31-Dec-2010

ఇల్లాలు


గాత్రం: పి.సుశీల
సాహిత్యం: ఆత్రేయ


పల్లవి:

మనసునేదో కవ్విస్తుంది
తలచుకుంటే నవ్వొస్తుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది
తలచుకుంటే నవ్వొస్తుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది

చరణం1:

ఆ ఆ ఆ ఆ
ఒడిని ఉన్నా విడిచి ఉన్నా నిదురరానేరానంటుంది
ఒడిని ఉన్నా విడిచి ఉన్నా నిదురరానేరానంటుంది
నిదురరాని హృదయమేమో కథలు చెబుతానంటుంది
కథలు చెబుతానంటుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది


చరణం2:

కన్నె మనసు ఏం చేస్తుంది
కలవరింత మొదలెడుతుంది
విరులపానుపు విసుగౌతుంది
వెన్నెలైనా వేడౌతుంది
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది

చరణం3:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొదటిరేయి నన్ను చేరి బుగ్గ మీద ముగ్గువేసే
మొదటిరేయి నన్ను చేరి బుగ్గ మీద ముగ్గువేసే
నిన్ను చూసి నేను కరిగి ఒదిగిపోవుట గురుతు వచ్చె
ఒదిగిపోవుట గురుతు వచ్చె
చెప్పుకోను వీల్లేకుంది సిగ్గేస్తుంది
ఆహాహాహా మనసునేదో కవ్విస్తుంది

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

29-Dec-2010

అయ్యప్పస్వామి మహత్యం

గాత్రం: బాలు



పల్లవి:

స్వామియే శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

చరణం1:

వేదశాస్త్రము ఎరుగను బ్రహ్మసూత్రము
తలపను జ్ఞానయోగము విధివినిత మోక్షమార్గము
కలియుగపు కామ లోభ పంజరాన పామరుండనై
పూజలెరుగని పువ్వునై, పుణ్యమెరుగని జీవినై
ఆత్మనెరుగని దేహినై, అంధ మత సందేహినై
విషయ వాదముల విషతరువైతిని
విలయ పవనముల విలవిలలాడితి

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

చరణం2:

ఇంద్రియాలతో కలబడి ఈషణత్రయినై
కలుషిత జీవభావము కడవరకు మోయువాడను
శబరిగిరికందరాలనందలేని మందభాగ్యినై
చైత్ర వనముల కాంతినై, గ్రీష్మఋతువున కోకిలై
వెల్లువెరుగని వేణువై, వెన్ను చూడని కన్నునై
మనుజ జన్మమిది మలినము చేసితి
మదన కదనమున మలమల మాడితి

శబరిమలై సందీప అయ్యప్ప
అభయహస్తమిచ్చేదెవరు నువు తప్ప అయ్యప్పా
శబరిమలై సందీప అయ్యప్ప

స్వామియే శరణం అయ్యప్ప
స్వామియే శరణం అయ్యప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Dec-2010

జీవితంలో వసంతం

తారాగణం: రామకృష్ణ , చంద్రకళ
గాత్రం: బాలు, వాణి జయరాం
సాహిత్యం: వేటూరి
సంగీతం: చక్రవర్తి
దర్శకత్వం: యు.వి.ఫణి
సంస్థ: శశికళా చిత్ర
విడుదల: 1977




పల్లవి:

నీలగిరి చల్లన నీ ఒడి వెచ్చన
నీలగిరి చల్లన నీ ఒడి వెచ్చన
నువ్వు నేను ఒకటైతే నూరేళ్ళు పచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల
నీ జత నేనుంటే బ్రతుకే ఊయల
నీలాల మబ్బులలో తేలి తేలి పోదామా
సోలి సోలి పోదామా
ప్రియతమా...ప్రియతమా ఓ ఓ ఓ
నీలగిరి చల్లన నీ ఒడి వెచ్చన
నీ మది కోవెల అన్నది కోయిల

చరణం1:

నీ లేడి కన్నులలో మెరిసే తారకలు
నీ లేత నవ్వులలో విరిసే మల్లికలు
నీ మాట వరసలలో వలపే వెల్లువగా
నీ పాట తోటలలో పిలుపే వేణువుగా
పులకించిన నా మదిలో పలికించిన రాగాలు
చెలరేగిన వయసులో తీయని అనురాగాలు
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ
జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో తేలి తేలి పోదామా
సోలి సోలి పోదామా

చరణం2:

ఈ ఏటి తరగలలో గలగలలే నీ గాజులుగా
ఈ కొండగాలులలో హా గుసగుసలే నీ ఊసులుగా
ఈ సంధ్య వెలుగులలో కలయికలే కవితలుగా
ఈ కౌగిలింతలలో అల్లికలే మమతలుగా
తొలి పువ్వుల చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడిలో
మరుమల్లెల విరిజల్లుల మనసిచ్చిన నీ ఒడిలో
ఇదే ఇదేలే జీవితం లలాలలా
జీవితంలో వసంతం ఆ ఆ ఆ ఆ
ఇదే ఇదేలే జీవితం అహహహహ
జీవితంలో వసంతం
నీలాల మబ్బులలో...నీలాల మబ్బులలో
తేలి తేలి పోదామా...తేలి తేలి పోదామా
సోలి సోలి పోదామా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

25-Dec-2010

బాల ఏసు

గాత్రం: సుశీల
సాహిత్యం: అమ్మిరాజు



రాజా దేవా నీవినవా మా గాధ
బాల ఏసు రా

పల్లవి:

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
మానవలోకం మంగళజ్యోతి మా మదిలో వెలిగించవా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా

చరణం1:

లోక పిత ... లోక పిత
కరుణ సుధ ... కరుణ సుధ
మృదు మధుర సుధా రసం చిందించవా
లోక పిత ... లోక పిత
కరుణ సుధ ... కరుణ సుధ
మృదు మధుర సుధా రసం చిందించవా
నవ వసంత కాలమునే చూపవా
మా జీవన పూదోటలొ వికసించవా
నా వాంఛలేవో ఈడేరు కాదా బాల ఏసు చూపించవా

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా

చరణం2:

వేదనతో ... వేదనతో
కుమిలితిమీ ... కుమిలితిమీ
మాకు ఒక బాలుని నీవీయవా
ముద్దు మాటలేనాడూ విందుమే
మీ అమ్మకు నీవొక బిడ్డవు కావా
మరియమ్మ పుత్రా నా గోడు వినవా
మదిలో వాంఛ నెరవేర్చవా

దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
మానవలోకం మంగళజ్యోతి మా మదిలో వెలిగించవా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా
దివ్యమే నీ పాద పూజ బాల ఏసు రా


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

23-Dec-2010

శ్రీరామదాసు

గాత్రం: చిత్ర,కీరవాణి
సాహిత్యం: రామదాసు



పల్లవి:

కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
కలలో నీ నామ స్మరణా మరువ చక్కని తండ్రి
పిలిచిన పలుకవేమి పలుకే బంగారమాయెనా,పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పలుకే
పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా

చరణం1:

ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
ఇరవూగ ఇసుకలోన పొరలీన ఉడుత భక్తికీ
కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా

చరణం2:

శరణాగతత్రాణ బిరుదాంకితుడవు కావా
శరణాగతత్రాణ బిరుదాంకితుడవు గావా
కరుణించు భధ్రాచల వర రామదాసపోషా
పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా

పలుకే బంగారమాయెనా కోదండపాణి పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయె పిలచీన పలుకవేమి
కలలో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి
పలుకే బంగారమాయెనా పలుకే బంగారమాయెనా

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Dec-2010

లోకవీరం మహాపూజ్యం

గాత్రం: జేసుదాసు




లోకవీరం మహాపూజ్యం సర్వ రక్షాకరం విభుం
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామియే శరణమయ్యప్ప

విప్రపూజ్యం విశ్వవంధ్యం విశ్వశంభో ప్రియంసుతం
క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామియే శరణమయ్యప్ప

మత్తమాతంగ గమనం కారుణ్యామృతపూరితం
సర్వవిఘ్నహరందేవం శాస్తారం ప్రణమామ్యహమ్
స్వామియే శరణమయ్యప్ప

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

19-Dec-2010

ఆనంద్

గాత్రం: కె.యం.రాధాకృష్ణ,శ్రేయా ఘోషల్
సాహిత్యం; వేటూరి



పల్లవి:

నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూదిగుచ్చి సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌనరాగమేనా
చేరువైనా దూరమైన ఆనందమేనా
చేరువైనా దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

చరణం1:

మేఘమల్లే సాగివచ్చి
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచి
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టి
తీపిమంట రేపుతావు
పువ్వులాంటి గుండెలోన
దారమల్లే దాగుతావు
నేనేనా నీ రూపేనా

చేరువైనా దూరమైన ఆనందమేనా
చేరువైనా దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

చరణం2:

కోయిలల్లే వచ్చి ఏదో
కొత్తపాట నేర్పుతావు
కొమ్మగొంతులోన గుండె
కొట్టుకుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక ఎన్నెలల్లే నీవు
ఇసుక తిన్నె చేరుతావు
గసగసాల కౌగిలింత
గుసగుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా

చేరువైనా దూరమైన ఆనందమేనా
చేరువైనా దూరమైన ఆనందమేనా ఆనందమేనా ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా

~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

17-Dec-2010

ఎర్ర గులాబీలు

తారాగణం: కమల్‌హాసన్,శ్రీదేవి
గాత్రం: బాలు, జానకి
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: ఇళయరాజా
దర్శకత్వం: భారతీరాజా
నిర్మాత: బి.సీతారామయ్య
సంస్థ: కె.ఎస్.ఆర్.క్రియేషన్స్
విడుదల: 1979





పల్లవి:

ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో

ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది

చరణం1:

లతనై నీ జతనై నిన్నే పెనవేయనా
కతనై నీ కలనై నిన్నే మురిపించనా
నేనిక నీకే సొంతము
న న న న న నీకెందుకు ఈ అనుబంధము
న న న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నను కోరి
ఆశే రేపింది నీలో
అందం తొణికింది నాలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది

చరణం2:

పెదవిని ఈ మధువునూ నేడే చవిచూడనా
నాదని ఇక లేదనీ నీకే అందివ్వనా
వయసుని వయసే దోచేది
న న న న న న అది మనసుని నేడే జరిగేది
న న న న న న న న న న న న న నా

ఈ ఎర్రగులాబీ విరిసినది తొలిసారి నిను కోరి
ఆశే రేపింది నాలో
అందం తొణికింది నీలో
స్వర్గం వెలిసింది భువిలో
ఈ ఎర్రగులాబీ విరిసినది


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Dec-2010

అలీబాబా 40 దొంగలు

తారాగణం: ఎం.జి.రామచంద్రన్, భానుమతి
గాత్రం: భానుమతి
సాహిత్యం: ఆరుద్ర, తోలేటి వెంకటరెడ్డి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
దర్శకత్వం: టి.ఆర్.సుందరం
విడుదల: 1956




అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
మందార మకరందాలు అందెల్లో చిందిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
మందార మకరందాలు అందెల్లో చిందిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా

చరణం1:

మేలైన జాజిరోజా ఈ మెరుగే చూడండి
మేలైన జాజిరోజా ఈ మెరుగే చూడండి
ఎవరైనా చేరివస్తే మెరుగంతా మారునోయ్ ముళ్ళన్న్ని గుచ్చునోయ్
ఎవరైనా చేరివస్తే మెరుగంతా మారునోయ్ ముళ్ళన్న్ని గుచ్చునోయ్
ఓ ఓ ఓ ఓ ఈలేసి సైగ చేసే వేషాలు చాలునోయ్
ఈలేసి సైగ చేసే వేషాలు చాలునోయ్
ఈ వింత చేతలన్ని నా చెంత దాగవోయ్

అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
మందార మకరందాలు అందెల్లో చిందిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా

చరణం2:

వయ్యారి ఒంపులన్ని ఒలికించే రాణీనోయ్
వయ్యారి ఒంపులన్ని ఒలికించే రాణీనోయ్
ఆటంటే మోజులేదా అబలంటే మోజులా...అబలంటే మోజులా
ఆటంటే మోజులేదా అబలంటే మోజులా...అబలంటే మోజులా
కులకాంతను చేరదీసే పరకాంతదాసులోయ్
కులకాంతను చేరదీసే పరకాంతదాసులోయ్
తందానా పాట పాడి తైతక్కలాడేనే

అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా
మందార మకరందాలు అందెల్లో చిందిస్తా
అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా



||

13-Dec-2010

రాజా

గాత్రం: గోపాల్‌రావు,అనుపమ
సాహిత్యం: మూర్తి



పల్లవి:

షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి ఓల్ట్ల లుక్కు విస్కికీలేని కిక్కు
షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి ఓల్ట్ల లుక్కు విస్కికీలేని కిక్కు
నవ్వుల్లో మ్యూజిక్ మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ మ్యాజిక్
నవ్వుల్లో మ్యూజిక్ మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ మ్యాజిక్
అరెరెరే ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు
అరెరెరే ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు
షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి ఓల్ట్ల లుక్కు విస్కికీలేని కిక్కు

చరణం1:

టైటానిక్ షిష్‌లాంటి షేపున్న పాప మిస్ రుక్సానా
మేల్‌బోర్న్ అందాల పార్కునై ఏలుతున్నది సుల్తానా
మెర్క్యూరి మేని రంగులో ముద్దుగుందిరో ఈ జాణ
రేబాను కళ్లజోడులో రంజుగున్నది ఈ మైనా
ఆజా ఆజా మేరీజాన్‌ దిల్‌నేజా రాజా హిందుస్థాన్‌
ఆజా ఆజా మేరీజాన్‌ దిల్‌నేజా రాజా హిందుస్థాన్‌
అమ్మమ్మో కన్నె ట్యూబులు గుండెల్లో గుండుసూదులు
అరెరెరె ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు
అరెరెరె ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు

షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి ఓల్ట్ల లుక్కు విస్కికీలేని కిక్కు

చరణం2:

అందాలే వలకబోసి యమ కులుకుతున్న ఈ పోరీలు
స్వర్గంలో బోరుకొట్టి ఇటు షైర్ కొచ్చిన ప్యారీలు
వీ కూపన్‌ జీన్సు ప్యాంటులో స్టయులుగున్న ఈ లైలాలు
లుక్కేస్తే క్యూలు కట్టరా కుర్రకారు మా మజ్నూలు
ఆజా ఆజా మేరాజాన్ దిల్‌నేజా రాజా హిందుస్థాన్
ఆజా ఆజా మేరాజాన్ దిల్‌నేజా రాజా హిందుస్థాన్
అయ్యయ్యో ఓరి దేవుడో కళ్లెందుకు ఇచ్చినావురో
అరేరేరే ఈ నవాబుకే కౌగిలింతలు పెట్టిన గులాబులు
అరేరేరే ఈ నవాబుకే కౌగిలింతలు పెట్టిన గులాబులు

షేపు చూసి మొక్కు సయ్యంటే నీదే లక్కు
వెయ్యి ఓల్ట్ల లుక్కు విస్కికీలేని కిక్కు
నవ్వుల్లో మ్యూజిక్ మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ మ్యాజిక్
నవ్వుల్లో మ్యూజిక్ మ్యూజిక్ నడకల్లో మ్యాజిక్ మ్యాజిక్
అరెరెరే ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు
అరెరెరే ఈ నవాబుకే గిలిగింతలు పెట్టిన గులాబులు

||

10-Dec-2010

పెద్దన్నయ్య

గాత్రం: బాలు, చిత్ర



పల్లవి:

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారక
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ

చరణం1:

సిరికోయిల చిలిపి వలపే పాడేనమ్మ
ఎదలోయల కనులే కలలై పండేనమ్మ
నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ
నిదరోయిన సొగసే ఎదురై వలచేనమ్మ
మనసే మనువాడగా జతగా పెనవేయనా
ఊర్వశే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట
కంటికే దీపమై గగనము విడిచెను తారక

చరణం2:

సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ
మరమోలిక వలపై వగలే విసిరేనమ్మ
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ
జరిగే మన పెళ్ళికి జగమే విరిపల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారక
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Dec-2010

ఆనంద్

గాత్రం: లక్కి ఆలి
సాహిత్యం; వేటూరి



పల్లవి:

చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
రూపవతీ ఐ లవ్ యూ
నేను నీకే ఏకలవ్యు
a e i o u
అన్నీ ఐ లవ్ యూ
లవ్ యూ
లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ

చరణం1:

ఎదనే నీవు నిదురే లేపి ఎదురై నావు తొలిప్రేమల్లే
కునుకే రాని ఉలుకై తీపి కలవై నావు ఎదనీడల్లే
అడిగా నిన్ను వరమిస్తావా
విడిగా నన్ను వదిలేస్తావా
యస్ ఒర్ నో
యస్ ఒర్ నో

చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ

చరణం2:

ప్లవరై విచ్చి కలరే ఇచ్చి వికసించావు తొలిఊహల్లో
చెలిమై వచ్చి చెలిగా నచ్చి ఉసిగొల్పావు నడిజాముల్లో
క్షణమే నేను యుగమౌతావా
సఖివై నాకు సగమౌతావా
యస్ ఒర్ నో
యస్ ఒర్ నో

చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
రూపవతీ ఐ లవ్ యూ
నేను నీకే ఏకలవ్యు
a e i o u
అన్నీ ఐ లవ్ యూ
లవ్ యూ
లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ
చారుమతీ ఐ లవ్ యూ
చంద్రముఖీ ఐ లవ్ యూ

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~

శుభవేళ

తారాగణం:రవికాంత్,అనసూయ
గాత్రం:దీప్తి,నిత్య
సంగీతం:ఆర్.పి.పత్నాయక్
సాహిత్యం:కులశేఖర్
నిర్మాత:రామోజీరావు
దర్శకత్వం:రమణ
సంస్థ:ఉషాకిరణ్ మూవీస్
విడుదల: 2000



పల్లవి:

శ్రీరామ నవమి తిరనాళ్ళు నాకప్పుడేమో ఆరేళ్ళు
నేనడగగానే ఈ బొమ్మ ముచ్చటగ కొంది మా బామ్మ
అప్పుడు దీని ఖరీదెంతో తెలుసా?
పది రూపాయలు
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం1:

నా వయసు అపుడు పది కామోసు
మేమంతా వెళ్ళాం మదరాసు
పాండిబజారను మాయాబజారులో
ఈ జడ కుచ్చులు పాపిట బిళ్ళలు చెవి జూకాలు రవ్వల గాజులు
ఎన్నో కొన్నది వెన్నంటి మనసు అమ్మది
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా?
మరో రెండు సున్నాలు
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం2:

నా కప్పుడేమో టీనేజి
పక్కూరిలోనే కాలేజి
నా కప్పుడేమో టీనేజి
పక్కూరిలోనే కాలేజి
వెళ్ళి రావటానికి రాలి సైకిలు
వేసుకోవటానికి కొత్త చెప్పులు
పట్టు పావడాలు చోళీ గాగ్రాలు
ఎన్నో కొన్నారు మా మంచి నాన్నారు
అప్పుడు వీటి ఖరీదెంతో తెలుసా? మరో సున్నా
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం

చరణం3:

పెళ్ళీడు కొచ్చావన్నారు
కుర్రాడ్ని తీసుకొచ్చారు
నచ్చాడా అని అడిగారు
కాబోయే మొగుడన్నారు
కట్నం గా పది లక్షలంట
నగా నట్రా పొలం గట్రా ఇవ్వాలంట
తీరా అన్ని ఇచ్చాక
నేను కూడా వారి వెంట పుట్టిల్లు వదిలి వెళ్ళాలంట

చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
మొగుడికోసం బొల్డు డబ్బు పోసాం
రాను అంటే ఎందుకూరుకుంటాం
ఇదేమి రూలు ఇదేమి న్యాయం
చూసారా ఈ విడ్డూరం
చిన్ననాటి నుంచి ఎన్ని కొన్నాం
డబ్బులిచ్చాం వెంట తీసుకొచ్చాం
ఎన్ని చెప్పినా నేను తాళి కడతా
అత్తారింటికి నిన్ను తీసుకెళ్తాం


||

06-Dec-2010

అల్లరి ప్రియుడు

గాత్రం: బాలు,చిత్ర



పల్లవి:

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా
గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు మాకుమాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ

చరణం1:

పువ్వులెన్నొ విచ్చినట్టుగా చెలి నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నో పుట్టినట్టుగా ప్రియా చూపుతొనే పట్టు కౌగిలి
ఖవాలీల కన్నులతోనే జవానీల జాబులు రాసే
జగడమొకటి సాగించోయమ్మో
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే మాలగా
దోరసోకు తోరణాలు కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసిన

ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
నిజానికి ఇదంత ఒట్టి నీదయ

చరణం2:

సమ్ముఖాన రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అరే అందగత్తె గొప్పకాదులే
పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నొ కవ్విస్తుంటే హృదయమొకటి పుట్టిందోయమ్మ
సరాగాల సంపెంగల్లో పరాగాల పండిస్తుంటే పరువమొకటి వచ్చే వాంఛలా
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడి
జుంటితేనెపట్టులోన కొంటె వేణువూదిన

గీత గోవిందుడు వీనులా విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజాకు మాకుమాలయ
నిజానికి ఇదంత ఒట్టి నీదయ
ఉత్తరాల ఉర్వశి ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా

||

04-Dec-2010

అల్లావుద్దీన్ అద్భుత దీపం

తారాగణం: నాగేశ్వరరావు, అంజలీదేవి, రాజసులోచన
గాత్రం: ఏ.ఎం. రాజా, పి. సుశీల
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు, ఎస్. హనుమంతరావు
దర్శకత్వం: టి.ఆర్.రఘునాధ్
సంస్థ: జైశక్తి పిక్చర్స్
విడుదల: 1957




పల్లవి:

అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో
అందాల కోనేటిలోన చిందింది ఈ పూలతేనే
మధురాతి మధురం ఆనందభరితం
అనవరతం అనురాగం మనకోసమే

చరణం1:

సాగేటి మన నావపైన వీచేటి చిరుగాలి ప్రేమ
ఆ ఆ సాగేటి మన నావపైన వీచేటి చిరుగాలి ప్రేమ
చుక్కాని నీవే నా చక్కనయ్య
చుక్కాని నీవే నా చక్కనయ్య
అదిగదిగో కనిపించు ఏ తీరమో
అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో

చరణం2:

వినిపించును హృదయగీతములే
వినిపించును హృదయగీతములే
కనిపించును అమరలోకములే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఇట మమతలు విరిసి పూసినవే
ఇట మమతలు విరిసి పూసినవే
విరికన్నెలు తలలు ఊపినవే
విరికన్నెలు తలలు ఊపినవే
ఫలియించును జీవనరాగమే
ఫలియించును జీవనరాగమే
ఈ ప్రేమ వనాలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఫలియించును జీవనరాగమే
ఫలియించును జీవనరాగమే
ఈ ప్రేమ వనాలలో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ

చరణం3:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
గిరిపైన పొగమంచు విడిపోయి కాంతులు తోచే
మదిలోన ఆశలు లేచే ఏ ఏ ఏ
చలిలోన ఊగు తీగె ఎలమావి ఊహలింతే ఆ ఆ ఆ ఆ
చలిలోన ఊగు తీగె ఎలమావి ఊహలింతే
ఇక ఏనాటికైనా ఎడబాటులేని ఆనందమిదియేగా
ఇక ఏనాటికైనా ఎడబాటులేని ఆనందమిదియేగా ఆ ఆ ఆ ఆ ఆ ఆ
గిరిపైన పొగమంచు విడిపోయి కాంతులు తోచే
మదిలోన ఆశలు లేచే ఏ ఏ ఏ

అందాల కోనేటిలోన సాగింది స్వప్నాల నావ
చిరుగాలి వీచే కెరటాలు లేచే
పరుగిడెరా మన పడవ ఏ సీమకో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

02-Dec-2010

ఆనంద్

గాత్రం: శ్రేయాఘోషల్
సాహిత్యం: వేటూరి



పల్లవి:

వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా

చరణం1:

పిల్లపాపలా వాన
బుల్లిపడవలా వాన
చదువు బాధలే తీర్చి
సెలవలిచ్చిన వాన
గాలివాన కబాఢ్డీ
వేడి వేడి పకోడి
ఈడుజోడి ఢీ ఢీ ఢీ
తోడుండాలి ఓ లేడి
ఇంద్ర ధనస్సులో తళుకుమనే ఎన్ని రంగులో
ఇంతి సొగసులే తడసినవి నీటి కొంగులో
శ్రావణమాసాలా జల తరంగం
జీవన రాగాలకిది ఓ మృదంగం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా

చరణం2:

కోరివచ్చినా ఈ వాన
గోరు వెచ్చెనై నాలోన
ముగ్గులా సిగ్గు ముసిరేస్తే
ముద్దులాటిదే మురిపాలా
మెరిసే మెరిసే అందాలు
తడిసే తడిసే పరువాలు
గాలివానలా పందిళ్ళు
కౌగిలింతలా పెళ్ళిళ్ళు
నెమలి ఈకలో ఉలికిపడే ఎవరి కన్నుల్లో
చినుకు చాటునా చిటికెలతో ఎదురుచూపులో
నల్లని మేఘాలా మెరుపులందం
తీరని దాహంలా వలపు పందెం

కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా
వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా
గిచ్చే గిచ్చే పిల్ల గాలుల్లారా
కళ్ళలోన పొంగుతున్న బాధలెన్నో మాకున్నాయ్
గుండెలోన దాచుకున్న గాధలెన్నో మాకున్నాయ్
తీరుస్తారా బాధ తీరుస్తారా
గాలివాన లాలి పాడేస్తారా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~