29-May-2009

గాండీవం

తారాగణం: నాగేశ్వరరావు,బాలకృష్ణ,మోహన్‌లాల్,రోజా
గాత్రం: శ్రీకుమార్,బాలు,చిత్ర
సంగీతం :కీరవాణి
దర్శకత్వం :ప్రియదర్శన్
విడుదల:1994



పల్లవి:

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా

చరణం1:

ఏటి మనుగడ కోటి అలలుగ పొంగు వరదల రేగాల
పడిలేచు అలలకు తీపి కలలకు లేని అలసట నీకేల
నల్లనల్ల ఎండల్లోన ఎల్లాకిల్లా పడ్డటున్న అల్లోమల్లో ఆకాశాన చుక్కల్లో
అమ్మాయంటి జాబిలమ్మ అబ్బాయంటి సూర్యుడమ్మ ఇంటి దీపలవ్వాలంట దిక్కుల్లో
ఎవరికి వారే యమునకు తీరే
రేపుమీద మాపటంట మాపతోడు రేపుదంట పంచుకుంటే

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా

చరణం2:

ప్రేమ ఋతువులు పూలు తొడిగిన తేనె మనసుల నీడల్లో
మురిపాల నురగలు పంటకెదిగిన బాల సొగసుల బాటల్లో
బుగ్గందాల ఇల్లు నవ్వే సిగ్గందాల గుల్ల నవ్వే
బాలయ్యొచ్చి కోళటాలాడే వేళల్లో
పైరందాల చేలు నవ్వే పేరంటాల పూలు నవ్వే
గోపెమ్మొచ్చి గొబ్బిల్లాడే పొద్దుల్లో
పరవశమేదో ఓ ఓ ఓ
పరిమళమాయే ఏ ఏ ఏ ఓ
పువ్వు నవ్వే దివ్వె నవ్వే జివ్వుమన్న జన్మ నవ్వే పాడుతుంటే

గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గలగలా గంటలే మోగనేల
గోప బాలుడొచ్చినాక గొకులానికి పెదాల కిలకిలా పువ్వులే పుట్టలేదా
బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా
వారసున్ని చూసినప్పుడే వరాల వాంఛలన్ని పల్లవించగా
నందుడింట చిందులేసె అందమైన బాలుడే తనవాడై

||

28-May-2009

చదువుకున్న అమ్మాయిలు

గాత్రం: ఘంటసాల,సుశీల



పల్లవి:

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
మొదటిరోజు కోపం అదొరకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహతాపం
బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం1:

పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
పడుచువాడి ఒహొ పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
వగలాడి తీపితిట్టు తొలివలపు తేనె పట్టు
ఆ తేనెకోరి చెంత చేర చెడామడా కుట్టు
అహ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం2:

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
వేడుకున్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది

చరణం3:

చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
చిలిపి కన్నె ఉహు చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తిచేయి,తగుఫలితముండునోయి
మరుపురాని మధురమైన ఫ్రైజు దొరుకునోయి

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
ఆ ఆ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

||

27-May-2009

అభిలాష

గాత్రం:బాలు,జానకి



పల్లవి:

యురేకా
హే నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
సక మిక సక మిక సక మిక

చరణం1:

లవ్వు సిగ్నల్ నాకివ్వగానే నవ్వుకున్నాయ్ నా యవ్వనలే
నవ్వుతోనే నమిలెయ్యగానే నాటుకున్నై నవ నందనాలే
అహ చూపుల్లో నీ రూపం కనురెప్పలో నీ ప్రాణం
కన్ను కొట్టి కమ్ముకుంట కాలమంతా అమ్ముకుంట
కన్నె ఈడు జున్నులన్ని జుర్రుకుంట

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక

చరణం2:

కస్సుమన్న ఓ కన్నెపిల్ల యస్ అంటే ఓ కౌగిలింత
కిస్సులిచ్చి నే కౌగిలిస్తే తీరిపొయే నాకున్న చింత
నెను పుట్టిందే నీకోసం ఈ జన్మంతా నీ ధ్యనం
ముద్దు పెట్టి మొక్కుకుంట మూడుముళ్ళు వేసుకొంట
ఏడుజన్మలు ఏలుకొంట నేను జంటగా

నవ్వింది మల్లెచెండు నచ్చింది గాళ్‌ఫ్రెండు
అరె ధొరికెరా మజాగ ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా
యురేకా సక మిక నీ ముద్దు తీరేదాకా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-May-2009

భట్టి విక్రమార్క

తారాగణం : రామారావు,యస్.వి.రంగారావు,కాంతారావు,అంజలీదేవి
గాత్రం: ఘంటసాల,సుశీల
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
దర్శకత్వం: జంపన చంద్రశేఖరరావు
నిర్మాత : పోలిశెట్టి వీర వెంకట సత్యనారాయణమూర్తి
నిర్మాణ సంస్థ: పి.వి.వి.ఎస్.ఎం. ప్రొడక్షన్స్
విడుదల: 1960



పల్లవి:

ఓ నెలరాజ వెన్నెలరాజ
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలొయ్
నీ వెన్నుతట్టి పిలిచింది నీవేనొయ్
ఓ నెలరాజ

చరణం1:

చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
కొంటెచూపు నీకేల చంద్రుడా
నావెంటనంటి రాకోయి చంద్రుడా ఆ ఆ ఆ

ఓ నెలరాజ వెన్నెలరాజ
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలొయ్
నీ వెన్నుతట్టి పిలిచింది నీవేనొయ్
ఓ నెలరాజ

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
కలువల చిరునవ్వులే కన్నెల నునుసిగ్గులే
వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
వాన్ని విడువమనకు తరమవునా చంద్రుడా

ఓ నెలరాజ వెన్నెలరాజ
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలొయ్
నీ వెన్నుతట్టి పిలిచింది నీవేనొయ్
ఓ నెలరాజ

చరణం3:

లేత లేత వలపులే పూత పూయువేళలో
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా
కలవరింతలెందుకోయి చంద్రుడా
నా చెలిమి నీదె కాదటోయి చంద్రుడా

ఓ నెలరాజ వెన్నెలరాజ
నీ వన్నెలన్ని చిన్నెలన్ని మాకేలొయ్
నీ వెన్నుతట్టి పిలిచింది నీవేనొయ్
ఓ నెలరాజ

||

22-May-2009

ఆకలిరాజ్యం

గాత్రం: సుశీల
సాహిత్యం: ఆత్రేయ



పల్లవి:

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
ఈ లోకం మారేది కాదు
ఈ శోకాలు తీరేవి కావు
దోర పాకాన ఉన్నాను నేను
కోత్తలోకాన్ని నాలోన చూడు
గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

చరణం1:

ఆ ఆ ఆ ఆ ఆ
దేశాన్ని దోచేటి ఆసాములున్నారు
దేవుణ్ణి దిగమింగు పూజారులున్నారు
ప్రాణాలతో ఆడు వ్యాపారులున్నారు
మనిషికి మంచికి సమాధి కట్టారు
మహాత్ములెందరు సహాయపడినా మంచి జరగలేదు
మహాత్ములెందరు సహాయపడినా మంచి జరగలేదు
జాతి వైద్యులే కోత కోసినా నీతి బ్రతకలేదు
భోగాలు వెతుకాడు వయసు
అనురాగాల జతిపాడు మనసు
నీ దాహనికనువైన సొగసు
నీ స్వర్గాన్ని చేస్తుంది పడుచు

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కాటుకెట్టిన కళ్ళలో కైపులున్నవి
మల్లెలెట్టిన కురులలో మాపులున్నవి
వన్నె చేరిన కన్నెలో చిన్నెలున్నవి
అన్ని నీవే అనుటకు రుజువులున్నవి
చక్కని చుక్క సరసనుండగా పక్క చూపులేల
చక్కని చుక్క సరసనుండగా పక్క చూపులేల
బాగుపడని ఈ లోకం కోసం బాధపడేవేల
మోహన్ని రేపింది రేయి
మన స్నేహంలో ఉందోయి హాయి
ఈ అందానికందివ్వు చేయి
ఆనందాల బంధాలు వేయి

ఆ గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య
కోపం మనిషికి ఎగ్గయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-May-2009

చంటి

గాత్రం:చిత్ర



పల్లవి:

జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోయె చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే

చరణం1:

వేమనయ్య నా గురువే
వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే
హాయి నిద్ర నా పలకే
వేమనయ్య నా గురువే
వేలిముద్ర నా చదువే
పాలబువ్వ నా పలుకే
హాయి నిద్ర పాపలకే
కూనలమ్మ నా పదమే
తేనె కన్న తీయనిది
కోనలన్ని పాడుకొనే గువ్వ చిన్న పాట ఇది
రాగములు తాళములు నాకసలు రావులే
పాడుకును ధ్యానమునే నాకొసగే దైవమే

ముద్దులోనే పొద్దుపోయే
కంటి నిండా నిదరోయె చంటి పాడే జోలలోనే
జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే


||

19-May-2009

అమ్మ రాజీనామా

గాత్రం: జేసుదాసు



పల్లవి:

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ

చరణం1:

బొట్టుపెట్టి పూజచేసి
గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
బొట్టుపెట్టి పూజచేసి
గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోత కోత
విత్తునాటి చెట్టు పెంచితే ఏ ఏ
చెట్టు పెరిగి పళ్ళు పంచితే ఏ ఏ
తిన్న తీపి మరచిపోయి చెట్టు కొట్టి కట్టెలమ్మితే
లోకమా ఇది న్యాయమా ?
లోకమా ఇది న్యాయమా ?

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ

చరణం2:

ఆకుచాటు పిందె ముద్దు
తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకుచాటు పిందె ముద్దు
తల్లిచాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు
ఉగ్గుపోసి ఊసు నేర్పితే ఏ ఏ
చేయిబట్టి నడక నేర్పితే ఏ ఏ
పరుగు తీసి పారిపోతే
చేయిమార్చి చిందులేస్తే
లోకమా ఇది న్యాయమా ?
లోకమా ఇది న్యాయమా ?

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతడిని సృష్టించనొదక అమ్మ


||

17-May-2009

సీతారామయ్యగారి మనవరాలు

గాత్రం: చిత్ర,జిక్కి etc




పల్లవి:

వెలుగురేఖలవారు తెలవారి తామొచ్చి ఎండాముగ్గులు పెట్టంగ
చిలకాముక్కులవారు చీకటితోనేవచ్చి చిగురుతోరణ కట్టంగా
మనవలనెత్తే తాత మనువడ వచ్చాడు
మందారపువ్వంటి మా బామ్మని అమ్మమ్మని

నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ
పండంటి ముత్తైదు సందామామ ఆ ఆ ఆ
పసుపుబొట్టంత మాతాత సందామామ ఆ ఆ ఆ ఆ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం1:

కూర్చుని చెరిగే చేతికురులపై తుమ్మెదలాడే ఓ లాల
తుమ్మెదలాడే ఓ లాల
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓ లాల
గాజులు పాడే ఓ లాల
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా
కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెలపాదం తొక్కిన ఘనుడే ఏలాల
ఏలాలో ఏలాల ఏలాలో ఏలాల

దివిటీల చుక్కల్లో దివినేలు మామ సందామామ సందామామ
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామ సందామామ
నోమీనమ్మల్లలాలో నోమన్నలాలో సందామామ సందామామ
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామ సందామామ

చరణం2:

ఆపైన ఏముంది ఆ మూల గదిలోన
ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి పొంగల్లరాత్రి
ఆ మంచమే పెంచె మీ తాత వంశం
అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి
మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవైయ్యేళ్ళవాడు నీ రాముడైతే
పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ
పసుపుకుంకుమ కలిపి చేసాడు బ్రహ్మ

ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-May-2009

గులాబి




పల్లవి:

మేఘాలలో తేలిపొమ్మన్నది
తూఫానుల రేగి పొమ్మన్నది
అమ్మాయితో సాగుతూ చిలిపి మది
beat in my heart ఎందుకింత కొట్టుకుంది
beat in my heart వెంటపడి చుట్టుకుంది
oh my god ఎమిటింత కొత్తగున్నదీ
beat in my heart ఎందుకు ఇట కొటుతుంది
beat in my heart వెంటపడి చుట్టుకుంది
oh my god ఎమిటింత కొత్తగున్నదీ

చరణం1:

హల్లో పిల్ల అంటూ ఆకతాయి ఆనందాలు
ఆలాపిస్తువుంటే స్వాగతాల సంగీతాలు
ఆడగ నెమలి తీరుగ మనసు ఘల్ ఘల్ ఘల్లుమని
ఆకాశాన్నె హద్దు పావురాయి పాపయికి
ఆగే మాటే వద్దు అందమైన అల్లరి
మారగ వరద హోరుగా వయసు ఝల్ ఝల్ ఝల్లుమని

ఓం నమహ వచ్చిపడు ఊహలకు
ఓం నమహ కళ్ళువీడు ఆశలకు
ఓం నమహ ఇష్టమైన అలజడికీ

చరణం2:

రెచ్చి రెచ్చి ఉంది రెచ్చిపొయి పిచ్చి స్పీడు
వద్దంటున్న విందే చెంగుమంటు చిందె ఈడు
గువ్వల రివ్వు రివ్వున యవ్వనం ఎటు పోతుంది
కట్టేలేక ఈడు నన్ను మెచ్చుకుంది నేడు
పందెంవేస్తా చూడు పట్టలేరు నన్నెవ్వడు
అంతగ బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది

నీ తరహా కొంప ముంచేటట్టే వుంది
నా సలహా ఆలపిస్తే సేఫ్టి వుంది
ఏంటి మహా అంత జోరు కాస్త నెమ్మది

beat in my heart ఎందుకింత కొట్టుకుంది
beat in my heart వెంటపడి చుట్టుకుంది
oh my god ఎమిటింత కొత్తగున్నదీ
beat in my heart
beat in my heart
oh my god

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-May-2009

విప్రనారాయణ

గాత్రం:భానుమతి



పల్లవి:

నను విడనాడకురా స్వామి
నను విడనాడకురా స్వామి
మనసున మాలిమి మరువబోకురా
నను విడనాడకురా స్వామి
మనసున మాలిమి మరువబోకురా
నను విడనాడకురా

చరణం1:

కలిగిన కలతలు కలలైపోయెను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కలిగిన కలతలు కలలైపోయెను
కలిసిన మాటలు వలలైనవిరా
కలిసిన మాటలు వలలైనవిరా
నను విడనాడకురా స్వామి
మనసున మాలిమి మరువబోకురా
నను విడనాడకురా

చరణం2:

ఎరిగి ఎరుగని పలుకులు తలుకా
ఎరిగి ఎరుగని పలుకులు తలుకా
ఎరగిన చెలిపై తగునా కినుక
ఎరగిన చెలిపై తగునా కినుక
మరుడవు మరుడవు గురుడవు నీవని
మరుడవు మరుడవు గురుడవు నీవని
మరులుగొన్న నీ పదదాసినిరా

నను విడనాడకురా స్వామి
మనసున మాలిమి మరువబోకురా
నను విడనాడకురా

||

10-May-2009

అమ్మ

తారాగణం: సుహాసిని,బేబి సునయన
గాత్రం: బాలు,జానకి
సాహిత్యం: వేటూరి
సంగీతం: కీరవాణి
దర్శకత్వం: సురేష్‌కృష్ణ
నిర్మాత: రామోజిరావు
సంస్థ: ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 1991



మాతృదినోత్సవ సందర్భంగా అమ్మలందరికి మాతృదినోత్సవ శుభాకంక్షలు



పల్లవి:

మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని
పుట్టినందుకు పువ్వుగ మారి కొలవరా అమ్మని
పువ్వురాలినా తావి తీరని జన్మకే జన్మని,అమ్మని
మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని

చరణం1:

బ్రహ్మను కన్న భగవతి
మమతలు పంచే మధుమతి
కోవెల ఎరుగని హారతి
ఏ వెల కందని శ్రీమతి
కర్ణ రాధని,భీష్మ గంగని
కీర్తని ఆ కృష్ణ యశోదని
వేదనతీర్చే వేద వాక్కుగా పిలవరా అమ్మని
పేగుచించి నీ పేరుపెట్టిన ఆమెదే ప్రేమని అమ్మని

మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని

చరణం2:

సహనంలో ఒక సాగరం
జీవనదులకే పుష్కరం
అమ్మ అన్న మధురాక్షరం
అనురాగంలో సుస్వరం
తల్లి గౌరిని,కన్నె మేరిని
కన్యకా పరమేశ్వరి ధరణిని
ఆకలేసిన కేకలేసిన అలగని అమ్మని
ఆదిశేషువే పొగడలేడురా భాషలో అమ్మని అమ్మని

మా జనని లోక పావని
మా అవని ప్రేమ ధమని
పుట్టినందుకు పువ్వుగ మారి కొలవరా అమ్మని
పువ్వురాలినా తావి తీరని జన్మకే జన్మని,అమ్మని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-May-2009

దొంగల్లో దొర

తారాగణం : అక్కినేని నాగేశ్వరరావు,జమున,జి.వరలక్ష్మి
గాత్రం:ఘంటసాల,పి.లీల
దర్శకత్వం: చెంగయ్య
సంస్థ: చందమామ ఫిల్మ్స్



పల్లవి:

ఒహొ రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఒహొ రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఈడుజోడుగా తోడునీడగా
ఈడుజోడుగా తోడునీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడుజోడుగా తోడునీడగా

చరణం1:

రేరాజు పలుక రేరాణి కులుక
విందైన వెన్నెల చిందు వేయగా
రేరాజు పలుక రేరాణి కులుక
విందైన వెన్నెల చిందు వేయగా
ఈ రేయి నీవై,నీహాయి నేనై ఆ ఆ ఆ ఆ
ఈ రేయి నీవై,నీహాయి నేనై
కడలి పొంగారు సరసాల లీలగా
ఈడుజోడుగా తోడునీడగా

చరణం2:

నీ వాలుకన్నుల పరువము నీనై
నన్నేలు చిన్నారి మురిపము నీవై
నీ వాలుకన్నుల పరువము నీనై
నన్నేలు చిన్నారి మురిపము నీవై
నీ బాస నేనై,నా ఆశ్ అ నీవై ఆ ఆ ఆ ఆ
నీ బాస నేనై,నా ఆశ్ అ నీవై
కలిసి కలకాలము ఈ లీలగా

ఈడుజోడుగా తోడునీడగా
మనముందాములే ఈ తీరుగా
ఈడుజోడుగా తోడునీడగా
ఒహొ రాణి ఓ ఓ ఓ ఓ రాజా
ఒహొ రాణి ఓ ఓ ఓ ఓ రాజా

||

07-May-2009

లవ్

తారాగణం: శివాజి , మాన్య
సంగీతం: శశిఫ్రీతం
నిర్మాత: కె.వి.నరసింహరెడ్డి
దర్శకత్వం: రవి చావ్లా
నిర్మాణ సంస్థ: లక్ష్మి ఫిలంస్
విడుదల: 1999



Love is the language of 2 hearts
కళ్ళతో మాట్లాడే భాష
Love is the religion of 2 minds
లవ్ లేని దునియా లేదురా

పల్లవి:

కల్లల్లోనే దాచుకున్నా నీ రూపం అని
కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని
కల్లల్లోనే దాచుకున్నా నీ రూపం అని
కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని

చరణం1:

గుండెలో పువ్వులా పరిమళించావులే
ఊహలో నన్నిలా పలకరించావులే
ఆశలే కొత్తగా మేలుకున్నాయిలే
నన్ను నీ నీడలా మార్చివేసాయిలే

కల్లల్లోనే దాచుకున్నా నీ రూపం అని
కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని

చరణం2:

కాలమే ఆగినా లోకమే మారినా
హేహేహే
నిన్ను నే వీడను ఎన్నడు మరువను
నాకు నీ పరిచయం భాదనే చూపెనే
నన్ను నీలో సగం ఎప్పుడో చేసెనే

కల్లల్లోనే దాచుకుంటా నీ రూపం అని
అన్ని నీవై చేరుకున్నా నేనే నీవని
కల్లల్లోనే దాచుకున్నా నీ రూపం అని
కలలోనైనా నమ్మలేదే నువ్వు వస్తావని
కల్లల్లోనే దాచుకుంటా నీ రూపం అని
అన్ని నీవై చేరుకున్నా నేనే నీవని

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-May-2009

గృహప్రవేశం

గాత్రం: సుశీల



పల్లవి:

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
నోచిన వారికి నోచిన వరము
చూసినవారికి చూసిన ఫలము
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం1:

స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
స్వామిని పూజించే చేతులే చేతులట
ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట
తన కథవింటే ఎవ్వరికైనా జన్మతరించునట
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం2:

ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదైవం ఈ దైవం
అన్నవరంలొ వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం3:

అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా
స్వామికి మదిలోనే కోవెల కడదామా
పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ

చరణం4:

మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా
కరములు జోడించి శ్రీ చందన మలరించి
మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా

శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ
శ్రీ సత్యనారాయణుని సేవకు రారమ్మా
మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-May-2009

క్షత్రియపుత్రుడు

గాత్రం: బాలు,జానకి
సాహిత్యం:వెన్నెలకంటి



పల్లవి:


సన్నజాజి పడక మంచ కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే
మనసులో ప్రేమే ఉంది మరువని మాటే ఉంది
మాయని ఊసే పొంగి పాటై రావే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే

చరణం1:

కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు ఎండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి
అండ దండ నీవేనని పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బొమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళ్ళయినది రావే
దిండే పంచే వెళ్ళయినది రావే


సన్నజాజి పడకా మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే
అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడక చల్ల గాలి పడక
మాట వినకుంది ఎందుకే


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-May-2009

శకుంతల

గాత్రం: ఘంటసాల,సుశీల



పల్లవి:

నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే
జీవనరాగం తెలిసెనులే
నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే

చరణం1:

అలలై పిలిచే నీ అందాలే
వలపు తేనియలు చిలికెను నాలో
అలలై పిలిచే నీ అందాలే
వలపు తేనియలు చిలికెను నాలో
నీలో సాగే అనురాగాలే
నీలో సాగే అనురాగాలే
వేణువులూదెను నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే
నీవే నేనై నిలచిన నాడే
జీవనరాగం తెలిసెనులే

చరణం2:

నీలో విరిసే దరహాసాలే
పాలవెల్లులై పొంగెను నాలో
నీలో విరిసే దరహాసాలే
పాలవెల్లులై పొంగెను నాలో
జగమును దాటి గగనము మీటి
జగమును దాటి గగనము మీటి
ఎగిసెను ఊహలు నాలో లోలో

నీవు నేను కలిసిన నాడే
నింగి నేల కలిసెనులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~