Dec 19, 2009

వెంగమాంబ

గాత్రం: కీరవాణి,రమ్య
సాహిత్యం: వేటూరి




పల్లవి:

సప్తగిరీశుని వేంకటేశుని సప్తస్వర మణిమాలికగా
అల మంగమాంబ తలపే
ఇల మంగమాంబ కడుపై
హస్తకమలమే ఆడబిడ్డగా
అగ్నిపుత్రి జననం ఇది ఆంధ్రశక్తి అవతరణం
ఆంధ్రశక్తి అవతరణం

చరణం1:

ఉలకని పలకని ఏడవని ఊపిరి బొమ్మను చూచుకొని
తల్లడిల్లిన తల్లిని చూచి సాధువొకడు వచ్చి
ఆ ఆ ఆ ఆ
పాప చెవిలోన పాపవినాశక మంత్రమొకటి ఊదె
మంత్రమొకటి ఊదే
ఓం నమో: వేంకటేశాయ
ఓం నమో: వేంకటేశాయ

చరణం2:

ఉలికిన పాపే తొలకరి మెరుపై
పలికిన పాపే వెలుగు వేలుపై
ఎదలో ఉన్న ఏడుకొండల విభుని నీడని వాడని వలపై
ఎదిగె వేంగమాంబ
ఎదిగె వేంగమాంబ
ఒదిగె వేంగమాంబ

చరణం3:

వేంకటపతియే నా పతి అన్నది పసిపాప వేంగమాంబ
తిరుమల కోవెల అత్తిళ్ళన్నది సిరికన్నె వేంగమాంబ
నివ్వెరపోయిరి బంధుజనం
అచ్చెరువొందిరి ఊరుజనం
వేంకటపతి అను బాలునితో వేగమె జరిగెను కళ్యాణం

చరణం4:

అభినవ బోధ ఆమె కథ
అపుడిక రాధే తాను సదా
అలమేల్మంగకు తెలిసె కధ
ఆనంద నిలయమే ఆమె కథ
కర్పూర హారతే ఆమె కథ
కడలేని హారతే ఆమె కథ
కర్పూర హారతే ఆమె కథ
కడలేని హారతే ఆమె కథ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment