Sep 6, 2010

శ్రీరామదాసు

గాత్రం: బాలు
సాహిత్యం: రామదాసు



పల్లవి:

రామా శ్రీరామా కోదండ రామా
ఎంతో రుచిరా
ఎంతో రుచిరా
శ్రీరామ ఓ రామ శ్రీరామ
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

చరణం1:

కదళీ ఖర్జూరాది ఫలముల కన్నను
కదళి ఖర్జూరాది ఫలముల కన్నను
పతిత పావన నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
నవసర పరమాన్న నవనీతముల కన్న
అధికమౌ నీ నామమేమి రుచిరా
శ్రీరామ అహ శ్రీరామ
ఓ రామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా

చరణం2:

సదాశివుడు నిను సదా భజించెడి
సదానంద నీ నామ మేమి రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
అరయ భద్రాచల శ్రీరామదాసుని
ఏలిన నీ నామ మేమి రుచిరా
శ్రీరామ ఓ రామ
శ్రీరామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
ఓ రామ నీ నామమెంతో రుచిరా
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా
శ్రీరామ నీనామమెంతో రుచిరా
ఎంతో రుచిరా

~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment