Jun 4, 2010

మరో చరిత్ర

సాహిత్యం: ఆత్రేయ
గాత్రం: వాణీజయరాం





పల్లవి:

విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విధిచేయు వింతలన్నీ మతిలేని చేతలేనని
విరహాన వేగిపోయి విలపించే కధలు ఎన్నో
విలపించే కధలు ఎన్నో

చరణం1:

ఎదురు చూపులు ఎదను పిండగా ఏళ్ళు గడిపెను శకుంతల
విరహ బాధను మరచి పోవగా నిదుర పోయెను ఉర్మిళ
అనురాగమే నిజమని మనసొకటి దాని ఋజువనీ
తుది జయము ప్రేమదేనని బలి అయినవి బ్రతుకులెన్నో
విధిచేయు వింతలన్నీ

చరణం2:

వలచి గెలిచి కలలు పండిన జంట లేదీ ఇలలో
కులము మతమో ధనము బలమో గొంతు కోసెను తుదిలో
అది నేడు జరుగ రాదని ఎడడబాసి వేచినాము
మన గాధె యువతరాలకు కావాలి మరో చరిత్ర
కావాలి మరో చరిత్ర


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment