Jun 9, 2010

పులి బెబ్బులి

తారాగణం:కృష్ణంరాజు,చిరంజీవి,జయప్రద
గాత్రం:బాలు,సుశీల
సంగీతం: రాజన్ నాగేంద్ర
దర్శకత్వం :కె.యస్.ఆర్.దాస్
విడుదల:(1983)




పల్లవి:

పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో
ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో
ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది

చరణం1:

నవ్వగనె నవయవ్వనమె పువ్వులు రువ్విందిలే
తానే విరితేనై తానాలు ఆడిందిలే
నిన్ను గని ఎద కోయిలగ రాగాలు తీసిందిలే
నాలో ఎలమావి ఉయ్యాలలూగిందిలే
చెలిమికిదే చైత్రమనీ నా ఆశ పూసింది అందాల బృందావిహారాలలో
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది

చరణం2:

అందమిదే మకరందమిదే నా జీవితానందమే
నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే
బంధమిదే సుమగంధమిదే ఏ జన్మ సంబంధమో
నాలో విరితావి వెద జల్లిపోయిందిలే
జాబిలిగా వెన్నెలగా ఈ జంట కలిసింది కార్తీక పూర్ణిండు మాసాలలో ఆ ఆ ఆ ఆ

పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది
మౌనమే గానమై మాధుమాస వేళలో
మౌనమే గానమై మాధుమాస వేళలో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment