట పూలన్ని కనీ వినీ పడేను వేదన
నువ్వు రాకుంటే మహాశయా మదే ఆగునా
పూల తీగల్తో పడే ఉరే నాకింక దీవెన
చూసే కన్నుల ఆరాటం రాసే చేతికి మోమాటం
తలచి వలచి పిలచి అలసి
నీ రాక కొసం వేచి వున్న ఈ మనసుని అలుసుగ చూడకనీ అంటూ
మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తొట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే

చరణం2:

పెళ్ళి చూపుల్లో నిలేసిన కధేమిటో మరి
జ్ఞాపకాలల్లో చలేసిన జవాబు నువ్వనీ
సందె పొద్దుల్లా ప్రతీ క్షణం యుగాలై ఇలా
నీటి కన్నుల్లా నిరీక్షణం నిరాశ కాదని
తప్పులు రాస్తే మన్నించు తప్పక దర్శనమిప్పించు
ఎదటో నుదుటో ఎచటో మజిలీ
నీ మీద ప్రాణం నిలుపుకున్న మా మనవిని విని దయచేయమని అంటూ

మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే
మా తోట చిలకమ్మ నీ కొసం ఎదురే చూసే
సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ
సపమనిపగ గామరీసాస నిస రిస రిపగ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Jan-2009

పుట్టింటి పట్టుచీర

తారాగణం:సురేష్,యమున,చిన్నా,గొల్లపూడి మారుతీరావు
గాత్రం:బాలు,చిత్ర
దర్శకత్వం:బోయిన సుబ్బారావు
విడుదల:1990



పల్లవి:

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కోటిపుణ్యాల తోట కోరి మరీ వచ్చిందంట
కొన్ని జన్మాలదాక మహారాణి నేనేనంట
పిడికిడంత గుండెల్లో ఈ పైడికొండ పట్టేదెట్టా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా

చరణం1:

సమస్త సుఖాలు తధాస్తు పలికిన ముహూర్తబలం ఇది
అనంత సుఖాలు సుధల్ని చిలికిన పవిత్రక్షణం ఇది
ఎడారి మనస్సులో వెలిసిన వసంతవనం ఇది
ప్రభాత సరస్సులో విరిసిన సువర్ణ సుమం ఇది
అగ్నిసాక్షి అనుబంధం వెయ్యేళ్ళ బాట చూపేనంట

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా

చరణం2:

గులాబి నిషాల కుమారి కులుకుల చలాకితనం ఇది
కుహుకుహుమను కులాస కథలకు ఉగాది కదా ఇది
వయ్యారి వరూధిని వధువుగ వరించు వరం ఇది
సరాగ స్వరాలతో మధనుడి సుగంధశరం ఇది
పలకరించు పొంగుల్లో పన్నీటి తానమాడలంట

కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కోటిపుణ్యాల తోట కోరి మరీ వచ్చిందంట
కొన్ని జన్మాలదాక మహారాణి నేనేనంట
పిడికిడంత గుండెల్లో ఈ పైడికొండ పట్టేదెట్టా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా
కన్నారా కళ్ళారా కన్నెకలల్లారా
గుమ్మంలో నిలిచిన స్వర్గం గుర్తుపట్టినారా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-Jan-2009

అయ్యప్పస్వామి జన్మరహస్యం

తారాగణం:సంజయ్,శ్రీధర్,సుధారాణి
గాత్రం: యేసుదాసు
సంగీతం:కె.వి.మహదేవన్
నిర్మాత: దాసరి నారాయణరావు
దర్శకత్వం:రేణుక శర్మ
విడుదల:1987




పల్లవి:

స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

చరణం1:

అంధకారమందే అలమటించి నేను
కన్నులుండి కూడా కాననైతి నిన్ను
అంధకారమందే అలమటించి నేను
కన్నులుండి కూడా కాననైతి నిన్ను
దేవ దేవ నాపై కరుణ కురియవేల
దేవ దేవ నాపై కరుణ కురియవేల
వెలుగు వైపు నాకు వేగమె చూపించుము త్రోవ
వెలుగు వైపు నాకు వేగమె చూపించుము త్రోవ
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

చరణం2:

సిరులనెన్నడైన అడుగటెరుగనయ్య
స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్య
సిరులనెన్నడైన అడుగటెరుగనయ్య
స్వర్గ సుఖము కోరి వరము వేడనయ్య
ముక్తి పొందనెంచి చేయి చాచనయ్య
ముక్తి పొందనెంచి చేయి చాచనయ్య
శంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య
శంతికోరి నిన్నే నేను పాడుచుందునయ్య
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

చరణం3:

కనులలోన నీవే వెలుగు నింపువయ్య
మనసులోన నీవె కొలువు తీరువయ్య
కనులలోన నీవే వెలుగు నింపువయ్య
మనసులోన నీవె కొలువు తీరువయ్య
మధుర సుస్వరాల సుధలు కురియునయ్య
మధుర సుస్వరాల సుధలు కురియునయ్య
జీవులెల్ల నిన్ను కొరే శాంతినొసగుమయ్య
జీవులెల్ల నిన్ను కొరే శాంతినొసగుమయ్య

స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
స్వామి అయ్యప్ప స్వామీ అయ్యప్ప నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా
నీవే గతి దేవా నన్ను బ్రోవగ ఇక రావా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Jan-2009

ఆపద్భాందవుడు

గాత్రం:చిత్ర



పల్లవి:

చుక్కల్లారా చూపుల్లారా ఎక్కడమ్మ జాబిలి
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండే దారికి
వెళ్ళనివ్వరా వెన్నెలింటికి విన్నవించరా వెండిమింటికి
జోజో లాలి జోజో లాలి

చరణం1:

మలిసంధ్య వేళాయె చలిగాలి వేణువాయె నిద్దురమ్మ ఎటుబోతివె
మునిమాపు వేళాయె కనుపాప నిన్ను కోరె కునుకమ్మ ఇటు చేరవే
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
నిదురమ్మ ఎటుబోతివే కునుకమ్మ ఇటు చేరవె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గోధూళి వేళాయె గూళ్ళన్ని కనులాయె
గువ్వల రెక్కలపైన రివ్వు రివ్వున రావె
జోల పాడవా బేలకళ్ళకి వెళ్ళనివ్వరా వెన్నెలింటికి
జోజో లాలి జోజో లాలి జోజో లాలి జోజో లాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-Jan-2009

మూగ మనసులు

గాత్రం:సుశీల



పల్లవి:

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను
మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను

చరణం1:

నాకూ ఒక మనసున్నాది నలుగురిలా అశున్నాది
నాకూ ఒక మనసున్నాది నలుగురిలా అశున్నాది
కలలు కనే కళ్ళున్నాయి
కలలు కనే కళ్ళున్నాయి అవి కలత పడితే నీళ్ళున్నాయి

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను

చరణం2:

ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ చమురును పోసీ భ్రమ చూపేవా
ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ చమురును పోసీ భ్రమ చూపేవా
ఇంతా చేసీ వెలిగించెందుకు ఎనక ముందులాడేవా

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను

చరణం3:

మనిషితోటి ఏళాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనిషితోటి ఏళాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా
మనసుతోటి ఆడకు మావా విరిగిపోతె అతకదు మళ్ళ

మానూ మాకును కాను రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను నీ మనిషిని నేను

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Jan-2009

సూత్రధారులు

గాత్రం:బాలు,శైలజ



పల్లవి:

అయ్యా ఆ ఆ ఆ ఆ రామయ్య
కొలిచినందుకు నిన్ను కోదండరామ
కొలిచినందుకు నిన్ను కోదండరామ
కోటి దివ్వెల పాటి కొడుకువయినావా
తలచినందుకు నిన్ను దశరథ రామ
వెండి కొండల సాటి తండ్రివయినావా
జయరామ జగదభిరామ
పరందామ పావన నామ
జయరామ జగదభిరామ
పరందామ పావన నామ

చరణం1:

బుడిబుడి నడకల బుడతడివై ఒడిలో ఒదిగిన ఓరయ్యా
బుడిబుడి నడకల బుడతడివై ఒడిలో ఒదిగిన ఓరయ్యా
కలల పంటగా బ్రతుకు పండగా
కలల పంటగా బ్రతుకు పండగా
కళ్యాణరాముడిలా కదలి వచ్చావా
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

చరణం2:

నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగ ఓరయ్య
నడిచే నడవడి ఒరవడిగా నలుగురు పొగడగ ఓరయ్య
నీతికి పేరుగ ఖ్యాతికి మారుగ
నీతికి పేరుగ ఖ్యాతికి మారుగ
సాకేతరాముడిలా సాగిపోవయ్య
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

చరణం3:

ఎంతడివాడోయ్ రామచంద్రుడు
ఎంతడివాడోయ్ రామచంద్రుడు
ఆ తాటకిని చెండాడినాడోయ్
యాగమును కాపాడినాడెంతడివాడోయ్ రామచంద్రుడు
ఎంతడివాడోయ్ రామచంద్రుడు
మిధిలకు వచ్చి రామయ్య రాముడు
శివుని విల్లు విరిచి రామయ్య రాముడు
అహ సీతను చేపట్టి రామయ్య రాముడు
హొయ్ హొయ్ సీతను చేపట్టి రామయ్య రాముడు
సీతారాముడు అయ్యేదెప్పుడో
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ
జయరామ జగదభిరామ పరందామ పావన నామ

||

05-Jan-2009

తెనాలి రామకృష్ణ

గాత్రం:పి.లీల



పల్లవి:

జగములా దయనేలే జనని
జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని

చరణం1:

మరుని గెలిచినవానికి మరులు
మరుని గెలిచినవానికి మరులు
మరిపే సుందరవదనా
ఆపదలందున ఆదరించవే లలితా శైలసుధా ఆ ఆ లలితా శైలసుధా

జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని
సదాశివుని మనోహరిని పదములే కొలిచేనే మదిని
దేవి జగములా దయనేలే జనని


||

02-Jan-2009

సంకీర్తన

గాత్రం:బాలు,జానకి



పల్లవి:

మనసున మొలిచిన సరిగమలే ఈ గలగల నడకల తరగలుగా
నా కలలను మోసుకు నిను చేరి ఓ కమ్మని ఊసును తెలిపేనే
కవితవు నీవై పరుగున రా
ఎదసడితో నటియించగ..రా
స్వాగతం సుస్వాగతం ,స్వాగతం సుస్వాగతం

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కుకుకు కుకుకు కీర్తన తొలి ఆమనివై రా
పిలిచే చిలిపి కోయిల ఎట దాగున్నావు
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
మీ నృత్యం చూసి నిజంగా...ఉం నిజంగా

చరణం1:

మువ్వలరవళి పిలిచింది కవిత బదులు పలికింది
కలత నిదుర చెదిరింది మనసు కలను వెదికింది
వయ్యారాల గౌతమి ఈ ఈ ఈ
వయ్యారాల గౌతమి ఈ కన్యా రూప కల్పన
వసంతాల గీతమే నన్నే మేలుకొల్పినా
భావాలపూల రాగాలబాట నీకై వేచేనే

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు

చరణం2:

లలిత లలిత పదబంధం మదిని మధుర సుమగంధం
చలిత మృదుల పదలాస్యం అవని అధర దరహాసం
మరందాల నాదమే
మరందాల నాదమే మృదంగాల నాదము
ప్రబంధాల ప్రాణమే నటించేటి పాదము
మేఘాల దారి ఊరేగు ఊహ వాలే నీ మ్రోల

కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు
ఎదో స్వరగతి నూతన పదగతి చూపేను నను శృతిచేసి
ఇది నా మది సంకీర్తన కుకుకు కుకుకు కూ
సుధలూరే ఆలాపన కుకుకు కుకుకు కూ
రారా స్వరముల సోపానములకు పాదాలను జతచేసి
కూకు చికు చికు కూకు చికు చికు కూకు చికు చికు కూకు

||

01-Jan-2009

ప్రియా ఓ ప్రియా

తారాగణం:నవీన్,అబ్బాస్,సిమ్రన్
గాత్రం:బాలు,చిత్ర
సంగీతం:కోటి
దర్శకత్వం:ముప్పలనేని శివ
విడుదల:1997



పల్లవి:

హూలల హూలల హులల్లా హులలలలా
హూలల హూలల హులల్లా హులలలాల
కమ్మని కలలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
పలికిన పాటనికి నా ప్రాణం
అంకితం అన్నది నా హృదయం
హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
చిరునవ్వుల వీణల్లు మీటి వినిపించినదో నవరాగం
హేపీ న్యూఇయర్ హేపీ న్యూఇయర్
కమ్మని కల్లలకు ఆహ్వానం
చక్కని చెలిమికి శ్రీకారం
హేపీ న్యూఇయర్

చరణం1:

ఓ జాబిలీ నా నెచ్చెలీ
విన్నానులే నీవన్న మాట
నా కోసమే వస్తావని కట్టానులే ఓ కలలకోట
అణువణువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో
అణుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో
ప్రియా ఓ ప్రియా
ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా

చరణం2:

హూలల హూలల హులలా హులలల్లలా
హూలల హూలల హులలా హులలల్లలా
ఓ నేస్తమా, ఓ నేస్తమా
చిరు గాలితో, చిరు గాలితో
కబురంపినా ,కబురంపినా, నేనాగలేక
ఓ జానేమన్ ఓ జానేమన్
మేరి హేవన్ మేరి హేవన్
రాసేయనా ,రాసేయనా, ఓ ప్రెమ లేక
విరహమనే మంచు తెరలో చిక్కినదో లేత పరువం
కౌగిలిలో వెచ్చ బడితే పరుగుల్లులే కన్నె బిడియం
ప్రియా ఓ ప్రియా ,ప్రియా ఓ ప్రియా
మనసులో ఉన్నది ఓ మాట తెలుపనా కమ్మగా ఈ పూట
ప్రియా ఓ ప్రియా
పులకించిన కాలపు ఒడిలో
పురి విప్పినదో స్వరపుష్పం
ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~