Aug 23, 2010

వీరాభిమన్యు

గాత్రం: ఘంటసాల, సుశీల
సాహిత్యం: ఆరుద్ర



పల్లవి:

రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు

రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
నన్నే వెదకుచు భూమికి దిగిన కన్యక రతియే కాబోలు
ఇంద్రుని చంద్రుని అందాలు ఈతని సొమ్మే కాబోలు
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు

చరణం1:

తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా
తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా
పరవశించి పడుచువానికి వధువు కానీ సొగసేలా
పరవశించి పడుచువానికి వధువు కానీ సొగసేలా

రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు

చరణం2:

కలికి సరసన పులకరించి కరగి పోవని తనువేలా
కలికి సరసన పులకరించి కరగి పోవని తనువేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా
ఎడము లేక ఎదలు రెండూ ఏకమవనీ బ్రతుకేలా

రంభ ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె
మౌనముగానే మనసును దోచే మన్మధుడితడే కాబోలు
కన్నెక రతియే కాబోలు
మన్మధుడితడే కాబోలు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment