తారాగణం: పవణ్‌కళ్యాణ్, సుప్రియ
గాత్రం: మనో, చిత్ర
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: కోటి
నిర్మాత: అల్లు అరవింద్
దర్శకత్వం: ఈవివి.సత్యనారాయణ
సంస్థ: గీతా ఆర్ట్స్
విడుదల: 1996
పల్లవి:
చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా
ఎందుకమ్మా ఓ సందెభామ
చెలి చోలి రమ్మంది అందుకమ్మా
ఎందుకమ్మా ఓ చందమామ
మది నిండా మన్మధకాండ
ఇది తూటా తమ్ముడి ట్రెండా
నవ రంభల్లో యువ రాంబోతో జయహో
చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా
ఎందుకమ్మా ఓ చందమామ
చరణం1:
హోయ్ చిగురు తొడిగిన పైటకు ఫ్రైడే
పొగరు రేగిన సొగసుకు సండే
పలుకు తిరిగిన వలపుకు మండే వచ్చిందిలే
తడవ తడవకు కుదిరెను మూడే
గడియ గడియకు అదిరెను ఈడే
నడక రగిలిన నడుముకు వేడే రెచ్చిందిలే
మగువల చూపే యావత్తు మదనుని తాయెత్తు
తనువున పొంగే విద్యుత్తు త్వరపడి దండెత్తు
జనవరిలో మనగురిలో మతిచెడి జతపడదాం
ఓ జతపతితో జగడములో చకచక సుఖపడదాం
చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా
ఎందుకమ్మా ఓ చందమామ
చరణం2:
హా అలుపు తెలియని హాయిని చూపి
తలచి తీయర తీయని కూపీ
చిలిపి పనులకు పెట్టను ఐపి ఈ కైపులో
పెదవి పెదవికి మధువులు నింపి
అడుగు అడుగున హంసను దింపి
పడుచు వయసుకు పెంచకు బీపీ ఈ ఊపులో
కలబడి చూపేయ్ దుప్పట్లో మెలిపడు టాలెంటు
త్వరపడిరాదు ఇప్పట్లో విరహపు వారెంటు
కసి మెరుపే కొసమెరుపై గుసగుస మొదెలెడదాం
ఓ ఉసిగొలిపే రసగినికే మిసమిస పని పడదాం
చలిగాలి ఝుమ్మంది ఎందుకమ్మా
ఎందుకమ్మా ఓ సందెభామ
చెలి చోలి రమ్మంది అందుకమ్మా
ఎందుకమ్మా ఓ చందమామ
మది నిండా మన్మధకాండ
ఇది తూటా తమ్ముడి ట్రెండా
నవ రంభల్లో యువ రాంబోతో జయహో హో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment