గాత్రం: బాలు, చిత్ర
పల్లవి:
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ
పెళ్ళిదాక ఆగవంట
కళ్ళతోటి పెళ్ళయ్యింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
చరణం1:
ఆద్యంతమూ లేనీ అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్య భావము, ప్రేమ దైవ రూపము
ప్రేమ జీవ రాగము, ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవి లేనిదీ అందమైన ప్రేమ
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ
పెళ్ళిదాక ఆగవంట
కళ్ళతోటి పెళ్ళయ్యింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు హాహ హాహ
ఒక్క ముద్దు
చరణం2:
ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము, నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము, నేను నీకు ప్రాణము
ప్రతి రోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతి రేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
వద్దు వద్దు అంటు పోతే చిన్నదాన
ఎప్పుడంట ఇచ్చేదంట
కన్నె ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ
పెళ్ళిదాక ఆగవంట
కళ్ళతోటి పెళ్ళయ్యింది చాల్లే
ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు
ఇవ్వు ఇవ్వు హాహ హాహ
ఒక్క ముద్దు
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment