Aug 27, 2010

ష్...

గాత్రం: చిత్ర
సాహిత్యం: వేటూరి





పల్లవి:

ఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలి
నన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరి
ప్రతీ కొత్త ఉదయం సదా నా వశం
ఇలా హాయి పయనం నాకో వరం
ఊహలపల్లకి నన్నే ఊరిస్తున్నది మనస్సంతా మబ్బుల్లో తేలి
నన్నే కొత్తగా నాకే చూపిస్తున్నది ఇలా ఆశగా నన్ను చేరి

చరణం1:

నా అందచందాలతో బంధాలు వేసేయనా ఆనంద నాట్యాల వీధుల్లో
నాజూకు నా సోకుతో రోజాలు పూయించనా ఓ ముళ్ళు దాగున్న గుండెల్లో
అజంతాలో బొమ్మలే చెలించేనా
నిజంగానే ఊహలు ఫలించేనా
విధే చేసే వింతలో సుఖాలేనా
శృతే మించే ఆశలో సుమించేనా

చరణం2:

ఓ కొత్త లోకానికి ఆహ్వానమందించగా ఉన్నానిలా వేయి ఊహల్లో
వెన్నెల్లో గోదారిలా మల్లెల్లో పూదారిలా నే సాగనా కోటి ఆశలతో
మయూరంలా మబ్బుకై తపించేనా
చకోరంలా వెన్నెలే వరించేనా
సినీతారై లోకమే చెలించేనా
వసంతంలా నవ్వుతూ గతించేనా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: