తారాగణం: రాజేంద్రప్రసాద్, ఆమని. రాజా గాత్రం: బాలు సాహిత్యం: చైతన్య ప్రసాద్ సంగీతం: ఆర్.పి.పట్నాయక్ నిర్మాత: శ్రీమతి సరితా పట్రా దర్శకత్వం: చంద్ర సిద్దార్థ సంస్థ: ప్రేమ్ మూవీస్ విడుదల: 2004
ఒక్కడై రావడం ఒక్కడై పోవటం నడుమ ఈ నాటకం విధి లీల వెంట ఏ బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ మరణమనేది ఖాయమని మిగిలెను తీపి గాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు
రాజని పేదని మంచని చెడ్డని భేధమే ఎరుగని యమపాశం కోట్ల ఐశ్వర్యము కటిక దారిద్ర్యము హద్దులే చెరిపెనే మరుభూమి మూటలలోని మూల ధనం చేయదు నేడు సహగమనం మన వెంట కడ కంట నడిచేదీ ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు...ఆ నలుగురు
గాత్రం: బాలు, ఆర్పి.పట్నాయక్, ఉష సాహిత్యం: చైతన్య ప్రసాద్
పల్లవి:
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారే మా అమ్మాయి wish you happy married life All the best for rest of life ఆనందాల వేళ ఇది అభినందనల మాల ఇది గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి
మనం చేస్తున్నాం అనుకుంటాం కాని అదంతా ఒట్టిదే Marriages are made in Heaven
చరణం1:
స్వర్గం లోనే పెళ్ళి చేసేసి దేవుడే పంపుతుంటే మళ్ళీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో మీలాంటోళ్ళే నేలపై చేరి రాతలే మార్చుతుంటే వేళాకోళం కాదు పెళ్ళి అని చాటుదామందుకే ఆ మూడుముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే కాదయ్యా కళ్యాణము మనసులనే ముడివేయలి నూరేళ్ళు జత నడవాలి అపుడేగా సౌభాగ్యము
wish you happy married life All the best for rest of life ఆనందాల వేళ ఇది అభినందనల మాల ఇది గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి
పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారం అనేవాడు ఇప్పుడు బోషాణం అంటున్నాడు
చరణం2:
రోజు తింటే నేతి గారైనా చేదుగా మారిపోదా మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా ఏడే కదా స్వరములుండేవి కోటి రాగాలకైనా కూర్చేవాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా సంగీతపు సాధనలాగ సరదా పరిశోధనకాగా చెయ్యాలి సంసారము ఉంటాయి కలిమి లేమి వెంటాడే కష్టము సుఖము కలబోతే సుఖసారము
wish you happy married life All the best for rest of life సుందరం సుమధురం జీవితం ఓ వరం ఆటలా పాటలా సాగాలి మంజులం మోహనం జంటగా జీవనం ఈ క్షణం శాశ్వతం కావాలి wish you happy married life All the best for rest of life ఆనందాల వేళ ఇది అభినందనల మాల ఇది
పంచదార బొమ్మ బొమ్మా పట్టుకొవద్దనకమ్మ మంచుపూల కొమ్మ కొమ్మా ముట్టుకొవద్దనకమ్మ చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మ నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ
చరణం1:
పువ్వు పైన చెయ్యిస్తే కసిరి నన్ను తిట్టిందే పసడి పువ్వు నువ్వని పంపిందే నువ్వు రాకు నా వెంట ఈ పువ్వు చుట్టు ముళ్ళంట అంటుకుంటే మంటే ఒళ్ళంతా తీగ పైన చెయ్యిస్తే తిట్టి నన్ను నెట్టిందే మెరుపు తీగ నువ్వని పంపిందే మెరుపు వెంట ఉరుమంట ఉరుము వెంట వరదంట నే వరద లాగ మారితే ముప్పంట వరదైన వరమని వరిస్తానమ్మ మునకైన సుఖమని ముడేస్తానమ్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చరణం2:
గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది నేను నిన్ను తాకితే తప్పా గాలి ఊపిరి అయ్యింది నేల నన్ను నడిపింది ఏవిటంట నీలోని గొప్ప వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది పక్షపాతమెందుకు నాపైన వెలుగు దారి చూపింది చినుకు లాల పోసింది వాటితోటి పొలిక నీకేల అవి బ్రతికున్నప్పుడే తోడుంటాయమ్మ నీ చితిలో తోడై నేనొస్తానమ్మ
నిన్ను పొందేటందుకే పుట్టానే గుమ్మ నువ్వు అందకపొతే వృధాయే ఈ జన్మ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అందాల వన్నెలకే అపురూప కురులందం అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం మగువలో ప్రేమొస్తే మనుగడే ఓ అందం నా తోడు నీవుంటే చీకటే ఓ అందం
రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
చరణం1:
కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు కన్నెపిల్ల మనసు మీ అన్నకేమి తెలుసు శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న శిశుపాలుడి కన్న శ్రీకృష్ణుడు మిన్న రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు రమణి ప్రేమ సొంపు నువు రాయబారమంపు చిలకచేత కబురుపంప చెలుడు రాకపోడమ్మ బాలరుక్కమ్మా
రుక్మిణమ్మ రుక్మిణమ్మ కోరుకున్న మగనికొరకు నోచాలమ్మ రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
చరణం2:
గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి గౌరి పూజచేసి ఆ గర్భగుడిలో వేచి ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ ఎదురు చూడవమ్మ నీ బెదురు మానవమ్మ రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు రమ్మమైనవాడు ఒక రథము తెచ్చినాడు తేరుమీద ప్రియునితోను తేలి సాగిపోవమ్మా బాలరుక్కమ్మా ఆ ఆ ఆ
రుక్మిణమ్మ రుక్మిణమ్మ ఎంత మంచి నోము నువ్వు నోచావమ్మా రుక్మిణమ్మ రుక్మిణమ్మ కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మ
చరణం3:
అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు అట్లతద్దె రోజు మా ఆడపిల్లల మోజు అంతా గుమిగూడి సై ఆట పాటలాడి అంతా గుమిగూడి సై ఆట పాటలాడి తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి తదియ చంద్రుచూసి మా తనివి తీరనోచి అట్లతద్దె నోమునోచ అందగాడె మొగుడమ్మా బాలరుక్కమ్మా ఆ ఆ ఆ
చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను ఎత్తుకుని ముద్దాడి ఉయ్యాలలూపేను జోలపాట పాడేను లాలిపాట పాడేను
చరణం1:
నీ ఒడిలో నిదురించి తీయనీ కలగాంచి పొంగి పొంగి పోయాను పుణ్యమెంతో చేశాను నీ ఒడిలో నిదురించి తీయనీ కలగాంచి పొంగి పొంగి పోయాను పుణ్యమెంతో చేశాను ఏడేడు జన్మలకు నా తోడు నీవమ్మా ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవు నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌను గాయత్రి మంత్రమును జపించే భక్తుడనే కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలనులే
చరణం2:
స్నానమాడి శుభవేళ కురులలో పువ్వులతో దేవివలె నీవొస్తే నా మనసు నిలువదులే అందాల కన్నులకు కాటుకను దిద్దేను చెడుచూపు పడకుండా అగరు చుక్క పెట్టేను
చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేను నేను మేను మరిచేను ఎత్తుకుని ముద్దాడి ఉయ్యాలలూపేను జోలపాట పాడేను లాలిపాట పాడేను జోలాలీ జోలాలీ జోలాలీ జోలాలీ జో జో జో
తాతయ్య సిరులెల్లా వేగ రప్పింప జాబులో పుట్టిన బాబు నీవయ్య జాబులో పుట్టిన బాబు నీవయ్య ఉయ్యాలజంపాలలూగరావయ్య
చరణం2:
మా మనోరమక్కాయి మదిలోన మెరిసి ఎదురింటి ఇల్లాలి ఒడిలోన వెలసి ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి ఎత్తుకొని ముత్తాత ఎంతెంతో మురిసి నా వారసుడావంతు నవ్వూరా కలసి నా వారసుడావంతు నవ్వూరా కలసి
మా మదిలో కోర్కెలను మన్నింప దయతో అవతరించినావయ్య అందాలరాశి చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష చిన్ని నా తండ్రికి శ్రీరామరక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష తప్పక ఇచ్చురా తాతయ్య లక్ష
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడూ ఓ వానా నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా మనకే ఉంటే అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే చూపదా మరి ఆ మాయా దీపం మన ఫేటే ఫ్లైట్ అయ్యే రన్‌వే
చరణం1:
నడి రాత్రే వస్తావే స్వప్నమా పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా ఆ ఆ ఆ ఉరికినె ఉరిస్తే న్యాయమా సరదాగ నిజమైతే నష్టమా మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా ఓ చిరునవ్వా ఇలా రావా
చరణం2:
వేకువనే మురిపించే ఆశలు వెనువెంటనే అంతా నిట్టూర్పులూ లోకంలో లేవా ఏ రంగులు నలుపొకటే చూపాలా కన్నులూ ఇలాగేనా ప్రతీ రోజూ ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే ఐతే తరగని సిరులతో తల రాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అందమిదే మకరందమిదే నా జీవితానందమే నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో నాలో విరితావి వెద జల్లిపోయిందిలే జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిండు మాసాలలో ఆ ఆ ఆ ఆ
తారాగణం: ప్రభుదేవా,శరత్‌కుమార్,జయాశీల్,ఐశ్వర్య గాయకులు: ఉన్నిమీనన్ సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్ దర్శకత్వం: ఎళిల్ నిర్మాణ సంస్థ : రోజా కంబైన్స్ విడుదల : 2000
పల్లవి:
కల్లల్లోన నినుగాంచానే కన్నమ్మా కనురెప్పలనయనా మూయగలేనే చిలకమ్మా కనురెప్పల నీడలొ కాపురముండవే చిట్టెమ్మ అరె నీవుంటె సంతోషం నీవేగా నా ప్రాణం నీవాడే పలుకుల్లో వున్నాదే సంగీతం నీ పువ్వులాంటి నవ్వులు చాలే చంద్రముఖి నువు లేనినాడు నేను లేనే ప్రాణసఖి
చరణం1:
నిజం నేస్తమా ప్రియరాగమా నిన్ను చూసి నన్నే మారిచానులే అదేం మొహమో అదేం దాహమో నువ్వులేని నిమిషం యుగమాయనే ఎడారంటి గుండెల్లో వలపు వాన కురిసింది నీ వెచ్చని వెచ్చని ఊపిరిలో నా జీవితముంది సఖి నీ అందాలు చేసే సవ్వడులే నా ఆశలు శ్వేతమయి
విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో విలపించే కధలు ఎన్నో
చరణం1:
ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళ అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువనీ తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో విధిచేయు వింతలన్నీ
చరణం2:
వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో అది నేడు జరుగ రాదని ఎడడబాసి వేచినాము మన గాధె యువతరాలకు కావాలి మరో చరిత్ర కావాలి మరో చరిత్ర
రాజా పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీ వెంట ఉంటనురా నిను వీడి పొలేనురా రాజా పిలుపు నాదేనురా నీ నీడగా నీ తోడుగా నీ వెంట ఉంటనురా నిను వీడి పొలేనురా రాజా రాజా
చరణం1:
నీ ముందు నే నిలిచినా నిను చేరుకోలేనురా ఏ చోట నేనున్నా నీ కోసమే నేనురా మరుజన్మలోనైనా నీదాననౌవాతానురా ఈ బంధము అనుబంధము కడలేని కధరా దొరా ఓ ఓ కడలేని కధరా దొరా రాజా రాజా
చరణం2:
పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా పల్లవి లేని పాటనురా పగలే చూడని రేయినిరా కరిగిన కల నేనురా కదలని శిలనైతిరా ఈ బంధము అనుబంధము కడలేని కధరా దొరా కడలేని కధరా దొరా రాజా రాజా