Jan 22, 2010

గోపి గోపిక గోదావరి

తారాగణం: వేణు,కమలిని ముఖర్జీ
గాత్రం: కార్తీక్,కౌసల్య,వంశీ
సాహిత్యం: రామజోగయ్యశాస్త్రి
సంగీతం: చక్రి
దర్శకత్వం: వంశీ
నిర్మాత: వల్లూరిపల్లి రమేష్
సంస్థ: ఆనందీ ఆర్ట్స్ & మహర్షి సినిమా
విడుదల: 2009

పల్లవి:

బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో
చూపులు కలుపుకో పాపలు చదువుకో సంగతి తెలుసుకో కూ కూ
వలపు రాదారి కబురు పెడుతోంది చేరుకో
రమ్మని పిలుచుకో చెంతకు నడుపుకో పక్కన నిలుపుకో కూ కూ
దరి దాటి పరుగైన వేగమా
నను చూడగా అంత ఆత్రమా
నిన్ను చేరందే నిలవనంటోంది ఫూత పరువాల పూర్ణిమ
అవునా అవునా
బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో
చూపులు కలుపుకో పాపలు చదువుకో సంగతి తెలుసుకో కూ కూ
వలపు రాదారి కబురు పెడుతోంది చేరుకో
రమ్మని పిలుచుకో చెంతకు నడుపుకో పక్కన నిలుపుకో కూ కూ

చరణం1:

గువ్వల్లో గోరింక నేను చుక్కల్లో నెలవంక నేను
నీ చేతి గోరింట నేను వీలైతే గుర్తించు నన్ను
అవునా అవునా
నా జంట నీడల్లే నిన్ను ఇన్నాళ్ళు చూసింది కన్ను
ఇంకోలా ఇవ్వాళ నేను నిన్నెట్టా ఊహించుకోను
అవునా అవునా
పలు రంగుల పున్నమి నీవు
రవి చూడని ఆమని నీవు
నీ తొందరకు బదులివ్వనిదే ఎలా ఊరుకోను
అవునా అవునా

బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో
చూపులు కలుపుకో పాపలు చదువుకో సంగతి తెలుసుకో కూ కూ
వలపు రాదారి కబురు పెడుతోంది చేరుకో
రమ్మని పిలుచుకో చెంతకు నడుపుకో పక్కన నిలుపుకో కూ కూ

చరణం2:

లోలోన ఆరాటం ఉంది నీ రూపు చూడాలనుంది
విరహాల రాగాలు మీటి నీ పాటే పాడాలనుంది
అవునా అవునా
నాక్కూడా నీలాగే ఉంది మనసేమో ఉప్పొంగుతోంది
నూరేళ్ళు వర్దిల్లమంది నీ జంటా చేరాలనుంది
అవునా అవునా
హరివిల్లే ఇటు ఒరిగింది
చెలి చెంపలు ముద్దాడింది
కల నిజమయ్యే నా పరవశమే ఇలా నవ్వుతోంది
అవునా అవునా

బాల గోదారి ఉలికి పడుతోంది ఎందుకో
చూపులు కలుపుకో పాపలు చదువుకో సంగతి తెలుసుకో కూ కూ
వలపు రాదారి కబురు పెడుతోంది చేరుకో
రమ్మని పిలుచుకో చెంతకు నడుపుకో పక్కన నిలుపుకో కూ కూ
దరి దాటి పరుగైన వేగమా
నను చూడగా అంత ఆత్రమా
నిన్ను చేరందే నిలవనంటోంది ఫూత పరువాల పూర్ణిమ
అవునా అవునా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment