29-Apr-2011

గోదావరి

గాత్రం: సునీత
సాహిత్యం: వేటూరి



పల్లవి:

అందంగా లేనా అసలేం బాలేనా అంత లెవలేంటోయ్ నీకు
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

చరణం1:

కనులు కలపవాయే మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే మాటవరసకే
కలికి చిలకలాగే కలత నిదురలాయే
మరువలేక నిన్నే మధన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించవేలా
నువ్వొచి అడగలి అన్నట్టు నే బెట్టు చేసాను ఇన్నాళ్ళుగా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

చరణం2:

నీకు మనసు ఇచ్చా ఇచ్చినపుడె నచ్చా
కనుల కబురు తెచ్చా తెలుసు నీకదీ
తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు
మహా తెలియనట్టు నటనలే అవీ
ఎన్నెల్లో గోదారి వెన్నెల్లో నన్ను
తరగల్లె నురగల్లె ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా

అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా అసలేమీ కానా వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా అసలేం బాలేనా నీ ఈడు జోడు కాననా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

27-Apr-2011

ఆస్తిపరులు

గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: ఆత్రేయ




పల్లవి:

అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది
అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

చరణం1:

అందుకే నేనది పొందినది, అందనిదైనా అందినది
పొందిన పిదపే తెలిసినది నేనెందుకు నీకు అందినది
అందుకే నేనది పొందినది, అందనిదైనా అందినది
పొందిన పిదపే తెలిసినది నేనెందుకు నీకు అందినది

అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

చరణం2:

వలచుటలో గొప్పున్నది, నిన్ను వలపించుటలో మెప్పున్నది
పరువములో పొగరున్నది అది పరవశమైతే సొగసున్నది
వలచుటలో గొప్పున్నది, నిన్ను వలపించుటలో మెప్పున్నది
పరువములో పొగరున్నది అది పరవశమైతే సొగసున్నది

అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

చరణం2:

నాలో నేనే ఉన్నది
అది నువ్వేలే కనుగొన్నది
ఇద్దరిలో అహమున్నది
మన ఒద్దికలో ఇహమున్నది

అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది
ఒక్కరికే తెలిసినది నీ మక్కువలో ఒకటుంది

||

25-Apr-2011

త్రిశూలం

గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: ఆత్రేయ




పల్లవి:

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

చరణం1:

చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు
చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు
నా ఆశకు రూపం నీవై
నా ఆశయదీపం నీవై
నా ఆశకు రూపం నీవై
నా ఆశయదీపం నీవై
నీవు నేను మనమౌదాం
నీవు నేను మనమౌదాం
మనమే మనకొక మతమౌదాం

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

చరణం2:

జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను
భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను
ఈ మమతకు శృతినే నేను
ఈ నడతకు లయనే నేను
ఈ మమతకు శృతినే నేను
ఈ నడతకు లయనే నేను
నేను నేనను ఇద్దరము
నేను నేనను ఇద్దరము
నిన్న రేపటి సంగమము

వెలుగుకు ఉదయం
చెలిమికి హృదయం
నొసటికి తిలకం
కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా
జన్మజన్మల ఋణాలుగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

22-Apr-2011

బాల ఏసు

తారాగణం: విజయకాంత్, రాజేష్, శ్రీకాంత్, సరిత, దీప
గాత్రం: బాలు,వాణి జయరాం
సాహిత్యం: అమ్మిరాజు
సంగీతం: శ్యాం
దర్శకత్వం: కె.తంగప్పన్
విడుదల: 1984



పల్లవి:

ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం
ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం
బాల యేసుని హృది నమ్మిన మన జీవితం ప్రణయాలయం
మోగాలిదే నవరాగం పాడే బ్రతుకే సుఖమయం
ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం

చరణం1:

అధర మధుర మధుర సుధల రసనిధి పొంగెనే
హృదయం మునుగును
అధర మధుర మధుర సుధల రసనిధి పొంగెనే
హృదయం మునుగును
యవ్వనరాగం వినలేదా నీవే నాలో నిలిచావు
యవ్వనరాగం వినలేదా నీవే నాలో నిలిచావు
ప్రియ కన్నులలో పూర్ణ చంద్రోదయం
నా చెలి చూపులే వెన్నెల వానలు
వలపులు కురిసే మోగనరాగం
ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం

చరణం2:

కలలు కరిగి కోర్కె రగిలి నా మది చెదిరేనే బాల యేసు దేవా
కలలు కరిగి కోర్కె రగిలి నా మది చెదిరేనే బాల యేసు దేవా
వెలుగులు చిందును ఈ జ్యోతి అదియే లోకానికాధారం
వెలుగులు చిందును ఈ జ్యోతి అదియే లోకానికాధారం
నా మెడ నిండెను ఒక రోజామాల
ఇది ఊహించని మహ విచిత్రమే
ఇదియే దేవుని అద్భుతలీల

ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం
బాల యేసుని హృది నమ్మిన మన జీవితం ప్రణయాలయం
మోగాలిదే నవరాగం పాడే బ్రతుకే సుఖమయం
ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం
ఏసు దివ్యాలయం దీనుల శరణాలయం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

20-Apr-2011

రాజా

తారాగణం: వెంకటేష్,సౌందర్య,అబ్బాస్
గాత్రం: బాలు
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: ఎస్.ఏ.రాజ్‌కుమార్
నిర్మాత: ఆర్.బి.చౌదరి
దర్శకత్వం: ముప్పలనేని శివ
సంస్థ: సూపర్‌గుడ్ ఫిలింస్
విడుదల: 1999




పల్లవి:


ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా

చరణం1:

వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే
పూచే పూవ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే
తూరుపుకాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే
తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం
చిలకముక్కులా నీ అలక జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా

చరణం2:

మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే
ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే
కోవెలలోని దీపంలా నీ రూపం జ్ఞాపకమే
పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం
మరపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా
నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా
నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
ఎదలో నిదురించే కధలెన్నో కదిలేలా

||

18-Apr-2011

ఇంటికి దీపం ఇల్లాలే

తారాగణం: రామారావు, జగ్గయ్య, బి.సరోజాదేవి
గాత్రం: సుశీల
సాహిత్యం: ఆత్రేయ
సంగీతం: విశ్వనాథం, రామమూర్తి
సంస్థ: ఆర్.ఆర్.పిక్చర్స్
దర్శకత్వం: రామన్న
విడుదల: జనవరి 26,1961



పల్లవి:

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం
వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం
హృదయములు నయనములు ఏకమాయనే
మా ఇరువురికి భేదమింక లేకపోయేనే
వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం

చరణం1:

వచ్చెనులే నిల్చెనులే వాకిలిముందు
కాంచితిని కాంచితిని కన్నుల విందు
ఓహో హో హో హో ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వచ్చెనులే నిల్చెనులే వాకిలిముందు
కాంచితిని కాంచితిని కన్నుల విందు
నా జడలో పువ్వులను తురిమెద నేనే
నా నొసట తిలకమునే దిద్దేద నేడే
వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం

చరణం2:

అతడే నా పతి అనుచు పాట పాడుతా
అతని డెందమున అందముగా నటనమాడుతా
ఆ ఆ అతడే నా పతి అనుచు పాట పాడుతా
అతని డెందమున అందముగా నటనమాడుతా
వివరముగా తెలుపుటకే సమయము కాదు
ఆ విషయముల తీరికగా తెలిపెద నీకు

వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం
హృదయములు నయనములు ఏకమాయనే
మా ఇరువురికి భేదమింక లేకపోయేనే
వినుము చెలి తెలిపెదనే పరమ రహస్యం
అది మరి ఎవరు తెలియరాని మధుర రహస్యం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

15-Apr-2011

రాము

గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం1:

చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నీవే సుమా
చల్లని పలుకుల తల్లి
చక్కని నవ్వుల తండ్రి
కమ్మని నోముల పంట నీవే సుమా
ఇద్దరి బుగ్గల మీదా ముద్దుల మూటలు కడితే
ఇంపుగ నిదుర పోవాలి జో జో జో

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

చరణం2:

వలపుల చిలక అదిగో
పలకని చిలక ఇదిగో
చిలక రాజు మదిలో సుఖమేది
వలపుల చిలక అదిగో
పలకని చిలక ఇదిగో
చిలక రాజు మదిలో సుఖమేది
దేవతవంటిది తల్లి ఇచ్చిన పెన్నిధి నీవే
జీవించాలి నీకై నా తండ్రి
జీవించాలి నీకై నా తండ్రి

పచ్చని చెట్టు ఒకటి
వెచ్చని చిలకలు రెండు
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో
పాటలు పాడి జోకొట్టాలి జో జో జో

~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~

13-Apr-2011

గోదావరి

గాత్రం: గాయత్రి
సాహిత్యం: వేటూరి



పల్లవి:

నీల గగన ఘనవి చలన ధరణిజా శ్రీ రమణ
మధుర వదన నళిన నయన మనవి వినరా రామ

రామ చక్కని సీతకీ అరచేత గోరింట
ఇంత చక్కని చుక్కకీ ఇంకెవరు మొగుడంట
రామ చక్కని సీతకీ

చరణం1:

ఉడత వీపున వేలు విడిచిన పుడమి అల్లుడు రాముడే
ఎడమ చేతను శివుని విల్లును ఎత్తిన ఆ రాముడే
ఎత్తగలడా సీత జడను తాళి కట్టే వేళలో
రామ చక్కని సీతకీ

చరణం2:

ఎర్ర జాబిలి చేయి గిల్లి రాముడేడని అడుగుతుంటే
చూడలేనని పెదవి చెప్పే చెప్పలేమని కనులు చెప్పే
నల్లపూసై నాడు దేవుడు నల్లని రఘురాముడు
రామ చక్కని సీతకీ

చరణం3:

చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా
నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచె
చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా

రామ చక్కని సీతకీ ఆర చేత గోరింట
ఇంత చక్కని చుక్కకి ఇంక ఎవరు మొగుడంట
రామ చక్కని సీతకీ

ఇందువదన కుందరదన మందగమన భామా
ఎందువలన ఇందువదన ఇంత మదన ప్రేమా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

11-Apr-2011

ఉయ్యాల జంపాల

గాత్రం: పి.లీల
సాహిత్యం: ఆరుద్ర




పల్లవి:

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు
ఎందువలన దేవుడు

చరణం1:

తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తండ్రి మాటకై పదవుల త్యాగమే జేసెను
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం2:

అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అనుభవించదగిన వయసు అడవిపాలు జేసెను
అడుగు పెట్టినంత మేర ఆర్యభూమి జేసెను
అందాల రాముడు అందువలన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు

చరణం3:

ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మపత్ని చెర బాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకాసతినే వీడెను
అందాల రాముడు అందువలన దేవుడు

అందాల రాముడు ఇందీవర శ్యాముడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు
ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
అందాల రాముడు, అందాల రాముడు
ఇందీవర శ్యాముడు, ఇందీవర శ్యాముడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు
అందాల రాముడు ఇందీవర శ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఇలలో మన దేవుడు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

08-Apr-2011

రాజా

గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి:

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నాఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

చరణం1:

అమ్మా అని పిలిచే తొలి పలుకులు జ్ఞాపకమే
రా అమ్మా అని అమ్మే లాలించిన జ్ఞాపకమే
అమ్మ కళ్లలో అపుడపుడు చెమరింతలు జ్ఞాపకమే
అమ్మ చీరనే చుట్టే పాప జ్ఞాపకం
అమ్మ నవ్వితే పుట్టే సిగ్గు జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

చరణం2:

గుళ్లో కధవింటూ నిదురించిన జ్ఞాపకమే
బళ్లో చదువెంతో బెదిరించిన జ్ఞాపకమే
గవ్వలు ఎన్నో సంపాదించిన గర్వం జ్ఞాపకమే
నెమలి కళ్లనే దాచే చోటు జ్ఞాపకం
జామ పళ్లనే దోచే తోట జ్ఞాపకం

ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా
నాచూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా
నాఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా
జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు
జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు
ఏదో ఒకరాగం పిలిచిందీ వేళ
నాలో నిదురించే గతమంతా కదిలేలా

||

06-Apr-2011

ఆస్తిపరులు

గాత్రం: ఘంటసాల
సాహిత్యం: ఆత్రేయ



పల్లవి:

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతర
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతర
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రారా

చరణం1:

దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
దోరవయసు అలవి కాని భారమయింది
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
నడుములేని నడకే ఒక నాట్యమయింది
చూచి చూచి బావ మనసు సొమ్మసిల్లింది సొమ్మసిల్లింది

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతర
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రారా

చరణం2:

అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
అత్తకూతురంటేనే హక్కు ఉందిలే
అల్లరెంత చేసినా చెల్లుతుందిలే
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ముక్కు తాడు వేయువేళ ముంచుకొచ్చు సిగ్గులో
ఇంత అత్త కూతురూ కొత్త పెళ్ళి కూతురే కొత్త పెళ్ళి కూతురే

మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా
ముందు ముందు ఉందిలే సంబరాల జాతర
మిడిసి పడకు మిడిసి పడకు అత్త కూతురా రారా

||

04-Apr-2011

పెద్దన్నయ్య

తారాగణం: బాలకృష్ణ, రోజా, ఇంద్రజ
గాత్రం: బాలు, చిత్ర
సంగీతం: కోటి
దర్శకత్వం: శరత్
నిర్మాత: నందమూరి రామకృష్ణ
సంస్థ: రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోస్
విడుదల: 1997



పల్లవి:

కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
విరబూసిన మమతలకు కలబోసిన మనసులుకు
విరబూసిన మమతలకు కలబోసిన మనసులుకు
మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం
అచ్చమైన ప్రతిబింబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం

చరణం1:

తీపి తీపి దరహాసాలు హా
చేదు చేదు పరిహాసాలు
పులుపు పులుపు బులపాటాలు
వగరు వగరు గుణపాఠాలు
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
ఈ ఉగాది రుచులై మాయని అభిరుచులై
నిలిచిన ఆనంద మందిరం
నిలిచిన ఆనంద మందిరం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం

చరణం2:

అమ్మంటే ఎవరో కాదూ అనురాగ మణిదీపమే
అన్నంటే ఎవరో తెలుసా ఆ రాముని మరోరూపమే
తమ్ముల్లే తోడుగా నిత్యం కళకళలాడగా
తమ్ముల్లే తోడుగా నిత్యం కళకళలాడగా
ఈ ఇళ్ళే పూర్ణకుంభం
ఈ ఇళ్ళే పూర్ణకుంభం

కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం
విరబూసిన మమతలకు కలబోసిన మనసులుకు
విరబూసిన మమతలకు కలబోసిన మనసులుకు
మచ్చలేని మనుషులకు అచ్చమైన ప్రతిబింబం
అచ్చమైన ప్రతిబింబం
కుటుంబం అన్నగారి కుటుంబం
కుటుంబం అన్నగారి కుటుంబం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~