31-May-2010

బొమ్మరిల్లు

గాత్రం: శ్రీనివాస్,గోపికాపూర్ణీమ
సాహిత్యం: భాస్కరభట్ల




పల్లవి:

బొమ్మను గీస్తే నీలా ఉంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
సరసాలాడే వయసొచ్చింది
సరదా పడితే తప్పేముంది
ఇవ్వాలని నాకూ ఉంది
కాని సిగ్గే నన్ను ఆపింది
దానికి సమయం వేరే ఉందంది

చరణం1:

చలిగాలి అంది చెలికి ఒణుకే పుడుతుంది
వెచ్చని కౌగిలిగా నిన్ను అల్లుకుపొమ్మంది
చలినే తరిమేసే ఆ కిటుకే తెలుసండీ
శ్రమ పడిపోకండి తమ సాయం వద్దండీ
పొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగా
అబ్బో ఎన్త జాలిరా తమరికి నామీద
ఏం చెయ్యాలమ్మ నీలో ఎదో దాగుంది
నీ వైపే నన్నే లాగింది

చరణం2:

అందంగా ఉంది తన వెంటే పదిమంది
పడకుండా చూడు అని నా మనసంటుంది
తమకే తెలియంది నా తోడై ఒకటుంది
మరెవరో కాదండి అది నా నీడేనండి
నీతో నడిచి దానికి అలుపొస్తుందే జానకి
హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగా
ఈ మాట కోసం ఎన్నాళ్ళుగా వేచుంది
నా మనసు ఎన్నో కలలు కంటుంది

బొమ్మను గీస్తే నీలా ఉంది ఉహు
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది అహహహ
సర్లే పాపం అని దగ్గరకెళ్తే
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది
దాని మనసే నీలో ఉందంది
ఆ ముద్దేదో నీకే ఇమ్మంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29-May-2010

శ్రీరామదాసు

గాత్రం: శంకర్ మహదేవన్,విజయ్ యేసుదాసు
సాహిత్యం: శ్రీ వేదవ్యాస



పల్లవి:

అల్లా ఆ ఆ ఆ
శ్రీరామా ఆ ఆ ఆ

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

చరణం1:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

మాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీరామ
మాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపనిమపమ కోదండరామ
మపరిసనిసాని పానిపమ సీతారామ
మపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
మ మ రిమరిమ రిసమ
రామ జయరామ
సరిమ రామ సపమ రామ పావనామ

చరణం2:

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పు

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-May-2010

సహస్రం



అందరికి నమస్కారం. ఇప్పటికి ఈ బ్లాగులో వెయ్యి టపాలు పూర్తయ్యాయి.ఈ రెండున్నర సంవత్సరాలుగా ఈ బ్లాగును ఆదరిస్తున్న అందరికి వందనాలు. ఈ బ్లాగులో ఎవైనా తప్పులు ఉన్నా,ఏ పాట ఆడియో ఐనా పనిచేయకున్నా దయచేసి తెలుపగలరని మనవి.అలాగే మీకు తెలిసిన మంచి పాటలు గురించి తెలియజేయవలసిందిగా కొరుచున్నాను.త్వరలో ఈ బ్లాగు మూడో పుట్టినరోజు జరుపుకోబోతుంది. మీ అభిప్రాయలకోసం పది రోజులపాటు ఈ బ్లాగులో టపాలు నిలిపివేస్తున్నాను. మీ ఆధరణ ఇక ముందు కూడా ఇలాగే ఉంటుందని ఆశిస్తూ మరిన్ని మేలి ముత్యాలని మీకు అందించటానికి ప్రయత్నిస్తాను.మీ సూచనలు, అభిప్రాయాలు ఇక్కడ కమెంట్ రూపంలో తెలియజేయవచ్చు లేదంటే ఈ కింది చిరునామాకీ మెయిల్ చేయవచ్చు.

మెయిల్: vihaari1@rediffmail.com

17-May-2010

గాయం

గాత్రం: బాలు
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి




పల్లవి:

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

చరణం1:

గాలివాటు గమనానికి కాలిబాట దేనికి
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం
ఏ క్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం
రామబాణమార్పిందా రావణ కాష్టం
కృష్ణగీత ఆపిందా నిత్య కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం

చరణం2:

పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా
వేట అదే వేటు అదే నాటి కథే అంతా
నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత
బలవంతులే బ్రతకాలని సూక్తి మరవకుండా
శతాబ్దాలు చదవలేద ఈ అరణ్యకాండ

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవశ్చవాన్ని
మారదు లోకం మారదు కాలం
దేవుడు దిగిరానీ ఎవ్వరు ఏమైపోనీ
మారదు లోకం మారదు కాలం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-May-2010

మీ శ్రేయోభిలాషి

తారాగణం: రాజేంద్రప్రసాద్,నరేష్,మేధ
గాత్రం: బాలు
సాహిత్యం: వెనిగెళ్ళ రాంబాబు
సంగీతం: కోటి
నిర్మాత: డా.వై.సోనియా రెడ్డి
దర్శకత్వం: వి.ఈశ్వర్‌రెడ్డి
సంస్థ: విసు ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్




పల్లవి:

ఆత్మీయత కరువైనా అంధకారమెదురైనా
బ్రతకడమే బరువైనా స్థితిగతులవి ఏమైనా
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చరణం1:

బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో
బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో
కలతే లేని జీవితమంటే విలువే లేదులే
అలుపే లేక అవలీలగ ఏ గెలుపూ రాదులే
నింగినంటు ఎవరెస్టైనా నేల నుండి మొదలవతుంది
నమ్ముకోకు అదృష్టాన్ని నమ్ముకో ధైర్యాన్ని
మెరుపులే పిడుగులై ఉరుముతున్నా
ఉరకలు వేసే కిరణం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరుదివ్వెలుగా వెలగాలి
లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి
వెన్నెలలే కురిపించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చరణం2:

ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం
వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం
ఏదీ నీది కాదు అనుకో ఏద్దో నాటికి
ఆయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి
కొమ్మలన్ని చుక్కలవైపే కోరి కోరి చూస్తున్నా
మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా
చీడలే నీడలై వీడకున్నా
అందరి బృందావనమే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి శ్రీకారంలా బ్రతకాలి
గతమంతా కనుమరుగవుతున్నా నిన్నటి స్వప్నం నిలవాలి
నీ సంకల్పం గెలవాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చరణం3:

ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి
ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి
ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా
ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా
ఆశ వెంట ఆచరణ ఉంటే అద్భుతాలు నీ సొంతం
ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం
నిప్పులే గుండెలో నిండుతున్నా
ఉప్పొంగే జలపాతం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిగురాశలతో బ్రతకాలి
అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూ నువ్వు బ్రతకాలి
ఆశయాన్ని బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చరణం4:

నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా
నలుసే నిన్ను భాధపెడితే ఆ దోషం కంటిదా
నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే
సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే
పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి
జారిపోకు పాతాళానికి బ్రతుకుబాట మరచి
వరదలా మృత్యువే తరుముతున్నా
ఆరని అగ్నిజ్వాలే జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకి ఎదగాలి
చిరునవ్వులతో బ్రతకాలి శిఖరంలా పైకి ఎదగాలి
చావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి
నువ్వు జీవించే తీరాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి

చరణం5:

విజయం తలుపు తెరిచేవరకు విసుగే చెందకు
విసుగే చెంది నిస్పృహతో నీ వెనకే చూడకు
చిందే చమట చుక్కకు సైతం ఉంది ఫలితమే
అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే
అంతరాత్మ గొంతే నులిమి శాంతి కొరుకుంటవా
అల్లుకున్న అనుబంధాలే తల్లడిల్లిపోవా
అలజడే నిలువునా అలుముకున్నా
అలుపెరుగుని చైతన్యం జీవితం

చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవిగా బ్రతకాలి
ఆనందాలను అన్వేషిస్తూ అందరికోసం బ్రతకాలి
అందరినీ బ్రతికించాలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

||


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

13-May-2010

మరో చరిత్ర

సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: బాలు,రమోల





పల్లవి:

కలిసి వుంటే కలదు సుఖము
కలసి వచ్చిన అదృష్టము
శభాష్ అహా
కలిసి వుంటే, కలిసి వుంటే కలదు సుఖము
కలిసి వుంటే కలదు సుఖము
కలిసి వచ్చిన అదృష్టము
ఇది కలిసి వచ్చిన అదృష్టము
కన్నె మనసులు మూగ మనసులు
ఆ కన్నె మనసులు మూగ మనసులు
తేనె మనసులు మంచి మనసులు
కలిసి వుంటే కలదు సుఖము
కలసి వచ్చిన అదృష్టము
ఇది కలసి వచ్చిన అదృష్టము

చరణం1:

మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడు పూల రంగడు
మొనగాళ్ళకు మొనగాడు దసరా బుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడు పూల రంగడు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
ఆ ఛీ ఏం కాదు
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయి
అమెరిక అమ్మాయీ రోజులు మారాయి

కలిసి వుంటే కలదు సుఖము
కలసి వచ్చిన అదృష్టము
ఇది హుహుహు అదృష్టము

చరణం2:

మంచి వాడు మామకు తగ్గ అల్లుడు
ఓ అలాగా
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు
హ హ అయ్యో పిచ్చివాడు
ఏయ్ మంచి వాడు మామకు తగ్గ అల్లుడు
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు
ఈడు జోడు తోడు నీడ నాడు నేడు
ఈడు జోడు తోడు నీడ నాడు నేడు
ప్రేమించి చూడు పెళ్ళి చేసి చూడు
హమ్మ బాబోయ్


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-May-2010

యమలీల

గాత్రం: బాలు,చిత్ర
సాహిత్యం: సీతారామశాస్త్రి




ధర్మపరిరక్షణా ధురంధరుండా
సకలపాప శిక్షణా దక్షుండా
చండతర దండతర బాహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా

పల్లవి:

అభివందనం యమ రాజాగ్రణీ
సుస్వాగతం సుర చూడామణీ
తమ సుగుణాలు పలుమారు కీర్తించనీ
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ
ఏమీ శహబాష్
సెహబాసులే నర నారీమణీ బహుబాగులే సుకుమారీమణీ
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ

చరణం1:

సరసాలు చవిచూడ ఇటురా దొరా
నవమన్మథాకార నడుమందుకోరా
రాకాసి కింకరుల రారాజునే
నరకాన నీవంటి సరుకెపుడు కననే
పాపాలు తెగ మోసి తల మాసెనేమో
నా పాలబడి కాస్త సుఖమందుకోవోయ్
ఆ...ఆ ఆ ఆ ఆ ఆ
అవశ్యము అటులనే కానిమ్ము
నీ కౌగిలే నవ సింహాసనం
రసలోకమే ఇక మన కాపురం
యమ సరదాగా సాగాలి ఈ సంబరం
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ

చరణం2:

ఊర్వశికి నీవేమి కజినవుదువా
కాకున్న నీకింత సౌందర్యమేల
నరలోకమున ఊరికొక ఊర్వశి
స్వర్గాలే దిగివచ్చు మా కులుకు చూసి
ఊరించకే ఇక నా రాజహంస
యమ హాయి నీదేలే రసికావతంస
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ
రసికాగ్రేసరుండా యముండా
మైకాలలో తమ మతిపోవగా
నా కేళిలో పడి మునకేయగా
గద వదిలేసి ఒడిలోకి రాదేవరా
ఆ.. ఆ ఆ ఆ ఆ ఆ
మజ్జారే మదవతీ
సెహబాసులే నర నారీమణీ బహుబాగులే సుకుమారీమణీ
నిను మెచ్చాను వచ్చాను రారమ్మనీ
ఆ... ఆ ఆ ఆ ఆ ఆ

ధర్మపరిరక్షణా ధురంధరుండా
సకలపాప శిక్షణా దక్షుండా
చండతర దండతర బాహుమండిత విగ్రహుండా
నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలనా నియముండా హ యముండా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

09-May-2010

బుల్లెమ్మ బుల్లోడు

గాత్రం: బాలు,బి.వసంత
సాహిత్యం: దాశరథి




పల్లవి:

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట

చరణం1:

దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదను వాడు అసలే లేడు
దేవుడే లేడనే మనిషున్నాడు
అమ్మే లేదను వాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
మమతల మూట

చరణం2:

అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికి తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా, ఉందిరా

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
మమతల మూట

చరణం3:

అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కతే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కతే
అంగడిలొ దొరకనిది అమ్మ ఒక్కతే
అందరికి ఇలవేలుపు అమ్మ ఒక్కతే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ
అమ్మ అనురాగం ఇక నుంచి నీదీ నాదీ

అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
మమతల మూట


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-May-2010

గుడి గంటలు

తారాగణం: రామారావు, జగ్గయ్య, కృష్ణకుమారి
గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఘంటసాల
దర్శకత్వం : వి.మధుసూదన రావు
సంస్థ: రాజ్యలక్ష్మీ ప్రొడక్షన్స్
విడుదల: 1965





పల్లవి:

దూరాన నీలిమేఘాలు
నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు
తొంగి చూసేను కన్నె సరదాలు

దూరాన నీలిమేఘాలు
నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు
తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్ ఒహొహొ హొయ్ ఓఓఓఓఓ

చరణం1:

నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నచ్చిన ఊహల నాదస్వరానికి నా జడ నాట్యము చేసినది

దూరాన నీలిమేఘాలు
నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు
తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్ ఒహొహొ హొయ్ ఓఓఓఓఓ

చరణం2:

తేనెలు తాగుతు గాలుల తేలుతు తుమ్మెద ఝుమ్మని ఆడినది
తేనెలు తాగుతు గాలుల తేలుతు తుమ్మెద ఝుమ్మని ఆడినది
తుమ్మెద తీరున కమ్మని నా మది తుళ్ళుతు గెంతులు వేసినది

దూరాన నీలిమేఘాలు
నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు
తొంగి చూసేను కన్నె సరదాలు
ఓఓఓ ఓ ఓఓఓ ఓ ఓఓఓ ఓ


||

05-May-2010

శ్రీరామదాసు

గాత్రం: సునీత
సాహిత్యం: జె.కె.భారవి



ఇదిగిదిగో నా రాముడు ఈడనే కొలువుండినాడు
ముద్దుల సీతతో ఈడనే మురిపాలాడినాడు

ఇది సీతమ్మ తల్లి ఆరేసుకున్న నార చీరె
ఇదె రాముడు కట్టుకొనగ పులకించిన పంచె
ఏడేడు లోకాలను ఏలెడి పాదాలివే
మాయల బంగారు లేడి మాయని గురుతులివే

పచ్చగ అయిదోతనమే పదికాలాలుండగా
సీతమ్మ వాడిన పసుపుకుంకుమ రాళ్ళివే
దాటొద్దని లక్ష్మణుడు గీతను గీసిన చోటిదే
అమ్మను రావణుడెత్తుకుపోయిన ఆనవాళ్ళివే

ఇది ఆ రాముడు నడయాడిన పుణ్యభూమి
మరి నా రామునికీడ నిలువనీడ లేదిదేమి
నిలువ నీడ లేదిదేమి

~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

03-May-2010

చిరునవ్వుల వరమిస్తావా

తారాగణం: విక్రం,రక్ష
గాత్రం: బాలు
సాహిత్యం: వెన్నెలకంటి
సంగీతం: విద్యాసాగర్
దర్శకత్వం: నందం హరిశ్చంద్రరావు
నిర్మాత: సంగం వెంకటేశ్వరరావు
విడుదల: ఆగిపోయింది





పల్లవి:

చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవి సెగలు నావి
మంచులోన మంట ఇది
పగలు నీవి సెగలు నావి
మంచులోన మంట ఇది
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను

చరణం1:

రేపులేని రేయిని నేనై చెబుతున్నా వీడ్కోలు
అశ్రువులే అక్షరాలుగా చేస్తున్నా చేవ్రాలు
నిప్పు చివర నివురుంటుంది
వలపు చివర వగపుంటుంది
నిప్పు చివర నివురుంటుంది
వలపు చివర వగపుంటుంది
నింగిజార్చు కన్నీటి ధారలో
నేల తడిసి పులకిస్తుంది
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను

చరణం2:

ఊహలన్నీ శిధిలాలైతే ఊపిరున్న శిల నేను
కళ్ళులేని మనసున మరిగి కరుగుతున్న కల నేను
పగులుతున్న హృదయమిది
పడమటింటి ఉదయమిది
పగులుతున్న హృదయమిది
పడమటింటి ఉదయమిది
ఎద ప్రమిదకు నెత్తురు నింపి
ఎదురుచూచు దీపమిది

చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవు రేయిని నేను
కలుసుకోని జంట ఇది
పగలు నీవి సెగలు నావి
మంచులోన మంట ఇది
చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి బ్రతికొస్తాను
మరుజన్మకు కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

01-May-2010

మగధీర

గాత్రం: జెస్సీ గిఫ్ట్ బృందం
సాహిత్యం: ఎం.ఎం.కీరవాణి






అనగనగనగనగనగా అనగనగనగనగా
అనగనగనగనగనగా అనగనగనగనగా
అనగనగనగనగనగనగనగనగనగా
హే అనగనగనగనగనగనగనగా రాజుకు పుట్టిన కొడుకుకులు తెచ్చిన
చెపల బుట్టలో ఒకటే ఎందుకు ఎండాలేదురా
అది ఒకటే ఎందుకు ఎండాలేదురా
అది ఎండేలోగా వానొచ్చిందిరా...పాయింటే
ఆ వానల్లోన వరదొచ్చిందిరా
చేప ఎండేలోగా వానొచ్చిందిరా
ఆ వానల్లోన వరదొచ్చిందిరా
ధీర ధీర ధీర
మగువలు వలచిన మగధీరా
మనసులు దోచిన మగధీరా
జనమెగబడి మెచ్చిన ధీరా
జగమెరిగిన మగ మగధీరా
ధీర ధీర ధీర ధీర

Get on the feet
No move less on the street
Every one do something
Better do the sodha thing
Now rock every one
We on the run
Now heat the floor
Move move every one
Get the grow
Now dance every one
Now rock the show
Now catch every one
yeah...ha ha ha


యే చలపతిగాడి దూళ్ళపాక
పక్కన ఉన్న సందు వెనుక
విరగపండిన తోటలోన
నిగమిగమంటున్న నిమ్మపండు
పండు పండు పండు
అది మీసం మీద నిలబెట్టాలిరా
నిమ్మపండు మీసం మీద నిలబెట్టాలిరా
కొండలు పిండి కొట్టెయ్యాలిరా
అహ దిక్కులనైనా దున్నెయ్యలిరా
అహ కొండలు పిండి కొట్టెయ్యాలిరా
అహ దిక్కులనైనా దున్నెయ్యలిరా
ధీర ధీర ధీర

Wanna singana dancena magadheera
Wanna rockana movena magadheera
Wanna singana dancena magadheera
Wanna rockana movena magadheera
ధీర ధీర ధీర

హే ఇరుగుదిష్టి పొరుగు దిష్టి
ఇంటా బయటా తగిలిన దిష్టి
నీ నీ దిష్టి నా నా దిష్టి దిష్టి దిష్టి
దిష్టి దిష్టి దిష్టి
దెబ్బకు వదిలి దొబ్బెయ్యాలిరా
ఈ దెబ్బకు వదిలి దొబ్బెయ్యాలిరా
గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా
మంగళహారతి పట్టెయ్యాలిరా
గుమ్మడికాయ కొట్టెయ్యాలిరా
మంగళహారతి పట్టెయ్యాలిరా
ధీర ధీర ధీర

Wanna singana dancena magadheera
Wanna rockana movena magadheera
Wanna singana dancena magadheera
Wanna rockana movena magadheera
Wanna singana dancena magadheera
Wanna rockana movena magadheera

ధీర ధీర ధీర
ధీర ధీర ధీర
ధీర ధీర ధీర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~