Sep 17, 2010

ప్రేమికులు

తారాగణం: యువరాజ్,కామ్నా జెఠ్మలాని
గాత్రం: బాంబే జయశ్రీ
సంగీతం: సాజన్
దర్శకత్వం: బి.జయ
నిర్మాత: బి.ఎ.రాజు
సంస్థ: సూపర్‌హిట్ ఫ్రెండ్స్
విడుదల: 2005





పల్లవి:

ఆమని కోయిలనై పాట పాడే క్షణం
ఆశల పల్లకిలో ఊగదా ఈ జగం
సిరిమువ్వలా మోగాలనే మదిలోని చిరు కోరిక
పాలగువ్వలా వినువీధిలో ఎగరాలనే వేడుక
ఆ గోదారల్లే పారాలంటు నా గుండెల్లో ఏదో ఘోష
ఆమని కోయిలనై పాట పాడే క్షణం
ఆశల పల్లకిలో ఊగదా ఈ జగం

చరణం1:

నే సాగిన ఈ దారిలో ముళ్ళేదీ లేకుండా కుసుమాలే విరియాలి
నేనే కోరితే ఆ జాబిలి సిగలోన ఒదిగున్న పువ్వల్లే మారాలి
ఆ తారాతోరం నేను ఈ దోసిట పట్టాలంటూ
ముత్యాల హారంగానే వెయ్యాలంటూ
అట్లాంటిక్ ఓషన్‌లోన డాల్ఫినై ఈదాలంటూ
ఎవరెస్టు శిఖరంనుండి జారాలంటూ
హే సూరీడైనా పోటీకొస్తే ఓడాలని ఆశలే
ఆమని కోయిలనై పాట పాడే క్షణం
ఆశల పల్లకిలో ఊగదా ఈ జగం

చరణం2:

చిరుజల్లులే తుళ్ళితుళ్ళి పన్నీరై ఈ దేహం పులకింతై పోవాలి
ఈ సెలయేరుయే పారాణిగా పాదాలే తాకంగా తుళ్ళింతై ఆడాలి
రాచిలకై ఆకాశంలో ఏకంగా ఎగరాలంటూ
ఓ చినుకై చిగురాకుల్లో మెరవాలంటూ
ఐలాండు దీవుల్లోన టెంటేసి ఆడాలంటూ
మూన్‌లైటే నాట్యం చేసి ఆడాలంటూ
హే అలలకి ఉయ్యాలై ఊగాలని కోరికై

ఆమని
ఆమని కోయిలనై పాట పాడే క్షణం
ఆశల పల్లకిలో ఊగదా ఈ జగం
సిరిమువ్వలా మోగాలనే మదిలోని చిరు కోరిక
పాలగువ్వలా వినువీధిలో ఎగరాలనే వేడుక
ఆ గోదారల్లే పారాలంటు నా గుండెల్లో ఏదో ఘోష
ఆమని కోయిలనై పాట పాడే క్షణం
ఆశల పల్లకిలో ఊగదా ఈ జగం

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: