31-Oct-2011

విచిత్రబంధం

గాత్రం: రామకృష్ణ (తొలి పాట), సుశీల



పల్లవి:

వయసే ఒక పూల తోట
వలపే ఒక పూల బాట
ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట
పాడాలి తీయని పాట
వయసే ఒక పూల తోట
వలపే ఒక పూల బాట
ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట
పాడాలి తీయని పాట

చరణం1:

పాలబుగ్గలు ఎరుపైతే హ
లేత సిగ్గులు ఎదురైతే హ హ
పాలబుగ్గలు ఎరుపైతే ఆ
లేత సిగ్గులు ఎదురైతే
రెండు మనసులు ఒకటైతే
పండువెన్నెల తోడైతే
రెండు మనసులు ఒకటైతే
పండువెన్నెల తోడైతే
కోరికలే తీరేనులే
పండాలి వలపుల పంట
పండాలి వలపుల పంట

చరణం2:

ఈ కంటి కాటుక చీకటిలో
పగలు రేయిగ మారెనులే
ఈ కంటి కాటుక చీకటిలో
పగలు రేయిగ మారెనులే
నీ కొంటె నవ్వుల కాంతులలో
రేయి పగలై పోయెనులే
నీ కొంటె నవ్వుల కాంతులలో
రేయి పగలై పోయెనులే
నీ అందము నాకోసమే
నీ మాట ముద్దులమూట
నీ మాట ముద్దులమూట

చరణం3:

పొంగిపోయే పరువాలు హ
నింగినంటే కెరటాలు హ హ
పొంగిపోయే పరువాలు ఆ
నింగినంటే కెరటాలు
చేరుకున్నవి తీరాలు
లేవులే ఇక దూరాలు
చేరుకున్నవి తీరాలు
లేవులే ఇక దూరాలు
ఏనాటికి మనమొక్కటే
ఒక మాట ఇద్దరినోట
ఒక మాట ఇద్దరినోట

వయసే ఒక పూల తోట
వలపే ఒక పూల బాట
ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట
పాడాలి తీయని పాట

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

28-Oct-2011

పందెం కోడి

తారాగణం: విశాల్, మీరా జాస్మిన్
గాత్రం: రఘు కుంచె, నాగసాహితి
సాహిత్యం: వెన్నెలకంటి
సంగీతం: యువన్ శంకర్ రాజా
నిర్మాత: విక్రం కృష్ణ
దర్శకత్వం: లింగుసామి
సంస్థ: జి.కె.ఫిలిం కార్పోరేషన్
విడుదల: 2006



పల్లవి:

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత
తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత
ఆ పరువం దోచుకుపోతా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను
పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

చరణం1:

అందమిది అందమిది వచ్చే పందెంకోడిలా
పొంగినది పొంగినది పచ్చి పాల ఈడులా
సందెపొద్దు వేళలోన సన్నజాజి పువ్వులా
అందమంత ఆరబోసి నీకు హారతివ్వనా
వచ్చే వచ్చే వలపే నా మనసులోని పులుపే
ఆశ పడ్డ తలపే నా ఎదలో మోజు తెలిపే
ఇంతకుమించి ఇంతకుమించి ఏదో ఉందిలే
కలికి కులుకు తళుకుబెళుకులొలుకుతున్నాది
ఆ చిలక బుగ్గ మొలక మొగ్గ విచ్చుకున్నాది

చరణం2:

కన్నె ఇది కన్నె ఇది కన్ను కొట్టమన్నది
వన్నె ఇది వన్నె ఇది వెన్ను తట్టమన్నది
పరికిణి కట్టుకు వచ్చెను పరువాల జాబిల్లి
పదునైన సోకుగని ఎదకేదో ఆకలి
కనులు పాడే జోల ఇది దేవలోకబాల
కలలు కనే వేళ ఇది కలువపూల మాల
ఏటవాలు చూపులేసి లాగింది నా గుండెని
కంది చేను చాటుకొస్తే కలుసుకుంటాలే
ఈ అందగాడి ఆశలన్ని తెలుసుకుంటాలే

ఓణి వేసిన దీపావళి వచ్చెను నా ఇంటికి
చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి
ఆటే దాగుడుమూత
తన పాటే కోయిల కూత
మనసే మల్లెల పూత
ఆ పరువం దోచుకుపోతా
ముచ్చట ముచ్చట ముద్దూముచ్చట ఆడుకోవాలి
అచ్చికబుచ్చికలాడుకుంటు కలుసుకోవాలి
వెచ్చగ వెచ్చగ వయసు విచ్చెను
పుచ్చుకుపోరా కమ్మగా
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే
రేయి ఏదో పగలు ఏదో తెలియలేదులే
ఈ హాయిలోన మనసు నేడు కరిగిపోయెలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

26-Oct-2011

మామగారు

గాత్రం: బాలు, స్వర్ణలత
సాహిత్యం: సిరివెన్నెల



పల్లవి:

ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఏనాడు ఎళ్లిపోని దీపావళి
ఏరి కోరి ఎంచుకొంది మా లోగిలి
ఏల ఏల చుక్కల్లో ఎలుగలన్ని ఎదజల్లి
మా ఇంట ఎలిశాడు ఆ జాబిలి
ఏల ఏల చుక్కల్లో ఎలుగలన్ని ఎదజల్లి
మా ఇంట ఎలిశాడు ఆ జాబిలి
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి

చరణం1:

అలాంటిలాంటిటోడుగాదు మా అల్లుడుగారు
కోటికొక్కడుంటాడా ఇలాంటి మంచివాడు
అలాంటిలాంటిటోడుగాదు మా అల్లుడుగారు
కోటికొక్కడుంటాడా ఇలాంటి మంచివాడు
కొండంత పెద్ద మనసు కలిగినోడు
గోరంత పేదగూటికొచ్చినాడు
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకల్లే
ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస
ఆ ఇంటి దీపాళి పండగంట
ఇట్టాంటి అల్లుడొస్తే ప్రతి అమాస
ఆ ఇంటి దీపాళి పండగంట
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి

చరణం2:

మాయ మర్మం లేనివాడు మా మామగారు
మట్టిలోని మాణిక్యం మా ఆడవారు
గుండెల్లోన పెంచినాడు నన్ను కన్నవాడు
గుండెను గుడి చేస్తాడు కట్టుకున్నవాడు
మమకారమన్నది ఇంటి పేరు
పెట్టి పుట్టనోళ్లు దీన్ని పొందలేరు
సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి
సిరులేవీ కొనలేనిది సరిలేని ఈ పెన్నిధి
ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస
ఆ ఇంటి దీపావళి పండగంట
ఇట్టాంటి నవ్వులుంటె ప్రతి అమవాస
ఆ ఇంటి దీపావళి పండగంట

ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఇయ్యాలె అచ్చమైన దీపావళి
వెయ్యేళ్లు నిత్యమైన దీపావళి
ఏనాడు ఎళ్లిపోని దీపావళి
ఏరి కోరి ఎంచుకొంది మా లోగిలి
ఏల ఏల చుక్కల్లో ఎలుగలన్ని ఎదజల్లి
మా ఇంట ఎలిశాడు ఆ జాబిలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

24-Oct-2011

తోడూ నీడా

గాత్రం: సుశీల



పల్లవి :

ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు
నేనేమైపోయాను ఉన్నాను నీడై ఉన్నాను మీ నీడై ఉన్నాను
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు
నేనేమైపోయాను ఉన్నాను నీడై ఉన్నాను మీ నీడై ఉన్నాను
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు

చరణం1:

తనువు విడలిపోయినా తలపు విడిచిపోలేదు
కనుల ఎదుట లేకున్నా మనసు నిండి ఉన్నాను
తనువు విడలిపోయినా తలపు విడిచిపోలేదు
కనుల ఎదుట లేకున్నా మనసు నిండి ఉన్నాను
వేరొక రూపంలో చేరవచ్చినని నేనే
కన్నులుండి కానలేక కలతపడుట ఏలనో ఏలనో

ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు
నేనేమైపోయాను ఉన్నాను నీడై ఉన్నాను మీ నీడై ఉన్నాను
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు

చరణం2:

నన్నింకా మరువలేక నలిగి నలిగిపోతారా
నమ్ముకున్న కన్నె బ్రతుకు నరకంగా చేస్తారా
నన్నింకా మరువలేక నలిగి నలిగిపోతారా
నమ్ముకున్న కన్నె బ్రతుకు నరకంగా చేస్తారా
మరచిపొండి మమతలన్ని మరిచిపొండి గతాన్ని
ఎదను రాయి చేసుకొని ఏలుకోండి ఆ సతిని మీ సతిని

ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు
నేనేమైపోయాను ఉన్నాను నీడై ఉన్నాను మీ నీడై ఉన్నాను
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు
నేనేమైపోయాను ఉన్నాను నీడై ఉన్నాను మీ నీడై ఉన్నాను
ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

21-Oct-2011

పౌర్ణమి

గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి



పల్లవి:

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి
కో అంటూ కబురు పెడితే రగిలే కొండగాలి
ఓ అంటూ కరిగి రాదా నింగే పొంగి పొరలి
ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

చరణం1:

తనలో చినుకే బరువై కరిమబ్బే వదిలినా
చెరలో కునుకే కరవై కలవరమే తరిమినా
వనమే నన్ను తన ఒడిలో అమ్మై పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నదని
నెమ్మదిగా నా మదికి నమ్మకమందించిందెరో ఎవరో

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఎటుగా సాగాలి అని ఏరు ఎవరినడగాలి

చరణం2:

వరసే కలిపే చనువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరే జాలితో
ఎపుడో కన్న తీపికల ఎదురౌతుంటే దీపికలా
శిలలో ఉన్న శిల్పకళ నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకో ముందడుగో సంగతి అడిగి వారెవరో ఎవరో

~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

19-Oct-2011

వాన

గాత్రం: కార్తీక్
సాహిత్యం: సీతారామశాస్త్రి




పల్లవి:

ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశగంగా

చరణం1:

ముగిసిన కథగా
మిగలని స్మృతిగా
కదలవె త్వరగా
కడలికి జతగా
ఈ మంచుకొండను విడిచి వెళ్ళాలిగా

ఆకాశగంగా నిన్ను ఆపలేనే ఇంక
ఆకాశగంగా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

17-Oct-2011

అభిమానవంతులు

గాత్రం: వాణి జయరాం (తొలి పాట)
సాహిత్యం: సి.నారాయణరెడ్డి



పల్లవి:

ఎప్పటివలెకాదురా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా
ఈ ముద్దు ఈ మురిపమే పొద్దు ఎరుగములేరా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా

చరణం1:

పున్నమి కళలన్ని మోమున ముడిచి
అమృత మాధురులు అధరాన దాచి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పున్నమి కళలన్ని మోమున ముడిచి
అమృత మాధురులు అధరాన దాచి
నిన్నలేని రమణీయ రూప
నవనీత కాంతితో ఉన్నానురా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
అభినయం నాదిరా అనుభవం నీదిరా
చిలుక కులుకులో పలుక పలుకులో
లలితరాగమును చిలకరించెరా
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా

చరణం2:

పదును చూపుతో మదనుని కవ్వించి
చిగురు నవ్వుతో కథలను రగిలించి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
పదును చూపుతో మదనుని కవ్వించి
చిగురు నవ్వుతో కథలను రగిలించి
అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
లాలనం నాదిరా పాలనం నీదిరా
లాలనం నాదిరా పాలనం నీదిరా
వసంత వేళల రసైక లీలల
నిశింకముల పరవశించెరా

ఎప్పటివలె
ఎప్పటివలెకాదురా నా స్వామి ఎప్పటివలెకాదురా
సా నినిసని ని దసనిద
మమదగ దగమమ నినిదగ నినినిని గరిస నిదని గమదనిరిస
ఎప్పటివలెకాదురా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

14-Oct-2011

జయమ్ము నిశ్చయమ్మురా

తారాగణం: రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,సుమలత,అవంతి
గాత్రం: బాలు,సుశీల
సాహిత్యం: జొన్నవిత్తుల
సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం: జంధ్యాల
నిర్మాత: జి.వి.హెచ్.ప్రసాద్
సంస్థ: సుదర్శన్ పిక్చర్స్
విడుదల: 1990




పల్లవి:

అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
చలిలో రేగును సెగలే,ఎదలో మోగును లయలే
ఇది పెళ్లికి పిచ్చికి నడుమ విచిత్రం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
మనసే మమతకు జోడై,మమతే మనిషికి నీడై
ఇటు సాగిన స్నేహమె మైత్రికి అందం
అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ ఓ ఓ మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం

చరణం1:

కోటినవ్వుల గూటిగువ్వవు
గోట మీటగానే మోగు వీణవు
కోమలి కో అంటే ఆరును ఎదమంట
భామిని నో అంటే బాధలు మొదలంట
సరి అనవా వరమిడవా
సరసన నవరసమధురసమీవా

మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం
ఓ ఓ ఓ అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం

చరణం2:

మండుటెండలో మంచుకొండవై
స్నేహసుధలలోన భాగమందుకో
ఒంటరి మనుగడలో ఊరట కలిమేలే
బాధల సుడివడిలో బాసట బలిమేలే
వేడుకలో వేదనలో తోడుగ నిలిచెడి స్నేహమె సంపద

అభిమతమో అభినయమో ఈ ప్రేమ చతురాతి చతురం
ఓ ఓ ఓ మధుకలశం హిమశకలం మన చెలిమి మధురాతి మధురం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

07-Oct-2011

రోజాపూలు

తారాగణం: శ్రీరాం, ఆకాష్, భూమిక
గాత్రం: మనో
సంగీతం: రమణి భరద్వాజ్
దర్శకత్వం: శశి
సంస్థ: త్రిమూర్తి ఫిలింస్
విడుదల: 2002



పల్లవి:

యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా

యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా
నవ్వుతూ మత్తు జల్లి దూరమై పోవద్దే
ఇలా నీవెంట వస్తే ఎవరు నువు అనవద్దే
ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే

చరణం1:

మనసున తలచి కళ్ళను మూసి కల కన్నాను కనపడలా
మౌనంగా నా గుండెను గిల్లా అయ్యో అయ్యో ఎందుకిలా
నన్నే తాకి అల్లరి పెట్టిన చిరుగాలెక్కడ దాగినదే
తుంటరి పైటకి ముద్దులు పెట్టి నాలో విరహం రేపినదే
అందాలూరే చిలకమ్మ శ్వాసలతో నిను తడిపెయ్‌నా
ఆకాశంలో దాగునా ఎన్నడు నిను వీడనమ్మ
నిను చేరకపోతే జీవితమంతా వ్యర్ధం అయిపోదా

ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే

యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా

చరణం2:

పిల్లా నీకై పరుగులు పెడితే లవ్యూ లవ్యూ అంటావా
పాపం అయ్యో పిచ్చోడంటూ పక్కకు తిరిగి నవ్వుతావా
ఊహల తలుపులు నువు తెరిచేస్తే ఊపిరి నేనై వచ్చేయ్‌నా
ముచ్చటగా నువు ఓకే అంటే ఒళ్ళో డేరా వేసేయ్‌నా
యెస్ అని నువ్వు చెప్పేస్తే మీదే పడిపోనా
లేదు కాదు అన్నావో చెలియా బ్రతుకుట నాతరమా
నేనింకొకసారి మళ్ళీ పుడితే నిన్నే ప్రేమిస్తా

ఏదో ఒక నాడు సఖియా
నీ ప్రేమే దొరకునని
ఇలాగే వేచి ఉంటా నన్నిక ఆపొద్దే

యాపిల్ పిల్లా నీవెవరో
ఐస్‌క్రీం చెలియా నీవెవరో
కళ్ళల్లోన మెదిలే కలవే నీవా
పుత్తడి పువ్వా నీవెవరో
పచ్చని చిలక నీవెవరో
మోహంలో నను ముంచిన మగువా రావా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

05-Oct-2011

పౌర్ణమి

గాత్రం: చిత్ర
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి




పల్లవి:

శంబో శంకర
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
హర హర మహాదేవ
తద్దిందాదిమి దిందిమి పరుల తాండవకేళి తత్పర
గౌరిమంజుల సింజినీ జతుల లాస్యవినోదవ శంకర

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేస
నీలకందరా జాలిపొందరా కరుణతో ననుగనరా
నీలకందరా శైలమందిరా మొర విని బదులిడరా
నగజా మనోజ జగదీశ్వర బాలేందు శేఖర శంకర
భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేస

హర హర మహాదేవ హర హర మహాదేవ

చరణం1:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
హా అంతకాంత నీ సతి అగ్నితప్తమైనది
మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది
ఆదిశక్తి ఆకృతి అత్రిజాత పార్వతి
తానువైన ప్రాణదవుని చెంతకు చేరుకున్నది
హా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
భవుని భువుకి తరలించేలా
తరలి దివిని తలపించేలా
రసతరంగిణివేళ ఎదని దౌత్య జతులు చేయగలిగే ఈ వేళ

భరత వేదముగ నిరత నాట్యముగ కదిలిన పదమిది ఈశ
శివ నివేదనగ అవని వేదనగ పలికెను పదము పరేస

జంగమసావర గంగార్చిత శివ మృద మంజులకర పుర హరా
భక్త శుభంకర భవనాశంకర స్వర హర దక్షా త్వర హరా
పాలవిలోచన పాలిత జన గన కాల కాల విశ్వేశ్వరా
ఆసుతోష అవినాస నిశాచర జయగిరీశ బృహదీశ్వరా

చరణం2:

వ్యోమకేశ నిను హిమగిరి వర సుత ప్రేమ పాశమున పిలువంగా
యోగివేష నీ మనసున కలగద రాగలేసమైనా
హే మహేశ నీ భయతపదాహతి దైత్య శోషణము జరుపంగా
భోగిభూష భువనాలిని నిలుపవ అభయముద్రలోన
నమక చమకముల నాదాన
యమక గమకముల యోగాన
పలుకుతున్న ప్రాణాన
ప్రణవనాద ప్రదమనాద శృతి విననా

హర హర మహాదేవ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

03-Oct-2011

బంగారు తిమ్మరాజు

తారాగణం: కాంతారావు, రాజశ్రీ
గాత్రం: యేసుదాసు (తొలి పాట)
సాహిత్యం: ఆరుద్ర
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంస్థ: గౌరి ప్రొడక్షన్స్
విడుదల: 1964



పల్లవి:

ఓ నిండు చందమామ నిగనిగల భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ నిండు చందమామ

చరణం1:

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే
నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే
మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
మేలుకున్న స్వప్నములోన ఏల ఇంత బిడియపడేవు
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా ఓ ఓ ఓ ఓ ఓ ఓ

నిండు చందమామ నిగనిగల భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ నిండు చందమామ

చరణం2:

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే
నీదు మనసు నీలో లేదు నాలోనె లీనమయే
నీదు మనసు నీలో లేదు నాలోనె లీనమయే
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే ఓ ఓ ఓ ఓ ఓ ఓ

నిండు చందమామ నిగనిగల భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా
ఓ ఓ ఓ ఓ ఓ ఓ నిండు చందమామ


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~