Feb 20, 2010

ప్రేమించుకుందాం రా

గాత్రం: బాలు,చిత్ర,సంగీతసజిత్
సాహిత్యం: భువనచంద్ర

పల్లవి:

సంబరాల తోటలో వలపుమొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజితీగలా ప్రియున్ని ఎట్టా హత్తుకుంది చూడరా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయిజన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
నీడలాగ తోడు వుంటా పారిజాతమా
గుండెలోనె దాచుకుంటా నిన్ను ప్రాణమా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం1:

నీవాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలినాక సిగ్గునౌతా
నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చు గున్నమావి చెట్టునవుతా
నా నవ్వులె నీవంట కంటిపాపలాగ నిన్ను చూసుకుంటా
కన్నీటిని పంచుకుంటా కాలమంత నీకు నేను కావలుంటా
ప్రేమకన్న గొప్పదేది సృస్టిలోన లేదురా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా

చరణం2:

ధనమున్నా లేకున్నా గుప్పెడంత ప్రేమవుంది గుండెలోన
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి వుండలేను క్షణమైనా
ఆమాటే చాలునంట ఎన్ని బాధలైనా నేను ఓర్చుకుంటా
నీచేయి పట్టుకుంటా కాళ్ళు కడిగి నన్ను నేనే ఇచ్చుకుంటా
సృస్టిలోనె అందమైన ప్రేమ జంట మీదిరా

చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
ఆయ్ నుదిటిబొట్టు మీద ఒట్టు నిన్ను వీడను
మల్లెపూల మీద ఒట్టు మాట దాటను
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నొ చూడనా
లక్షమాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వేయిజన్మలేలరా వలపు పండు ఒక్కరోజు చాలురా

~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment