Dec 10, 2010

పెద్దన్నయ్య

గాత్రం: బాలు, చిత్ర



పల్లవి:

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారక
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ

చరణం1:

సిరికోయిల చిలిపి వలపే పాడేనమ్మ
ఎదలోయల కనులే కలలై పండేనమ్మ
నిను చేరితే మనసే వయసై పిలిచేనమ్మ
నిదరోయిన సొగసే ఎదురై వలచేనమ్మ
మనసే మనువాడగా జతగా పెనవేయనా
ఊర్వశే ప్రేయసై వధువుగ వెలసెను కౌగిట
కంటికే దీపమై గగనము విడిచెను తారక

చరణం2:

సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ
మరమోలిక వలపై వగలే విసిరేనమ్మ
మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ
సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ
జరిగే మన పెళ్ళికి జగమే విరిపల్లకి
ఏకమై పోయిన మమతలు వెన్నెల కాయగా

కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల
పరిచయమైనవి పరువాలు
పరవశమైనవి హృదయాలు
కంటికే దీపమై గగనము విడిచెను తారక
కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ
కలలే నిజమైన వేళ మనువొక రసలీల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment