Jul 16, 2010

బొమ్మరిల్లు

తారాగణం: సిద్దార్థ్,జెనీలియా,ప్రకాష్‌రాజ్,జయసుధ
గాత్రం: సాగర్,సుమంగళి
సాహిత్యం: సీతారామశాస్త్రి
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాత: దిల్‌రాజు
దర్శకత్వం: భాస్కర్
సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
విడుదల: 2006




పల్లవి:

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా
నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ
ఎందరితో కలిసున్నా
నేనొంటరిగానే ఉన్నా
నువ్వొదిలిన ఈ ఏకాంతంలోన ఓ
కన్నులు తెరిచే ఉన్నా
నువ్వు నిన్నటి కలవే అయినా
ఇప్పటికీ ఆ కలలో నే ఉన్నా
నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ

చరణం1:

ఈ జన్మంతా విడిపోదీ జంట
అని దీవించిన గుడిగంటను
ఇక నా మది వింటుందా
నా వెనువెంట నువ్వే లేకుండా
రోజూ చూసిన ఏ చోటైన నను గుర్తిస్తుందా
నిలువున నను తడిమి అలా
వెనుదిరిగిన చెలిమి అల
తడి కనులతో నిను వెతికేది అలా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ

చరణం2:

నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో
కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా
నా ఊహల్లో కలిగే వేదనలో
ఎన్నాళ్ళైన ఈ నడిరాతిరి గడవదు అనుకోనా
చిరునవ్వుల పరిచయమా
సిరివెన్నెల పరిమళమా
చేజారిన ఆశల తొలివరమా

నమ్మక తప్పని నిజమైనా
నువ్విక రావని చెబుతున్నా
ఎందుకు వినదో నా మది ఇపుడైనా ఓ
ఎవ్వరు ఎదురుగ వస్తున్నా
నువ్వేమో అనుకుంటున్నా
నీ రూపం నా చూపుల నొదిలేనా ఓ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment