May 29, 2010

శ్రీరామదాసు

గాత్రం: శంకర్ మహదేవన్,విజయ్ యేసుదాసు
సాహిత్యం: శ్రీ వేదవ్యాస



పల్లవి:

అల్లా ఆ ఆ ఆ
శ్రీరామా ఆ ఆ ఆ

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు
కళ్యాణగుణగణుడు కరుణాఘనాఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనందనందనుడు అమృతరసచందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం
తాగరా శ్రీరామనామామృతం ఆ నామమే దాటించు భవసాగరం

చరణం1:

ఏ మూర్తి మూడు మూర్తులుగ వెలసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జెగంబుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్యస్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి
ఏ మూర్తి గుణకీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మల ఆర్తి
ఆ మూర్తి ఏమూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

మాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీరామ
మాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపనిమపమ కోదండరామ
మపరిసనిసాని పానిపమ సీతారామ
మపనిసరిసారి సరిమరిసనిపమ ఆనందరామ
మ మ రిమరిమ రిసమ
రామ జయరామ
సరిమ రామ సపమ రామ పావనామ

చరణం2:

ఏ వేల్పు ఎల్ల వేల్పులని గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు
ఏ వేల్పు నిట్టూర్పు ఇలని నిల్పు
ఏ వేల్పు నిఖిల కళ్యాణముల కలగల్పు
ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగినేలలను కల్పు
ఏ వేల్పు ద్యుతిగొల్పు
ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దేమల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసుల కైమోడ్పు

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీరామనామామృతం
ఆ నామమే దాటించు భవసాగరం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: