31-Jul-2009

తూర్పు వెళ్ళే రైలు

గాత్రం: బాలు , పి.సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

చరణం1:

ఆకతాయి బుల్లోడల్లే అల్లరెడితే
రాలుగాయి రాగాలన్ని రచ్చబెడితే
ఎవ్వరైన చూసారంటే అల్లరైపోతానయ్యో
ఎన్నెలంటి బతుకంతా చీకటైపోతాదయ్యో
దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
దీపమల్లే నేనుంటాను తీపి రేపు తెస్తుంటాను
కలువపువ్వు నీవై వెలుగు నేనై ఎలతేటి పాటై చెలరేగిపోనా

చరణం2:

ముత్తెమంటి ఒళ్ళు తడిసి ముద్దు పుడితే
గుండెలోన ఎండకాసి ఆరబెడితే
ఆశలారిపోకుండా ఊసులాడుకోవాలి
ఊసులెండిపోకుండా ఊట కోర్కెలుండాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
గువ్వలాటి జోడుండాలి యవ్వనాల గూడెయ్యాలి
నిన్ను నన్ను చూసి దిష్టి తీసి ఆ లోకాల దేవుళ్ళే దీవించిపోవాలి


సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ
బొమ్మలా ముద్దుగుమ్మలా
పువ్వులా పాలనవ్వులా
మెరుపుతీగమల్లే తళుకుమంటే
ఈ అద్దాల ఒళ్ళంతా ముద్దాడుకోనా
సందెపొద్దు అందాలున్న చిన్నదీ
ఏటి నీట తానాలాడుతు ఉన్నదీ

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

30-Jul-2009

మంగమ్మ శపధం

గాత్రం: ఘంటసాల,సుశీల
సాహిత్యం: సి.నారాయణరెడ్డి




పల్లవి:

కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నాచెంత నీకింత జాగేలనె
చెలి నాచెంత నీకింత జాగేలనె

కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
ఇక అందాల ఉయ్యాలలూగింతులే

చరణం1:

మధుర శృంగార మందారమాల
కదలి రావేల కలహంస లీల
మధుర శృంగార మందారమాల
కదలి రావేల కలహంస లీల
రంగు రంగుల బంగారు చిలక
రంగు రంగుల బంగారు చిలక
వలచి నీముందు వాలిందిలే

కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
చెలి నాచెంత నీకింత జాగేలనె
చెలి నాచెంత నీకింత జాగేలనె

చరణం2:

చరణమంజీరనాదాలలోన కరగిపోనిమ్ము గంధర్వబాల
చరణమంజీరనాదాలలోన కరగిపోనిమ్ము గంధర్వబాల
సడలిపోవని సంకెళ్ళు వేసి
సడలిపోవని సంకెళ్ళు వేసి సరసరాగాల తేలింతులే

కనులీవేళ చిలిపిగ నవ్వెను
మనసేవేవో వలపులు రువ్వెను
ఇక అందాల ఉయ్యాలలూగింతులే
ఇక అందాల ఉయ్యాలలూగింతులే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

చదువుకున్న అమ్మాయిలు

గాత్రం: పి.బి.శ్రీనివాస్, ఆశాలత కులకర్ణి



పల్లవి:

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం1:

వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం , తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి బెజ్జంలోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం2:

పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరిన ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను తకరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం3:

మనసే దోచిన సుందరి
మమతే మల్లి పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు, ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది


||

29-Jul-2009

శివరంజని

గాత్రం: సుశీల
సాహిత్యం: దాసం గోపాలకృష్ణ




పల్లవి:

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

చరణం1:

ముస్తాబు అయ్యావు తుమ్మెదా
కస్తూరి రాసావు తుమ్మెదా
మసక ఎన్నెల్లోన తుమ్మెదా
మల్లెపందిరి కాడ తుమ్మెదా
మాల కడుతున్నావు తుమ్మెదా
ఆ మాలెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా
నీ జోరెవరికోసమే తుమ్మెదా

చరణం2:

మెత్తన్ని పరుపూలు తుమ్మెదా
గుత్తంగ కుట్టావు తుమ్మెదా
వత్తైన పరుపుపై తుమ్మెదా
అత్తర్లు చల్లావు తుమ్మెదా
పక్క వేసి ఉంచావు తుమ్మెదా
ఆ పక్కెవరికోసమే తుమ్మెదా

జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా
ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీ ఒళ్ళు జాగరతే తుమ్మెదా
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికోసమే తుమ్మెదా

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

27-Jul-2009

శశిరేఖా పరిణయం

తారాగణం: తరుణ్,జెనీలియ
గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: కృష్ణవంశీ
విడుదల: 2009



Happy Birthday Chitra



పల్లవి:

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ
నన్నే నీలో కలుపుకొని కొలువుంచే మంత్రం నీవవనీ
ప్రతి పూట పువ్వై పుడతా నిన్నే చేరి మురిసేలా
ప్రతి అడుగు కొవెలనౌతా నువ్వే నెలవు తీరెలా
నూరేళ్ళు నన్ను నీ నివేదనవనీ
నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ

చరణం1:

వెన్ను తట్టి మేలుకొలిపిన వేకువ నువ్వే
కన్నె ఈడు నేను మరచిన వేళవు నువ్వే
వేలు పట్టి వెంట నడిపిన దారివి నువ్వే
తాళి కట్టి ఏలవలసిన దొరవూ నువ్వే
రమణి చెరను దాటించే రామచంద్రుడా
రాధ మధిని వెధించే శ్యామసుందరా
మనసిచ్చిన నెచ్చెలి ముచ్చట పచ్చగ పండించరా

నిన్నే నిన్నే అల్లుకొని కుసుమించే గంధం నేనవనీ

చరణం2:

ఆశ పెంచుకున్న మమతకు ఆధారమా
శ్వాస వీణలోని మధురిమ నీదే సుమా
గంగ పొంగునాపగలిగిన కైలశమా
కొంగుముళ్ళలోన ఒదిగిన వైకుంఠమా
ప్రాయమంత కరిగించి ధారపోయనా
ఆయువంత వెలిగించి హారతియ్యనా

నిన్నే నిన్నే నిన్నే ఓ ఓ ఓ
నిన్నే నిన్నే నిన్నే


~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

26-Jul-2009

తెనాలి రామకృష్ణ

గాత్రం:భానుమతి



పల్లవి:

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం1:

తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
తరుణలలో నా సరి జాణ
సరసుల నీకు సరి లేరు నెరజాణ
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
ఆటలపాటలలో వినోదాల వేడుకలో
వాటముగా నిన్ను లాలింతురా దొర
వాటముగా నిన్ను లాలింతురా దొర

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

చరణం2:

వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వన్నెల మేడ వెన్నెల నీడ
వాడని మల్లియల వాడలలో హాయిగా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
వింతలు చేయుదురా విలాసాల తేలుదురా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా
చూతుమురా స్వర్గవైభోగమే ఇలా

తీరని నా కోరికలె తీరెను ఈరోజు
కూరిమి నాచెలిమి కోరెను రారాజు
తీరని నా కోరికలె తీరెను ఈరోజు

||

24-Jul-2009

రాఘవేంద్ర

గాత్రం: హరీష్ రాఘవేంద్ర, సుజాత




పల్లవి:

నీ స్టైలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణాం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం ఇది అనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలకుతున్నది నా పేరే
నీ స్టైలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణాం
నువు నాకోసం ఇక సంతోషం

చరణం1:

నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా
పలకకున్నా సరే నీపై మోజు కలిగలేరా
అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా
ఎందుకే ఇంతలా పిచ్చి ప్రేమ చాలిక
నీ మగసిరి నడకలలోన
తెలియని మత్తేదో ఉందిరా
అది నన్ను తడిపి ముద్దచేసే
పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో
ఊహనుండి బయటకు రావమ్మో

నీ స్టైలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణాం
నువు నాకోసం ఇక సంతోషం

చరణం2:

నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా
సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా
ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు
నమ్మక తప్పదు నిన్నే చూసా ఇప్పుడు
నీ కంటి బొమ్మల వెరుపు
నీచులపై కొరడా చరుపు
అది నీపై వలపే కలిపెరా
పూవంటి హృదయంలోన తేనంటి మనసే నీది
నీ ప్రేమకు ఇదిగో జోహారే

నీ స్టైలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణాం
నువు నాకోసం ఇక సంతోషం
అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ
నువు నా బంధం ఇది అనందం
తెలిసి తెలియని నా మనసే
తరుముతున్నది నీకేసే
తడిసి తడియని నీ కురులే
పలకుతున్నది నా పేరే
నీ స్టైలే నాకిష్టం
నీ స్మైలే నా ప్రాణాం
నువు నాకోసం ఇక సంతోషం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Jul-2009

సూర్యవంశం

తారాగణం:వెంకటేష్,రాధిక,మీనా,సంఘవి
గాత్రం:బాలు,సుజాత
సాహిత్యం:సిరివెన్నెల
సంగీతం:ఎస్.ఏ.రాజ్‌కుమార్
నిర్మాత:ఆర్.బి.చౌదరి
దర్శకత్వం:భీమినేని శ్రీనివాసరావు
సంస్థ:సూపర్‌గుడ్ ఫిలింస్
విడుదల:1998



పల్లవి:

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

చరణం1:

నువ్వే తోడుగ ఉండే జీవితం నిటూర్పు జాడేలేని నిత్యనూతనం
నువ్వే నీడగ పంచే స్నేహితం హేమంతం రానే రాని చైత్ర నందనం
ఎండల్లో చిందే చెమట అమృతం పోయగ గుండెల్లో నమ్మకాన్ని పెంచుదామ
నిందల్లో నిష్టురాలే నిప్పులే కాంతిగా రేపట్లో అదృష్టాన్ని పోల్చుకోమా
నడిరేయి చేరనీయక సుర్యదీపముంది మన దారి చూపుతోంది
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి

చరణం2:

అన్ని రోజులు సన్నజాజులై అందంగ అల్లుకుందాం చిన్ని మందిరం
నిన్న ఊహలే నేటి ఊయలై గాడంగ పెంచుకుందాం స్నేహ బంధనం
రంగేలి సంతోషాల చందనం చల్లుతూ ఈ గాలి అందుకుంది కొత్త జీవితం
ఉంగాల సంగీతాల రాగమే పాడుతు సాగాలి సూర్యవంశ సుప్రభాతం
అంచుదాటు అమృతం పంచుతోంది నిత్యం మన ప్రేమ పారిజతం

చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించె మంచి మజిలి
ప్రతి పూట పూల బాటగ సుమస్వాగతాలు పాడగ
స్వప్నసీమ చూద్దాం జత జైత్రయాత్ర చేద్దాం
చుక్కలన్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి
లాలలాల్ల లల లాలలాల్ల..

||

22-Jul-2009

లక్షాధికారి

తారాగణం: నందమూరి తారక రామారావు,కృష్ణకుమారి
గాత్రం:ఘంటసాల,సుశీల
సాహిత్యం:సి.నారాయణరెడ్డి
సంగీతం:టి.చలపతిరావు
దర్శకత్వం: వి.మధుసూదన రావు
సంస్థ :రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల:1963



మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది
నా మనసులో ఏముంది
మబ్బులో చన్నీరు నీ మనసులో పన్నీరు
నీ మనసులో పన్నీరు
అవునా హుహుహు

తోటలో ఏముంది నా మాటలో ఏముంది
నా మాటలో ఏముంది
తోటలో మల్లియలు నీ మాటలో తేనియలు
నీ మాటలో తేనియలు
హుహుహు హుహుహు

చేనులో ఏముంది నా మేనులో ఏముంది
నా మేనులో ఏముంది
చేనులో బంగారం నీ మేనులో సింగారం
నీ మేనులో సింగారం

ఏటిలో ఏముంది నా పాటలో ఏముంది
నా పాటలో ఏముంది
ఏటిలో గలగలలు నీ పాటలో సరిగమలు
నీ పాటలో సరిగమలు

నేనులో ఏముంది నీవులో ఏముంది
నీవులో ఏముంది
నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది
నేనులో నీవుంది నీవులో నేనుంది
నీవులో నేనుంది నేనులో నీవుంది
హహహాహహా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-Jul-2009

అనంతపురం 1980

తారాగణం: జై,శశికుమార్,స్వాతి
గాత్రం: బెల్లి రాజ్,దీప
సాహిత్యం: వెన్నెలకంటి
సంగీతం : జేమ్స్ వసంతన్
నిర్మాత : ఎం.రంగనాథ్
దర్శకత్వం: శశికుమార్
సంస్థ: సింహపురి టాకీస్



పల్లవి:

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది

చరణం1:

పగలే రేయయిన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈవేళ ఇరువురి దూరాలు తరగనీ
ఒడిలో వాలాలనున్నదీ వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మొమాటం ఇది

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

చరణం2:

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో
అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది
మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటుమాటు గానం కనులే కలిపే ఈ వేళ
కంటి చూపుతో నీ కంటి చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఎదో మాయ చేసి అంతలోనే మౌనమేలనే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

18-Jul-2009

ప్రేమించు పెళ్ళాడు

గాత్రం : బాలు,జానకి




పల్లవి:

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

చరణం1:

నిజము నా స్వప్నం హాహా కలనో హొహొ లేనో హొహొ హొ
నీవు నా సత్యం హొహొ అవునో హొహొ కానో హొహొ హొ
ఊహ నీవే హహహాహా ఉసురుకారాదా హహా
మోహమల్లే హహహాహా ముసురుకోరదా హహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికా
ఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నే కరిగిపోనా
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

చరణం2:

తాకితే తాపం హొహొ కమలం హొహొ భ్రమరం హొహొ హొ
తాగితే మైకం హొహొ అధరం హొహొ మధురం హొహొ హొ
పాట వెలదీ హాహహాహా ఆడుతూ రావే
తేట గీతీ హాహహాహా తేలిపోనీవే
పున్నాగ కొవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుకా
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలిసిపోతే కల వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Jul-2009

పెళ్ళిసందడి

గాత్రం: బాలు,చిత్ర




పల్లవి:

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా
మెరుపుల చెల్లి మా పిల్లకి
మేఘాలన్ని పూపల్లకి
ఏడేడు వర్ణాల ఆషాడవేళ
కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం1:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
వేచి వేచి వేడెక్కే ఆ వేచి వున్న పండక్కే
నే పరుగులు తీస్తున్నా
కాచుకున్న కానుక్కే నే కాచుకున్న వేడుక్కే
నేనెదురై నిలుచున్నా
కాదే అవునై కవ్విస్తే
తకజుం తకజుం జుం
కన్నె పిలుపై కబురొస్తే
తకజుం తకజుం జుం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొమ్మచాటు కోకిలమ్మ గట్టిమేళాలెన్నో పెట్టి
కాళ్ళు కడిగి కన్నెనిచ్చి పేరంటాలే ఆడేవేళ

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

చరణం2:

తకజుం తకజుం జుం
తకజుం తకజుం జుం
జాబిలమ్మ కన్నుల్లో ఆ సందె సూరీడున్నట్టే
నీ తహతహ చూస్తున్నా
ఒంటినిండా ఊపొచ్చి ఒంపులెన్నో ఊరించే
నీ తకధిమి వింటున్నా
కాయే పండై కలిసొస్తే
తకజుం తకజుం జుం
అది పండే నోమై పిలకొస్తే
తకజుం తకజుం జుం
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
తోటలోని పూలన్నొచ్చి తోరణాలై దీవిస్తుంటే
గోరువంక పెళ్ళి మంత్రాలెన్నో చదివే సుముహూర్తంలో

కిలకిల కిలకిల కిల పడుచు కోకిల
పలికె ప్రియగీతిక పెల్లికిలా
కలకల కలకల కల వలపు దాఖల
తెలిపె శుభలేఖల సరిగమలా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

16-Jul-2009

సత్యం

గాత్రం: రవివర్మ,చక్రి,పల్లవి
సాహిత్యం: భాస్కరభట్ల



పల్లవి:

పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ
అందని వరమే ప్రేమ
మనసుకు తొలి కలవరమా
ప్రేమే మధురం ప్రేమే పదిలం
ఎమీ కాదు క్షణికం
అన్ని తానే ప్రణయం
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ

చరణం1:

వలపును చినుకుగ భావించా అది నా తప్పు కదా
వరదని తెలిసిన ఈ తరుణం యాతన తప్పదుగా
ఎన్నేళ్ళో ఎదురీత ఎన్నాళ్ళీ ఎదకోత
ప్రేమే ఆట కాదు గెలుపు ఓటమి లేదు
లాభం నష్టం చూడకు ప్రేమవదు
తప్పుంటే అది ప్రేమది కాదే
తప్పంతా ప్రేమించిన నాదే
ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ

పిలిచిన పలకదు ప్రేమ
వలచిన దొరకదు ప్రేమ

చరణం2:

మనసును తరిమిన చీకటులే చెలిమిగ మారేనా
ఇదివరకెరుగని ఈ బాధే కొలిమై పొయేనా
ఆపాలి ఏదోలా చెబుతావా ప్రియురాలా
నీడై నీతో పాటు సాగాలనుకొన్నానే
నేడే తెలిసెను నాకు ఓ చెలియ
నింగీ నేలా కలవవని నీడే మనిషిని తాకదని
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆపిన ఆగదు ప్రేమ
దాచిన దాగదు ప్రేమ
మనసును కలుపును ప్రేమ
మహిమలు చూపును ప్రేమ
ప్రేమే గగనం ప్రేమే సహనం
ప్రేమే కాదా ఉదయం
ప్రేమించాలి హృదయం
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా
ఐ లవ్ యు లవ్ యు రా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Jul-2009

మురారి

గాత్రం: ఉదిత్‌నారాయణ
సాహిత్యం: సుద్దాల అశోక్‌తేజ




పల్లవి:

బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నాదే
బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో

చరణం1:

నీలో చింతచిగురు పులుపున్నదే
బుల్‌బుల్ పిట్ట ఒలి ఒలి పట్ట
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
తళుకుల బుట్ట మెరుపుల తట్ట
నీలో చింతచిగురు పులుపున్నదే
కవ్వంలాగ చిలికే కులుకున్నదే
కొంటె మాట వెనుక చనువున్నదే
తెలుసుకుంటే మనసు పిలుపున్నదే
కళ్ళుమూసి చీకటి ఉందంటే వెన్నెల నవ్వుకుంటుందే
ముసుగే లేకుంటే మనసే జగాన వెలుగై నిలిచి ఉంటుందే

బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో

చరణం2:

నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
సిరిసిరి మువ్వ గడసరి గువ్వ
మనకు మనకు చెలిమే ఒక వంతెన
సొగసుల గువ్వ ముసిముసి నవ్వ
నిన్న నేడు రేపు ఒక నిచ్చెన
మనకు మనకు చెలిమే ఒక వంతెన
ఎవరికివారై ఉంటే ఏముందమ్మ
మురళి తానే వెదురై పోదా జన్మ
చేయి చేయి కలిసే కోసమే వివరం ముచ్చటమ్మాయి
జారి పోయాక తిరిగి రాదమ్మో కాలం మాయమరాఠి

బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో
సందెపొద్దుల్లో ముద్దబంతల్లే ఎంత ముద్దుగున్నావే
వెండిమువ్వల్లే ఘల్లుమంటుంటే గుండె జిల్లుమన్నాదే
బంగారుకళ్ళ బూచమ్మో
చెంగావి చెంప లచ్చమ్మో
కోపంలో ఎంతో ముద్దమ్మో
ఓ బుంగమూతి సుబ్బమ్మో

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

13-Jul-2009

పరుగు

తారాగణం: అల్లు అర్జున్,షీలా,ప్రకాష్‌రాజ్
గాత్రం: సాకేత్
సాహిత్యం: అనంత్ శ్రీరాం
సంగీతం: మణిశర్మ
దర్శకత్వం: భాస్కర్
నిర్మాత: దిల్ రాజు
సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2008




పల్లవి:

నమ్మవేమోగానీ అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసింది
నమ్మవేమోగానీ అందాల యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసింది
అందుకే అమాంతం నా మది
అక్కడే నిశ్శబ్ధం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది
ఇక్కడే ఇలాగే నాతో ఉంది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

చరణం1:

నవ్వులు వెండిబాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపునాణాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపము ఈడు భారాలై ముందర నించుంటే
ఆ సోయగాన్నే నే చూడగానే
ఓ రాయిలాగా అయ్యాను నేనే
అడిగ పాదమును అడుగువేయమని కదలలేదు తెలుసా

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది
నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

చరణం2:

వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైనా అధరాల రంగును ఇమ్మంది
వేసవి పాపం చలివేసి ఆమెను వేడింది
శ్వాసలలోన తలదాచి జాలిగా కూర్చుంది
ఆ అందమంతా నా సొంతమైతే
ఆనందమైన వందేళ్ళు నావే
కలల తాకిడిని మనసు తాళదిక వెతికి చూడు చెలినే

నిజంగా కళ్ళతో వింతగా మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా ముంచివేసింది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

12-Jul-2009

రాఘవేంద్ర

గాత్రం: శంకర్ మహదేవన్,చిత్ర




పల్లవి:

కలకత్తా పానేసినా చూసుకో
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో
నడుం పట్టుకుని ముట్టుకునే ఆటలో
పొగిడి ఎక్కించకు ఇలా ములగచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలి తూఫానులే అరె నీలో చూసానులే
కలకత్తా పానేసినా చూసుకో
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో
నడుం పట్టుకుని ముట్టుకునే ఆటలో

చరణం1:

చాటు మాటు లేని మొగ్గలు
చీర రైక లేని బుగ్గలు
అడ్డు ఉంటే అందం అందునా
ముద్దు మురిపెం నీకు చెందునా
ఏ ముద్దులుండేవి చెంపలోనా
ముచ్చటైన పెదవుల్లోన
ఎలా తెలిపేది మందిలోన
ముద్దులు ఊరేవి గుండెల్లోన
ముద్దు తినిపిస్తావా లేక తాగిస్తవా
ఇచ్చి మురిపించనా మురిసి అందించనా
పోటి బాగుందమ్మో ఇక ఆటే మిగిలిందమ్మో
ఆడుకోవాలయ్య నేనోడి గెలవాలయ్య


కలకత్తా పానేసినా చూసుకో
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
దిల్ పట్టా తప్పింది నీ పాటలో
నడుం పట్టుకుని ముట్టుకునే ఆటలో

చరణం2:

ఒళ్ళు మొత్తం ఎదో వేడిరా
ఒళ్ళోకొస్తా పట్టి చూడరా
చల్లలోన కలిపి చక్కెర
కల్లోకొచ్చి ఇస్తా వెళ్ళిరా
హే కొంగు సాచాను పూవ్వులాగ
రంగులేసి నవ్వించరా
హొళి పండక్కి వచ్చి చూడే
చొళినింపి పంపిస్తానే
వరస కలిపేందుకు వాయిదాలెందుకు
ఉరుము కావాలమ్మో వాన కురిసేందుకు
నీలో మెరుపుందయ్యో అది నాలో మెరవాలయ్య
దసరా కావాలంటే హాయ్ దశమి రావాలమ్మో

దిల్ పట్టా తప్పింది నీ పాటలో
నడుం పట్టుకుని ముట్టుకునే ఆటలో
కలకత్తా పానేసినా చూసుకో
నా పెదవులు నీ పెదవులతో రాసుకో
పొగిడి ఎక్కించకు ఇలా ములగచెట్టు
ఒకే పిడికిలి పోటు పది పిడుగుల పెట్టు
గాలి తూఫానులే అరె నీలో చూసానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే
గాలి తూఫానులే అరె నీలో చూసానులే
పూల సన్నాయిలే మరి నీలో ఉన్నాయిలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Jul-2009

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్

గాత్రం: కీరవాణి,సుమంగళి
సాహిత్యం: చంద్రబోస్



పల్లవి:

దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
దువ్విన తలనే దువ్వటం
అద్దిన పౌడర్ అద్దడం
అద్దం వదలక పోవడం
అందానికి మెరుగులు దిద్దడం
నడిచి నడిచి ఆగడం
ఆగి ఆగి నవ్వడం
ఉండి ఉండి అరవడం
తెగ అరచి చుట్టూ చూడడం
ఇన్ని మార్పులకు కారణం ఎమై ఉంటుందోయి
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఈ ఈ ఈ
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love

చరణం1:

ముఖమున మొటిమే రావడం
మనసుకు చెమటే పట్టడం
మతి మరుపెంతో కలగడం
మతి స్థిమితం పూర్తిగా తప్పడం
త్వరగా స్నానం చెయ్యడం
త్వరత్వరగా భోం చేస్తుండడం
త్వరగా కలలో కెళ్ళడం
ఆలస్యంగా నిదరోవడం
ఇన్నర్థాలకు ఒకే పదం ఏమై ఉంటుందోయి

ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love ఈ ఈ ఈ
ఇది కాదా love ఇది కాదా love
ఇది కాదా love

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

10-Jul-2009

ఇంటిగుట్టు

తారాగణం: రామారావు,సావిత్రి,రాజసులోచన,రేలంగి
గాత్రం: ఏ.ఎం.రాజా
సాహిత్యం: మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం: ఎం.ఎస్.ప్రకాష్
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంస్థ: సంగీత ప్రొడక్షన్స్
విడుదల: 1958



పల్లవి:

ఆడువారి మాటలు రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు
ఆడువారి మాటలు రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు

చరణం1:

ఏమన్నా కాదంటారు తామన్నదె రైటంటారు
వాధించి సాధించి చేసేరు సాములు
ఏమన్నా కాదంటారు తామన్నదె రైటంటారు
వాధించి సాధించి చేసేరు సాములు వయ్యారి భామలు
కోసేవన్ని కోతలు
వేసేవన్ని ఫోజులు
చేసేవన్ని డాబులు
ఈ ఆడు లేడీలు బాబులే

ఆడువారి మాటలు రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు

చరణం2:

వీరీది వేషమైతే వారీది మోసమైతే
వేషాలు మోసాలు దాగేవి కావులే
వీరీది వేషమైతే వారీది మోసమైతే
వేషాలు మోసాలు దాగేవి కావులే దాగేవి కావులే
జోగు జోగు చూపులు
చూపుల్లోనే బ్రేకులు
జోగుల్లోనే షాకులు
ఈ ఆడు లేడీలు బాబులే

ఆడువారి మాటలు రాక్ఎన్‌రోల్ పాటలు
ఆడువారి కోపాలు మాపైన పన్నీటి జల్లులు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

||

08-Jul-2009

ఆకాశమంత

తారగణం: త్రిష,గణేష్,ప్రకాష్‌రాజ్,ఐశ్వర్య,జగపతిబాబు
గాత్రం: మధుబాలకృష్ణన్
సాహిత్యం: అనంత్‌శ్రీరాం
సంగీతం: విద్యాసాగర్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: రాధామోహన్
సంస్థ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2009





పల్లవి:

ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా

చరణం1:

అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే
మధురమవు భావాలేవో ఊగే లోలోన
పలుకులే పైకొస్తే చిలిపిగా పిలుపిస్తే
పులకలే పదులై వేలై పొంగే నాలోన
లాలిపాటే నేనై లాలపోసేవాడ్నై
లాలనే నింపనా లేత హృదయాన

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా

చరణం2:

ఎగురుతూ నీ పాదం ఎదుగుతూ నీ రూపం
ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం
అడుగుతూ కాసేపు అలుగుతూ కాసేపు
అణుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం
క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా
పాపవే పాపవే నాన్న నయనాన

మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా
ఆశగ చూసిన నాన్నకు పుట్టిన అమ్మరా అమ్మరా
మేఘాల పల్లకి తెప్పిస్తా
లోకాన్ని కొత్తగ చూపిస్తా
వెన్నెలే తనపై కురిపిస్తా
చల్లని హాయినందిస్తా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-Jul-2009

లిటిల్ సోల్జర్స్

సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని
మరి ఎవ్రిడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూల్ కేసి సిక్సు డేసు తరుముతారు
ఏ ఏ అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే
అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని

చరణం1:

నీ హైటే నాకు ఉంటే
అమ్మో ఎంత డేంజర్
నాక్కూడా మీసముంటే
ఎంచేస్తావు మేజర్
క్లాస్ మిస్ చైరులోన నేను కుర్చుంటా
కామిక్ క్లాస్ బుక్స్ చేసి చదివిస్తా
స్చూల్‌కి ప్రిన్సిపాల్ సార్‌నే అవుతా
ఆల్వేస్ హాలిడేస్ ఆడుకోండి అంటా
ఎగ్జాంస్ వస్తే అప్పుడు ఎలా మరి
మార్కులు కూడా మీరే వేస్తే సరి

అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే

చరణం2:

చాలమ్మ ఆటలింక
కొంచం ఆగు మమ్మి
రానంటే వెళ్ళిపోతా
నో నో వద్దు డాడి
ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా
అకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తురాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి
ఎంచక్కా నిద్దరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో

అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదని
మరి ఎవ్రిడేని సండే అని అనుకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూల్ కేసి సిక్సు డేసు తరుముతారు
ఏ ఏ అయ్యయో ఎంత తప్పో ఎవరూ అడగరే
హ్యపీగా ఆడుకుంటాం అంటే వదలరే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

06-Jul-2009

అర్జున్

గాత్రం: బాలు,చిత్ర




పల్లవి:

డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్ళి ఛాంగు భళారే భళారే
జం జమారే జం జమారే శివుడి పెళ్ళి ఛాంగు భళారే భళారే
అళగరు పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రీ
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
తందాననా తాళాలతో గండాలు మాకు తప్పించరా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత
డుం డుమారే డుం డుమారే పిల్ల పెళ్ళి ఛాంగు భళారే భళారే
జం జమారే జం జమారే శివుడి పెళ్ళి ఛాంగు భళారే భళారే

చరణం1:

మధురాపురికే రాచిలక రాలేనులే
పెళ్ళి పందిళ్ళలో ముగ్గేసిన పన్నీటి ముత్యాలెన్నో
కను చేపలకు నిదరంటు రారాదని
కరగెత్తానులే ఆడానులే గంగమ్మ నాట్యాలెన్నో
గుడిలో కోలాటం గుండెలో ఆరాటం
ఎదలో మొదలాయే పోరాటమే

అళగరు పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రీ

చరణం2:

అతిసుందరుడే సొదరుడే తోడు ఉండగా
తల్లి నీ కాపురం శ్రీ గోపురం తాకాలి నీలాకాశం
నా పేగు ముడి ప్రేమ గుడి నా తల్లిలే
నువ్వు నా అండగా నాకుండగా కంపించిపోదా కైలాసం
ఇపుడే శుభలగ్నం ఇది నా సంకల్పం
విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా

అళగరు పెరుమాళు అందాల చెల్లెలా మిలమిలలాడే మీనాక్షీ
నీ కంటి పాపనే కాచుకో చల్లగా తెలతెలవారనీ ఈ రాత్రీ
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
చిందెయ్యరా ఓ సుందరా శ్రీగౌరికే బొట్టు పెట్టేయరా
తందాననా తాళాలతో గండాలు మాకు తప్పించరా
నీ పెళ్ళికి పేరంటమే ఊరేగవే ఊరంతా
కళ్యాణమే వైభోగమే కన్నార్పకే కాసంత

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Jul-2009

తూర్పు వెళ్ళే రైలు

గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

ఏమిటిది ఏమిటిది ఏదో తెలియనిది
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ఏమిటిది
ఏమిటిది ఏమిటిది ఏదో తెలియనిది
ఎప్పుడూ కలగనిది ఏమిటిది ఏమిటిది

చరణం1:

హత్తుకున్న మెత్తదనం కొత్త కొత్తగా ఉంది
మనసంతా మత్తు కమ్మి మంతరిచ్చినట్లుంది
నరనరాన మెరుపు తీగె నాట్యం చేసేస్తోంది
నాలో ఒక పూల తేనె నదిలా పొంగుతోంది పొంగుతోంది
ఏమిటిది ఏమిటిది ఏమిటిది

చరణం2:

ఈడు జోడు కుదిరింది తోడు నీడ దొరికింది
అందానికి ఈనాడే అర్ధం తెలిసొచ్చింది
పెదవి వెనుక చిరునవ్వు దోబూచులాడింది
చిలిపి చిలిపి తలపు తలచి సిగ్గు ముంచుకొస్తోంది

ఏమిటిది ఏమిటిది ఏమిటిది
ఏదో తెలియనిది ఎప్పుడూ కలగనిది కలకానిది
ఏమిటిదీ

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

04-Jul-2009

వెంకటేశ్వర సుప్రభాతం,స్తోత్రం



కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌

మాతః సమస్త జగతాం మధుకైటభారే:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్‌

తవ సుప్రభాత మరవింద లోచనే
భవతు ప్రసన్న ముఖ చంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృష శైల నాథ దయితే దయానిధే

అత్ర్యాది సప్త ఋషయ స్సముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాద యుగ మర్చయితుం ప్రపన్నా:
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

పంచాన నాబ్జభవ షణ్ముఖ వాసవాద్యా:
త్రైవిక్రమాది చరితం విబుధా స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ఫూగద్రుమాది సుమనోహర పాలికానాం
ఆవాతి మంద మనిల స్సహ దివ్య గంధై:
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

ఉన్మీల్య నేత్రయుగ ముత్తమ పంజరస్థా:
పాత్రా వశిష్ట కదళీ ఫల పాయసాని
భుక్త్వా సలీల మథ కేళి శుకా: పఠంతి
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయత్యనంత చరితం తవ నారదోపి
భాషా సమగ్రమ సకృత్ కర సార రమ్యం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

భృంగావళీచ మకరంద రసాను విద్ధ ఝంకార గీత నినదై స్సహ సేవనాయా నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్య:
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

యోషా గణేన వర దధ్ని విమథ్య మానే
ఘోషాలయేషు దధి మంథన తీవ్రఘోషా:
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

పద్మేశ మిత్ర శతపత్ర గతాళి వర్గా:
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యా
భేరీ నినాద మివ బిభ్రతి తీవ్ర నాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్థినో హర విరించి సనంద నాద్యా:
ద్వారే వసంతి వర వేత్ర హతోత్తమాంగాః
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

సేవాపరా శివ సురేశ కృశాను ధర్మ రక్షోంబు నాథ పవమాన ధనాది నాథాః బద్ధాంజలి ప్రవిలస న్నిజ శీర్ష దేశాః
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్య శూరి స్వర్భాను కేతు దివిషత్ పరిషత్ ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసా:
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

త్వత్పాద ధూళి భరిత స్ఫురితోత్తమాంగాః
స్వర్గాప వర్గ నిరపేక్ష నిజాంతరంగాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః
మర్త్యా మ్నుష్య భువనే మతి మాశ్రయంతే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

శ్రీ భూమి నాయక దయాది గుణామృతాబ్ధే
దేవాది దేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మల లోల దృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

మీనాకృతే కమఠ కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కి రూప
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

ఏలా లవంగ ఘన సార సుగంధి తీర్థం
దివ్యం వియత్ సరితి హేమ ఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టా:
తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతం

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః
శ్రీ వైష్ణవ స్సతత మర్థిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతం

బ్రహ్మాదయ స్సురవర స్సమహర్షయస్తే
సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యా:
ధామాంతికే తవహి మంగళ వస్తు హస్తా:
శ్రీ వేంకటాచల పతే తవ సుప్రభాతం

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధోః
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య
శ్రీ వేంకటాచల పతే! తవ సుప్రభాతం

ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం
యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా:
తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే

ఇత్థం వృషాచల పతే రిహ సుప్రభాతం
యే మానవాః ప్రతి దినం పఠితుం ప్రవృత్తా:
తేషాం ప్రభాత సమయే స్మృతి రంగ భాజాం
ప్రజ్ఞాం పరార్థ సులభాం పరమాం ప్రసూతే

-------------------------

కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే

కమలాకుచ చూచుక కుంకుమతో
నియ తారుణి తాతుల నీలతనో
కమలాయత లోచన లోకపతే
విజయీ భవ వేంకటశైల పతే

స చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ
ప్రము ఖాఖిలదైవత మౌళిమణే
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృషశైల పతే

అతి వేలతయా తవ దుర్విషహై
రనువేలకృతై రపరాధ శతైః
భరితం త్వరితం వృషశైవ పతే
పరయా కృపయా పరిపాహి హరే

అధి వేంకటశైల ముదారమతే
ర్జన తాభిమ తాధిక దాన రతాత్‌
పర దేవతయా కథితా న్నిగమైః
కమలా దయితా న్న పరం కలయే

కలవేణు రవా వశ గోపవధూ
శతకోటి వృతా త్స్మరకోటి సమాత్‌
ప్రతిపల్ల వికాభిమతా త్సుఖదాత్‌
వసుదేవసుతాన్న పరం కలయే

అభిరామ గుణాకర దాశరథే
జగదేక ధనుర్ధర ధీరమతే
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయాజలధే

అవనీ తనయా కమనీయకరం
రజనీకర చారు ముఖాంబురుహమ్‌
రజనీచర రాజ తమోమిహిరం
మహనీయ మహం రఘురామ మయే

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుఖాయ మమోఘ శరమ్‌
అసహాయ రఘూధ్వ మహన్య మహం
న కథంచన కంచన జాతు భజే

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ

అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వేంకటేశ

అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే

అజ్ఞానినా మయా దోషా
నశేషా న్విహితాన్‌ హరే
క్షమస్వ త్వం క్షమస్వ త్వం
శేషశైల శిఖామణే

ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీ
తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్‌ క్షాంతి సంవర్థనీమ్‌
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్‌

ఈశానం జగతోస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీ
తద్వక్షస్థ్సల నిత్యవాసర సికాం తత్‌ క్షాంతి సంవర్థనీమ్‌
పద్మాలంకృత పాణిపల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్‌

శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌
స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

శ్రీమన్‌ కృపాజలనిధే కృతసర్వలోక
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్‌
స్వామిన్‌ సుశీల సులభాశ్రిత పారిజాత
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

ఆనూపు రార్చిత సుజాత సుగంధి పుష్ప
సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ
సౌమ్యౌ సదానుభవనే పి నవానుభావ్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

సద్యో వికాసి సముదిత్త్వర సాంద్రరాగ
సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తామ్‌
సమ్యక్షు సాహస పదేషు విలేలయంతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర
వజ్రాంకుశాంబురహ కల్పక శంఖ చక్రైః
భవ్యై రలంకృత తలౌ పరతత్త్వ చిహ్నైః
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ
బాహ్మై ర్మహోభి రభిభూత మహేంద్రనీలౌ
ఉద్య న్నఖాంశుభి రుదస్త శశాంకభాసౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

స ప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం
సంవాహనేపి సపది క్లమ మాదధానౌ
కాంతావవాఙ్మనసగోచర సౌకుమార్యౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీలాది దివ్య మహిషీ కరపల్లవానామ్‌
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

నిత్యా నమద్విధి శివాది కిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహః ప్రరోహైః
నీరాజనా విధి ముదార ముపాదధానౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ
యౌ మధ్వఉత్స ఇతి భోగ్యతయా ప్యుపాత్తౌ
భూయ స్తథేతి తవ పాణితలౌ ప్రతిష్ఠౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి
భూయోపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

మున్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రి శిఖరే శిరిసి శ్రుతీనామ్‌
చిత్తే ప్యనన్య మనసాం సమమాహితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

ఆవ్లూన హృష్య దవనీతల కీర్ణ పుష్పౌ
శ్రీ వేంకటాద్రి శిఖరా భరణాయమానౌ
ఆనంది తాఖిల మనోనయనౌ తవైతౌ
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

ప్రాయః ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుః స్తనావివ శిశో రమృతాయమాణౌ
ప్రాప్తౌ పరస్పర తులా మతులాంతరౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

సత్త్వోత్తరై స్సతత సేవ్యపదాంబుజేన
సంసార తారక దయార్ద్ర దృగంచలేన
సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్‌

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపే యతయా స్ఫురంత్యా
నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ నజాతు మహ్యమ్‌

--------------------------

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ‍ మంగళమ్

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్‌

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్‌

అకాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్‌

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌

శ్రీమత్ సుందరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌

మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్‌


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Jul-2009

సుస్వాగతం

గాత్రం: బాలు



పల్లవి:

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం
ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం1:

ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా
గుండె బావిలో వున్న ఆశ తడి ఆవిరి అవుతున్నా
ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమా
ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీ ఇవ్వమ్మా
నీ జాడ తెలియని ప్రాణం చేస్తోంది గగన ప్రయాణం
ఎదను వుంది నడిరేయన్నది ఈ సంధ్యా సమయం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం

చరణం2:

సుర్యబింబమే అస్తమించనిదె మేలుకోని కల కోసం
కళ్ళు మూసుకుని కలవరించెనే కంటిపాప పాపం
ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా
రేయి చాటు స్వప్నం కోసం ఆలాపన ఆగేనా
పొందేది ఏదెమైనా పోయింది తిరిగొచ్చేనా
కంటి పాప కల అడిగిందని నిదురించెను నయనం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

ఆలయాన హారతిలో ఆఖరి చితిమంటలలో
రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్ని గుణం
ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్ని కణం
దీపాన్ని చూపెడుతుందొ తాపాన బలిపెడుతుందో
అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం
ఏ క్షణాన ఎలాగ మారునొ ప్రేమించే హృదయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

02-Jul-2009

ఖైదీ కన్నయ్య

తారాగణం: కాంతారావు ,రాజసులోచన ,కృష్ణకుమారి
గాత్రం: సుశీల
సంగీతం: ఎస్.రాజేశ్వర రావు
దర్శకత్వం: బి.విఠలాచార్య
సంస్థ: రాజలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల: 1962




పల్లవి:

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు
తెలియని చీకటి తొలగించి
వెలుగిచ్చేది చదువే సుమా మానవద్దు

చరణం1:

దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
దొంగల చేతికి దొరకనిది
దానము చేసిన తరగనిది
పదుగిరిలోన పరువును పెంచి
పేరు తెచ్చే పెన్నిధి

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

చరణం2:

అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
అల్లరి చేయుట చెల్లనిది
ఎల్లకు వాడుక కూడనిది
ఏడువరాదు ఏమనరాదు
ధీరునివలెనే నిలవాలి

తియ తీయని తేనెల మాటలతో
తీస్తారు సుమా గోతులు నమ్మవద్దు

చరణం3:

బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
బ్రతుకును బాటను కడదాకా
నడచియె తోవలె ఒంటరిగా
ఉరుములు రానీ పిడుగులు పడనీ
నీ అడుగులువలె తడబడునా


| |

01-Jul-2009

చూపులు కలిసిన శుభవేళ

గాత్రం: బాలు,జానకి



పల్లవి:

సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
అక్షరలక్ష ముద్దుల భిక్ష
కందిన మొగ్గ కమ్మని బుగ్గ
చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ

చరణం1:

జాజిమల్లి తీగనై జూకామల్లి పువ్వునై
నీ చెంత చేరేనులే
ఋతుపవనాలలో రస కవనాలతో
తీర్చాలి నా మోజులే
రాజీలేని అల్లరి రోజాపూల పల్లవి
నీ పాట పాడాయిలే
కథ రమనీయమై చిరస్మరణీయమై
సాగాలి సంగీతమై
అనురాగ శ్రీగంధమై

చిరునవ్వే శుభలేఖ చదివావా శశిరేఖ
అక్షరలక్ష ముద్దుల భిక్ష
కందిన మొగ్గ కమ్మని బుగ్గ
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక

చరణం2:

రాగాలన్ని నవ్వులై రావాలంట మువ్వవై
నా ప్రేమ మందారమై
తగు అధికారము తమ సహకారము
కావాలి చేయూతగా
బుగ్గబుగ్గ ఏకమై ముద్దే మనకు లోకమై
నూరేళ్ళు సాగాలిలే
ఇది మధుమాసమై మనకనుకూలమై
జరగాలి సుముహూర్తమే
కళ్యాణ వైభోగమే

సిరిమల్లి శుభలేఖ చదివావా నెలవంక
తీయని పిలుపే శ్రావణగీతం
అందిన వలపే ఆమని గానం
లాలాల ఆహాహ లాలాల ఆహాహ


~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~