Feb 28, 2010

సొగ్గాడి పెళ్ళాం

తారాగణం: మోహన్‌బాబు,రమ్యకృష్ణ,మోనికాబేడి,కస్తూరి
గాత్రం: యేసుదాసు,చిత్ర
సాహిత్యం: సాయి శ్రీహర్ష
సంగీతం: కోటి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
విడుదల: 1996




పల్లవి:

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన

చరణం1:

నీలాగ ఒకతుంటే ధర్మరాజు జూదరిగా పేరొందునా
భారతాన యుద్ధమునకు తావుండునా
లోపమంటూ లేనివాడు లోకమందు ఉండబోడు ఏ ఒక్కడు
తప్పు దిద్దుకున్నవాడె ఆ దేవుడు
నీ సహనానికి నా భాష్పాంజలి
నీ హృదయానికి ఇది పుష్పాంజలి
ఏ దేవుళ్ళు దిగి వచ్చి దీవించినారో నోము పండెను

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన

చరణం2:

కన్ను కాచే రెప్ప నీవే
ఆకలైన వేళ అమ్మ లాలింపువే
కన్ను చెమ్మగిల్లు వేళ చెల్లమ్మవే
కంటి చెమ్మ చూడలేని
తోడు నీడ వీడలేని ఇల్లాలిని
జన్మ జన్మనందు నేను నీదానిని
ఈ జగమంతటా నిను తిలకించనీ
నీ సగభాగమై నను తరియించనీ
నా బంగారు కలలన్ని ఫలించి ఇల్లే స్వర్గమైనది

కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
సీత సర్వమూ రామ పాదము
రామచంద్రుడే సీత ప్రాణము
ఆ రామయ్య సీతమ్మ అనురాగ బంధం ఎంత మధురము
కొండకోనపాలైన సీతమ్మ మదిలోన
కోపమేల రాలేదు రామయ్యపైన
రాయల్లె ఉన్న ఈ రామయ్యపైన


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 26, 2010

అంతస్తులు

గాత్రం:భానుమతి



పల్లవి:

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం1:

నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నీరిడిచిపెడితే చేప బతికుంటదా
నీతిడిసిపెడితే మనిషి పరువుంటదా
నిజమాడితే నిష్టూరమేగా
అయినా పేదలు కలలో కూడా కల్లాకపటాలడరు
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

చరణం2:

లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
లోకాన తాటిచెట్టు ఎత్తైనది
ఆ చెట్టు తలదన్నేది ఒకటున్నది
అంతస్తుకి అంతెక్కడుంది
ఏడంతస్తుల మేడకి కూడా పునాది భూమిలో వుండాలి

వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న
పేదోళ్ళ నీతిలో భేదాలు లేవన్న
వినరా విస్సన్న నే వేదం చెబుతా వినరన్న

||

Feb 24, 2010

అక్కాచెల్లెలు

గాత్రం: సుశీల
సాహిత్యం: ఆత్రేయ




పల్లవి:

ఆ ఆ పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా

చరణం1:

కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారు అనుకున్నది
కన్నెగానె బతుకు గడిచిపోతుంది
నన్నెవరేలుకుంటారు అనుకున్నది
జానకి అనుకున్నది
అయ్యొ జానకి అనుకున్నది
శ్రీరామచంద్రుడె చేసుకుంటాడని విన్నది
ఒళ్లంతా ఝల్లన్నది ఓయమ్మా ఒళ్లంతా ఝల్లన్నద్

ఆ ఆ హొహొయ్ పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా

చరణం2:

నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది
నవ మన్మధుని వంటి నాధుని కనులారా
ఒక్కసారి చూడగ ఉబలాటపడ్డది
తుమ్మెదా ఉబలాటపడ్డది హొహొయ్ తుమ్మెదా ఉబలాటపడ్డది
పెళ్ళి పీటల మీద వెళ్ళి కూర్చున్నది
కళ్లలో కాని సిగ్గు కమ్మేసింది
ఓయమ్మా బుగ్గలకు పాకింది

హొయ్ హొహొయ్ పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా

చరణం3:

నీ గుండెలోన నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నీ గుండెలోన నేనుండిపోవాలి
నీ అండనే నేను పండిపోవాలి
నా నోము పంట పండాలి
నా నోము పంట పండాలి
రాముడే రాముడు జానకే జానకని
ముందు వెనకందరూ మురిసిపోవాలని
జానకి మొక్కుతూ మొక్కుకుంది

పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పాండవులు పాండవులు తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా
పంచ పాండవులోయమ్మ తుమ్మెదా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 22, 2010

శ్రీరామదాసు

గాత్రం: కీరవాణి



ఓం శ్రీరామ రామ రామేతి
శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
రమే రామే మనోరమే
సహస్త్రనామ తత్తుల్యం
సహస్త్రనామ తత్తుల్యం
రామనామ వరాననే
రామనామ వరాననే

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

Feb 20, 2010

ప్రేమించుకుందాం రా

గాత్రం: బాలు,చిత్ర,సంగీతసజిత్
సాహిత్యం: భువనచంద్ర



పల్లవి:

సంబరాల తోటలో వలపుమొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజితీగలా ప్రియున్ని ఎట్టా హత్తుకుంది చూడరా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయిజన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
నీడలాగ తోడు వుంటా పారిజాతమా
గుండెలోనె దాచుకుంటా నిన్ను ప్రాణమా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం1:

నీవాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా
నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్నమావి చెట్టునవుతా
నా నవ్వులె నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
ప్రేమకన్న గొప్పదేది సృస్టిలోన లేదురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం2:

ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమవుంది గుండెలోన
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి వుండలేను క్షణమైనా
ఆమాటే చాలునంట ఎన్ని బాధలైనా నేను ఓర్చుకుంటా
నీచేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేనే ఇచ్చుకుంటా
సృస్టిలోనె అందమైన ప్రేమ జంట మీదిరా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
ఆయ్ నుదిటిబొట్టు మీద ఒట్టు నిన్ను వీడను
మల్లెపూల మీద ఒట్టు మాట దాటను
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయిజన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 18, 2010

ఆడదే ఆధారం

గాత్రం: బాలు
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం

చరణం1:

అవని అందము కుదురులేనిది
ఏడాదికొక్కటే వసంతమున్నది
ఋతువు మారినా చెదిరిపోనిది
అమ్మాయి మేనిలో అందాల పెన్నిధి
తుళ్ళకే అలా గంగ వెల్లువ
సొగసు పొంగులో ఈమె సాటివా
వయ్యరి వంపులు నీ ఒంటికున్నవా

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం

చరణం2:

కలికి కళ్ళలో కలల మెరుపుతో
నువు తెల్లబోదువే నీలాల గగనమా
చిలక సొంపులో అంత మైకమా
చిరుగాలి నువ్వలా స్తంభించిపోకుమా
చెలియ తనువులో వేడి తాకితే
చలికి వణకవా సూర్యబింబమా
ఆ మంచు మంటతో జాబిలిగ మారవా

నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం
మీ అందరి అందాలు ఒక్కటైన సుందరిలో
చూడరండి సోయగాల సంగమం సంగమం
నేలమ్మ నింగమ్మ నీరమ్మ నిప్పమ్మ
గాలమ్మ కనరమ్మ సంబరం సంబరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 16, 2010

బాలనాగమ్మ

గాత్రం: ఘంటసాల,జిక్కి




పల్లవి:

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

చరణం1:

వలపు పూబాల చిలికించేను గారాల
వలపు పూబాల చిలికించేను గారాల
అల చిరుగాలి సొకున మేను తూలెనందుకే

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి

చరణం2:

జగతి వినుతించే యువ భావాలు చిందాడి
జగతి వినుతించే యువ భావాలు చిందాడి
ఇల పులకించెనీయల సోయగాలనందుకే

విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
అందాల చందమామ చెంతనుంది అందుకే
విరిసింది వింత హాయి మురిసింది నేటి రేయి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 14, 2010

చూపులు కలిసిన శుభవేళ

తారాగణం: నరేష్,మోహన్,అశ్వని,గాయత్రి
గాత్రం: బాలు,జానకి
సంగీతం: రాజన్-నాగేంద్ర
దర్శకత్వం : జంధ్యాల
నిర్మాణ సంస్థ : సంతోష్ ఫిల్మ్స్
విడుదల: 1989



పల్లవి:

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

చరణం1:

విరిసివిరియని పరువాలు
లయతో తలపడు నాట్యాలు
కలహంసలా కదిలావులే
మరుహింసకు గురిచేయకే
కరుణ చూపించు నా దేవివై
తెలిసి తెలియని భావాలు
పలికి పలుకని రాగాలు
పులకింతలై పలికాయిలే
సురగంగలా పొంగాయిలే
మళయపవనాల గిలిగింతలో
పూచే పొదరిల్లు తోడుగా

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
కలలో ఇలలో ఒకటై నిలిచేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

చరణం2:

బ్రతుకే బహుమతి ఇది చాలా
మెరిసే అధరం మధుశాల
విరజాజిలా విరిసానులే
విరహాలలో తడిసానులే
ఎదుట నిలిచాను నీదానిగా
కలలా కలిసెను ప్రణయాలు
కధలై చిలికెను కవనాలు
రసరాణిలా వెలిగావులే
కవికన్యలా కదిలావులే
ప్రణయ రసరాజ్యమేలేములే
కాచే వెన్నెల్ల సాక్షిగా

నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం
రాగం తానం నీవు నేనై
సంగీతాలే సంయోగాలై
నిమిషం నిమిషం సరసం నింపేను ఈ
నిన్నా మొనా నీదే ధ్యానం
నేడు రేపు నీవే గానం

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~

Feb 12, 2010

భక్త కన్నప్ప

తారాగణం: కృష్ణంరాజు,వాణిశ్రీ
గాత్రం: రామకృష్ణ
సాహిత్యం: వేటూరి
సంగీతం: సత్యం
సంస్థ: గోపీకృష్ణ పిక్చర్స్
విడుదల: 1976




అందరికి శివరాత్రి శుభాకాంక్షలు



పల్లవి:

శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో
శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో

చరణం1:

పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
పున్నెము పాపము ఎరుగని నేను
పూజలు సేవలు తెలియని నేను
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ పూలు తేవాలి నీ పూజకు
ఏ లీల చేయాలి నీ సేవలు

శివ శివ శంకర భక్తవ శంకర
శంభో హరహర నమో నమో

చరణం2:

మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
మారేడు నీవని ఏరేరి తేనా
మారేడు దళములు నీ పూజకు
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని
గంగను తేనా నీ సేవకూ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 11, 2010

శ్రీరామదాసు

గాత్రం: కీరవాణి



ఓం గం క్లీం లక్ష్మీ గణపతయే నమః
శ్రీరాఘవం దశరధాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవిందదళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామీ ఓం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 9, 2010

ప్రేమించుకుందాం రా


గాత్రం: మనో,చిత్ర,స్వర్ణలత
సాహిత్యం: సీతారామశాస్త్రి

పల్లవి:

పెళ్ళికళ వచేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా
హడావిడిగా రెడీ అవుదాం చెలో లైలా
ముచ్చటగ మేళం ఉంది ఆజా ఆజా
తద్ధినక తాళం ఉంది ఆజా ఆజా
మంటపం రమ్మంటుంది ఆజా ఆజా
జంటపడు వేళైయ్యింది ఆజా ఆజా
పెళ్ళికళ వచేసిందే బాలా
పల్లకిని తెచ్చేసిందే బాలా

చరణం1:

అక్షితలు వేసేసిందే షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ
స్వయంవరమే శభాష్ అంది హలో డార్లింగ్
ఇష్టపడు కన్యాదానం లేజా లేజా
జానేమన్ యే దుల్‌హన్‌కో లేజా లేజా
మై డియర్ హబ్బి ముజ్కో లేజా లేజా
ఆశపడు అందం చందం లేజా లేజా
అక్షితలు వేసేసిందే షాదీ
అడ్డుతెర తీసేసింది షాదీ

చరణం2:

హ ఆ హ హ హ ఆ హ ఆ హ హ
ఆలుమగలైపోయామే భామ
అసల కధ బాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చెలో జాణ
మల్లెలతో మంచం సిద్ధం దేఖో దేఖో
ఓ అల్లరితో మంత్రం వేద్దాం దేఖో దేఖో
మన్మధుడ్ని ఆహ్వానిద్దాం దేఖో దేఖో
ఉంమ్మ ముద్ధులతో సన్మానిద్దాం దేఖో దేఖో
ఆలుమగలైపోయామే భామ
అసల కధ బాకీ ఉంది రామ్మా
అమాంతంగా ప్రోసీడ్ అవుదాం చెలో జాణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 7, 2010

లవకుశ

గాత్రం: పి.లీల,పి.సుశీల



పల్లవి:

లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తల్లి దీవెన తాతయ కరుణ
వెన్నుకాయగా వెరువగనేలా
భయమును విడువమురా
లేరు కుశలవుల సాటి

చరణం1:

బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
బీరములాడి రాముని తమ్ములు
తురమున మాతో నిలువగలేక
పరువము మాసిరిగా
పరువము మాసిరిగా
లేరు కుశలవుల సాటి

చరణం2:

పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
పరాజయమ్మే ఎరుగని రాముని
రణమున మేమే గెలిచ్తిమేమి
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
యశమిక మాదే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
లేరు కుశలవుల సాటి
సరి వీరులు ధారునిలో
లేరు కుశలవుల సాటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 5, 2010

అక్కాచెల్లెలు

గాత్రం: ఘంటసాల,పి.సుశీల




పల్లవి:

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన

చరణం1:

చెట్టాపట్టగ కాలం గీలం నెట్టుకునే రానా
చెట్టుతీగలవలెనే నిన్ను చుట్టుకునే పోనా ఆ ఆ
చెట్టాపట్టగ కాలం గీలం నెట్టుకునే రానా
చెట్టుతీగలవలెనే నిన్ను చుట్టుకునే పోనా
గిలిలేని కౌగిలిలోన చలికి చెలికి చెరవెయ్‌నా
కలలూరే కన్నులలోన తొలిచూపుతొ బందీచెయ్‌నా

శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన

చరణం2:

పొద్దే తెలియని ముద్దు ముచ్చట నీలో వింటున్నా
హద్దే చూడని ఆవేశాలు నీలో కంటున్నా
పొద్దే తెలియని ముద్దు ముచ్చట నీలో వింటున్నా
హద్దే చూడని ఆవేశాలు నీలో కంటున్నా
వేగం ఉన్నది నాలోన బిగువులు ఉన్నవి నీలోన
ఒదిగి ఒదిగి నీ ఎదలోన నేనొడిపోదు నీఒ డిలోన

శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన

చరణం3:

పొంగే పొంగుకు కట్టలువేసి నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే నేను ఊర్కున్నా
పొంగే పొంగుకు కట్టలువేసి నీకై చూస్తున్నా
పువ్వు తావి కవ్విస్తుంటే నేను ఊర్కున్నా
మనసు కుదురుగా ఉంటున్నా సొగసూరించెను పంతాన
పంతాలెందుకు మనలోన నీ సొంతం కానని అన్నానా

శ్రీవారేమనుకున్న శ్రీమతి తానతందనాన
శ్రీమతి ఏమన్నా శ్రీవారు తందానతాన
శ్రీవారు తందానతాన

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 3, 2010

బొమ్మరిల్లు

గాత్రం: రంజిత్,ఆండ్రియా
సాహిత్యం: చంద్రబోస్




పల్లవి:

We have a Romeo we need a Juliet
yo yo yo we have a Romeo all that we need is a Juliet
yo yo yo we have a Romeo all that we need is a Juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్‌మేట్ ఎక్కడ ఉన్న కలుపుదాం
కులమేదైన ఫికర్ లేదు కల ఉంటే సరే
మతమేదైన దిగుల్ లేదు మనసుంటే సరే సరే
సినీతారో టెన్నిస్ స్టారో నచ్చేదిక నీకెవ్వరో
We have a Romeo we need a Juliet
We have a Romeo we need a Juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
yo yo yo we have a Romeo all that we need is a Juliet
yo yo yo we have a Romeo all that we need is a Juliet

చరణం1:

చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరి ఎందుకురా
సెల్‌ఫోన్ సొగసరి ఇదిగోరా ఎపుడూ ఎంగేజేరా
టీవి ఏంకర్ దేఖోర ఆ వంకర బాషకి దండం రా
టాటా గారి బేటీరా అది రుపీ రూపం రా
ఏం కావాలో ఓ తనలో క్వాలిటి ఓ
ఇంక నీలో ఓ లేదొయ్ క్లారిటి ఓ
తేల్చేలోగ వయసౌతుంది కనీసం నూటొకటి

We have a Romeo we need a Juliet
We have a Romeo we need a Juliet
హేయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్‌మేట్ ఎక్కడ ఉన్న కలుపుదాం

చరణం2:

అందరు గమనిస్తూ వుంటే ఏమండి అని పిలవాలి
ఎవ్వరు పక్కన లేకుంటే ఏరా అనాలి
అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి
అలసట కానీ వస్తుంటే తలనే నిమరాలి
కొంచెం కోపం ఓ కొంచెం జాలి ఓ
కొంచెం స్వార్ధం ఓ కలిసుండాలి ఓ
నన్నే నాకు కొత్తగ చూపే యువరాణే కావాలీ

We have a Romeo we need a Juliet
We have a Romeo we need a Juliet
హొయ్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందో వెతుకుదాం
పదరా మన వాడి చిలిపి లైఫ్‌మేట్ ఎక్కడ ఉన్న కలుపుదాం
yo yo yo we have a Romeo all that we need is a Juliet
yo yo yo we have a Romeo all that we need is a Juliet

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Feb 1, 2010

మా దైవం పెద్దాయన

తారాగణం: శరత్‌కుమార్,నయనతార,సుజాత
గాత్రం: శ్రీనివాస్,సుజాత
సాహిత్యం: భువనచంద్ర
సంగీతం: రమణీ భరద్వాజ్
దర్శకత్వం: హరి
విడుదల: 2006




పల్లవి:

ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
సిరిమల్లె పూల పరిమళమై ఒదగాలి
ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
సిరిమల్లె పూల పరిమళమై ఒదగాలి
మనువాడువేళ వలపు జడే కురియాలి

చిరుచిరు చినుకుల సవ్వడిలో
నీ తలపుల నడుమున చిక్కుబడ్డా
సన్నజాజి పువ్వులాగ ఒడి చేరి
నీ కళ్ళలోనే కాపురం మొదలుపెట్టా
కొంటెచంద్రుడా నన్ను అదుముకొని
నిండు కౌగిట్లోన సేదతీర్చవా
ఒక మాట నీకు పసితనమా తెలియాలి
సిరిమల్లె పూల పరిమళమై నే ఒదగాలి

చరణం1:

ఊరిలోని పలువీధుల్లో పాదముద్రలెన్నో ఉంటయ్
నీదు అడుగు జాడల కొరకే నా కన్నులు వెదుకుతు ఉంటయ్
చిన్నదాన్ని వెతుకుతు పరుగుపెట్టా
చెలి దొరికిన క్షణమే బయటపెట్టా
నువ్వు నాకు దక్కాలంటూ దేవతలకు ముడుపే కట్టా
వెండికొండనుండే స్వామిని గుండెలోన దాచేదెట్టా
కళ్ళలోని కలలను చెలియా తడితే కంటిముందె నేనుండిపోనా
మనసున దాగున్న మమతై విరిసి ఒడిలో నే పొంగిపోనా
హొ నీవుంటే శిల అయినా శివలింగంలా మారునయా

ఒక మాట నీకు పసితనమా తెలియాలి
తమకాల జ్వాల అణువణువూ రగలాలీ

చరణం2:

ఎవరి పెళ్ళి అవుతూ ఉన్నా
పందిరిలో నిలబడి నేను
మననే వధూవరులుగ తలచి
మురిసి మురిసి పోయేదాన్ని
నిన్నమొన్నదాక ప్రేమ తెలియదన్నా
నిన్ను కలిసిన క్షణమే తెలుసుకున్నా
చందమామ జాడనుపట్టి చెంగులోన ముడివేస్కున్నా
నీలి మంచుబిందువులాగ నిన్ను నేను పెనవేస్కున్నా
ఆనకట్టలాగ ఉందే మనసు నేడు పొంగిపోయినదేల
ఉక్కుమల్లే బిగిసిన హృదయం నేడు పువ్వులాగ మారినదేల
ప్రేమ బలం జతపడితే ఆడతనం విరియునయో

ఒక మాట నీకు మగతనమా చెప్పాలి
ఒక మాట నీకు పసితనమా తెలియాలి
మనువాడువేళ వలపు జడే కురియాలి
తమకాల జ్వాల అణువణువూ రగలాలీ
చిరుచిరు చినుకుల సవ్వడిలో
నీ తలపుల నడుమున చిక్కుబడ్డా
సన్నజాజి పువ్వులాగ ఒడి చేరి
నీ కళ్ళలోనే కాపురం మొదలుపెట్టా
కొంటెచంద్రుడా నన్ను అదుముకొని
నిండు కౌగిట్లోన సేదతీర్చవా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~